HYD: బాచుపల్లి PS పరిధిలోని ప్రగతినగర్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ప్రగతినగర్ కమాన్ వద్ద వరుసగా ఫర్నిచర్ షాపులు ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో ఒక దుకాణంలో సిలిండర్ పేలి మంటలు ఎగిసిపడుతూ పక్కన షాపుల్లోని సామగ్రికి అంటుకుని తీవ్ర రూపం దాల్చాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. స్థానికులు ప్రాణభయంతో అక్కడినుంచి పరుగులు తీస్తున్నారు.