BPT: బాపట్ల మండలం మరుప్రోలువారి పాలెం గ్రామంలో ‘ఎన్టీఆర్ భరోసా’ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు స్వయంగా పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఇంటింటికీ వెళ్లి వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు నగదు అందజేస్తూ వారి యోగక్షేమాలను ఎమ్మెల్యే ఆరా తీశారు.