Kamareddy District : మాచారెడ్డి లో ఫారెస్ట్ ఆఫీసర్లను బంధించిన తండా వాసులు
అటవీ అధికారులకు, ఆదివాసీలకు, తండా ప్రాంత ప్రజలకు మధ్య వాగ్వాదాలు జరుగుతున్నాయి. అంతేకాక అటవీ ప్రాంత ప్రజలు.. తమ ప్రాంతానికి వచ్చిన అధికారులపై దాడులు కూడా చేస్తున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లా(Kamareddy District) లో అలాంటి ఘటన జరిగింది
కామారెడ్డి జిల్లా (Kamareddy District) మాచారెడ్డి మండలం పాత ఎల్లంపేట పరిధిలోని అటవీ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొంది. ఫారెస్ట్ అధికారులను తండా వాసులు బంధించారు. అటవీ భూమి(Forest land)ని చదును చేస్తుండగా అధికారులు అక్కడికి వెళ్లారు. తండావాసుల్ని అడ్డుకోగా.. వాళ్లు ఉల్టా అధికారుల్ని బంధించారు. అక్కాపూర్ -మైసమ్మ చెరువు దుర్గమ్మ గుడి తండా సమీపంలోని అటవీ భూమిని అక్కడి ప్రజలు (people) చదును చేస్తున్నారు. ఆ సమయంలో అటవీ అధికారులు అక్కడికి వచ్చి అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆగ్రహించిన తండా వాసులు.. అధికారుల్ని బంధించారు. ఈ ఘటనపై స్థానిక మాచారెడ్డి (Machareddy) పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు మాచారెడ్డి డిప్యూటీ రేంజ్ అధికారి రమేష్. దీంతో.. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గత కొంతకాలం నుంచి అటవీ అధికారులకు, ఆదివాసీల(Adivasis)కు మధ్య ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. గతంలో ఖమ్మం జిల్లా(Khammam District)లో శ్రీనివాసరావు అనే అటవీ అధికారిని ఓ ఆదివాసీ తెగ బాణలతో కొట్టి చంపేసింది. ఈ క్రమంలో తమ ప్రాణాలకు రక్షణ లేదంటూ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.