ATP: ఏపీ మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో కణేకల్లులో బుధవారం నుంచి పప్పుసెనగల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తెలిపారు. క్వింటాలు కనీస మద్దతు ధర రూ.5875 ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని రాయదుర్గం నియోజకవర్గ రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.