JGL: హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో జగిత్యాల కలెక్టర్ బి. సత్యప్రసాద్ పాల్గొన్నారు. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న “ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక” అమలుపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.