తెలంగాణ (Telangana) లో ఎండలు దంచికొడుతుండడంతో మద్యం ప్రియులు బీర్లు (Beers) తెగ తాగేస్తున్నారు. ఒకవైపు సూరీడు మండిపోతున్నాడు. ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ఉక్కపోత.. వీటి నుంచి సేద తీరేందుకు మద్యం ప్రియులు చిల్డ్ బీర్ కావాలంటున్నారు. గత కొన్నాళ్ళుగా ఎండలు ఎక్కువవటంతో బీర్ల అమ్మకాలు బాగా పెరిగాయి.మే 1వ తేదీ నుంచి 18వ తేదీ వరకు రికార్డు స్థాయిలో 4.23 కోట్ల బిర్‌లు అమ్ముడయ్యాయని గణాంకాలు (Statistics) చెబుతున్నాయి. ఒక్క నల్గొండ (Nalgonda) జిల్లాలోనే 3.36 లక్షల కార్టన్ల బీరు తాగేశారట. ఆ తర్వాతి స్థానంలో కరీంనగర్ జిల్లా ఉంది. కేవలం బీర్లతోనే ప్రభుత్వానికి రూ.583 కోట్ల ఆదాయం వచ్చినట్టు తెలుస్తోంది.
వేసవి తాపం ఇలాగే ఉంటే మే ఆఖరి వారం వరకు బీర్ల అమ్మకాలు రికార్డులు బద్దలు కొడతాయని భావిస్తున్నారు. ఇక బీర్ సేల్స్‌లో రాష్ట్రంలోనే నల్గొండ జిల్లా టాప్. ఈ జిల్లాలో 48.14 కోట్ల విలువైన బీర్లు తాగేశారు. ఇక కరీంనగర్ (Karimnagar) సెకండ్ ప్లేస్‌లో ఉంది. ఓవైపు ముదిరిన ఎండలతో పాటు.. పెళ్లిళ్లు, ఫంక్షన్ల సీజన్ కావడంతో లిక్కర్ సేల్స్ (Liquor sales) విపరీతంగా పెరిగినట్టు అంచనా వేస్తున్నారు అధికారులు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు (Temperatures)మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో బీర్ల అమ్మకాలు పెరిగే అవకాశం ఉందని అబ్కారీ శాఖ (Excise department) అంచనా వేస్తోంది. దీంతో డిమాండ్‌కు తగ్గట్టుగా లిక్కర్ షాపులకు నిత్యం బీరు సరఫరా అవుతోంది. దీంతో ఈ నెలలో బీర్ల విక్రయాలు రికార్డు సృష్టించే అవకాశం ఉందని అంటున్నారు