MBNR: అయ్యప్ప స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం జడ్చర్ల మండలం పెద్ద ఆదిరాల గ్రామంలో అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి మాజీ మంత్రి హాజరయ్యారు. గ్రామస్తులంతా కలిసి అయ్యప్ప స్వామిని ప్రతిష్టించుకోవడం పూర్వజన్మ సుకృతం అన్నారు. ఈ సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.