సత్యసాయి: పుట్టపర్తిలో గురువారం జరగాల్సిన దివ్యాంగులకు మూడు చక్రాల స్కూటర్ల అర్హత ఎంపిక శిబిరం అనివార్య కారణాలతో వాయిదా పడింది. జేసీ మౌర్యభరద్వాజ్ మంగళవారం ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. మార్చి 5న జరగవలసిన ఈ ప్రక్రియను ప్రస్తుతానికి నిలిపివేసినట్లు పేర్కొన్నారు. తదుపరి తేదీని అధికారికంగా ప్రకటించే వరకు అభ్యర్థులు ఎవరూ పుట్టపర్తికి రావద్దని సూచించారు.