MHBD: గూడూరు మండలం లక్ష్మీపురం గ్రామంలో రైతు బండ్ల సమ్మయ్య పొలం బావి వద్ద బుధవారం మొసలి కనిపించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. పాకాల ఏరు ద్వారా మొసలి వచ్చినట్లు గ్రామస్ధులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అటవీ శాఖ అధికారులు స్పందించి మొసలిని పట్టుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.