ASF: సిర్పూర్ (టీ)మండల కేంద్రంలోని CHC ని జిల్లా కలెక్టర్ హరిత బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని రికార్డ్స్ పరిశీలించారు. అనంతరం ఆసుపత్రి వార్డులు, ఔషధ కేంద్రంను పరిశీలించి, రోగులకు సరిపడా మందులు ఉన్నాయా లేవా అని పరిశీలించారు. ఆస్పత్రికి వచ్చిన రోగులతో మాట్లాడి ఏ విధమైన వైద్య సేవలు అందుతున్నాయని అడిగి తెలుసుకున్నారు.