దళితులు, గిరిజనులు సాగు చేసుకుంటున్న అసైన్డ్ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలను ఆపాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR )కు బీజేపీ (BJP) తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ లేఖ రాశారు.
సీఎం కేసీఆర్ (CM KCR) కు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ (Bandi Sanjay) బహిరంగ లేఖ రాశారు. దళితులు, గిరిజనులు సాగు చేసుకుంటున్న.. అసైన్డ్ భూముల్లో(assigned lands) రియల్ ఎస్టేట్ వ్యాపారాలను ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే దళితులకు మూడు ఎకరాల సాగు భూమి ఇస్తామన్న హామీని వమ్ము చేసి.. సీఎం దళితులను మోసం చేశారని మండిపడ్డారు. ఎన్నో ఏళ్ల క్రితం దళితుల(Dalits)కు, గిరిజనులకు అసైన్డ్ చేసిన భూములను లాక్కుంటూ రియల్ వ్యాపారం చేయడం దుర్మార్గమని బండి సంజయ్ మండిపడ్డారు సాగు చేసుకుంటున్న భూములను లాక్కోవడం అంటే వారి నోటికాడి ముద్ద లాక్కోవడమేనన్నారు. దళితులకు మూడు ఎకరాల సాగు భూమి ఇస్తామన్న హామీని వమ్ము చేసి దళితులను మోసం చేశారని మండిపడ్డారు.ఇదిగో.. అదిగో పోడు భూములకు పట్టాలిస్తాం అంటూ హామీలివ్వడవ్వమే తప్ప.. అమలేదని బండి సంజయ్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ (BRS) రియల్ ఎస్టేట్ (Real estate) దందాకు దళితులు, గిరిజనుల భూములను గుంజుకుంటారా? దళిత, గిరిజనులంటే మీకెందుకు అంత కక్ష అని నిలదీశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో దళితులకు, గిరిజనులకు రక్షణ కరవైందన్నారు. దళితులు, గిరిజనుల బతుకులను ఆగం చేసే చర్యలను ప్రభుత్వం వెంటనే విడనాడాలని కోరారు. అసైన్డ్ భూముల్లో రియల్ దందాకు తెరదించకుంటే బీజేపీ (BJP)పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుందని హెచ్చరించారు.