SRPT: చిలుకూరు మండలం సీతారాంపురం గ్రామంలో ఉపాధి హామీ నిధులతో నిర్మించిన గొర్రెలు, మేకల షెడ్లను, మంగళవారం సూర్యాపేట జిల్లా జడ్పీ ఇన్ఛార్జ్ సీఈవో శిరీష పరిశీలించారు. పనుల వివరాలను రికార్డుల్లో స్పష్టంగా నమోదు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం గ్రామంలోని నర్సరీని సందర్శించి మొక్కల రక్షణకు షెడ్ నెట్లు ఏర్పాటు చేయాలని సూచించారు.