బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ సాజిద్ ఖాన్‌కు చేదు అనుభవం ఎదురైంది. తన కొత్త మూవీ ‘మిషన్ మజ్ను’ ప్రమోషన్లో బిజీగా ఉన్నారు. ప్రమోషన్లో ఓ స్వామిజీ కనిపించారు. సెల్ఫీ తీసుకున్నాక.. జై శ్రీరాం అనాలని కోరారు. ఇంకేముంది సాజిద్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. జై శ్రీరాం అనాలని మూడుసార్లు అడిగారు. అలా అనడం వీడియోలో రికార్డ్ అయ్యింది.
సాజిద్ ఖాన్ ఇటీవలే బిగ్ బాస్-16 హౌస్ నుంచి వచ్చారు. జర్నీ ఎలా ఉంది? ఎవరు టైటిల్ గెలుస్తారు అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. ఇంతలోనే స్వామిజీ వచ్చి జై శ్రీరాం అనాలని కోరారు. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతుంది. నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఇలాంటి వారు ఉన్నందున దేశం ఇంక వెనుకబడి ఉందని ఓ యూజర్ కామెంట్ చేశారు. ఒకరికి ఇష్టం లేకున్నా నినాదించాలని (జై శ్రీరామ్) ఎలా కోరతారని ప్రశ్నించారు. నేను హిందువుని అని కానీ జై శ్రీరాం అనాలని కోరబోనని చెప్పారు. అల్లాహ్ అక్బర్ అనాలని కూడా కోరద్దు అని స్పష్టంచేశారు. చాలా మంది సాజిద్ ఖాన్‌కు అండగా నిలిచి, కామెంట్స్ చేశారు. సాజిద్ హీరోయిన్స్, మోడల్స్‌ను లైంగికంగా వేధిచారని కొందరు అభిప్రాయ పడ్డారు. మిషన్ మజ్నులో మూవీలో సిద్దార్థ్ మల్హోత్రా- రష్మిక మందన్న నటిస్తున్నారు. తదుపరి సినిమా 100 పర్సెంట్ కోసం బిగ్ బాస్ 16 నుంచి సాజిద్ ఖాన్ బయటకు వచ్చారు. ఈ మూవీలో రితేశ్ దేశ్ ముఖ్, షెహనాజ్ గిల్, నోరా ఫతేహి, జాన్ అబ్రహాం నటీనటులుగా చేస్తున్నారు.