హైదరాబాద్ లో వ్యాపారస్తులకు ఇది షాకింగ్ న్యూస్ వరుస ప్రమాదాల నేపధ్యంలో భాగ్యనగర లో వ్యాపారస్తులకు షాకిచ్చారు. ఇకపై వ్యాపారాలకు పోలీస్ లైసెన్స్ తప్పనిసరి చేశారు. దీంతో, ట్రేడ్, ఫుడ్, ఫైర్‌తోపాటు పోలీస్ లైసెన్స్ కూడా తీసుకోవాల్సిందే. గతంలోనూ పోలీస్ లైసెన్స్ విధానం ఉంది. అయితే, 2014 తర్వాత దీన్ని రద్దు చేశారు. అయితే, వరుస ప్రమాదాల నేపథ్యంలో పోలీస్ లైసెన్స్ నిబంధనలను పునరుద్ధరించారు. పోలీస్ లైసెన్స్ తీసుకోవడానికి ఈ మార్చి 31వరకు టైమ్ ఇచ్చింది. ఈ చట్టం 2013 వరకు హైదరాబాద్ నగరంలో తప్పనిసరిగా ఉండేది. అయితే, 2014 తర్వాత లైసెన్స్‌లను సిటీ పోలీసులు రద్దు చేశారు. లైసెన్సుల కోసం వ్యాపారస్తులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 1 నుంచి తదుపరి ఏడాది మార్చి 31 వరకు గడువుతో లైసెన్సులు జారీ చేయడం జరుగుతుందని తెలిపారు.