TG: రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను అమలు చేయడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ వంశీకృష్ణ ఆరోపించారు. ప్రధానంగా బనకచర్ల ప్రాజెక్టుకు రూ.లక్ష కోట్లు కేటాయించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. దీని వల్ల తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. ఏపీలో ఇప్పటికే 9 విమానాశ్రయాలు ఉన్నాయని.. కొత్త విమానాశ్రయాల కేటాయింపులో TGను విస్మరించడం సరికాదన్నారు.