KMR రాజంపేటలోని పశువైద్య శాల దుస్థితిపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి కురిసిన స్వల్ప వర్షానికి ఆసుపత్రి ప్రాంగణంలోకి భారీగా నీరు చేరి చెరువును తలపించింది. ప్రతి సారి వర్షం కురిసినప్పుడు నీరు నిల్వ ఉండటంతో పశువులకు చికిత్స అందించడం సిబ్బందికి కష్టతరంగా మారింది. ఈ సమస్యపై పదేపదే అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని, తక్షణమే నూతన భవనం నిర్మించాలి డిమాండ్ చేస్తున్నారు.