»Rahul Gandhi Said That Elections Are Going On For Kcr And Between The People In Telangana Revanth Reddy Sitakka
Rahul Gandhi: దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య ఎన్నికలు జరుగుతున్నాయి.. రాహుల్ గాంధీ
రాష్ట్రంలో దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ములుగులో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో రాహుల్ మాట్లాడారు. తెలంగాణ ఇస్తామని మాట నిలబెట్టుకున్న పార్టీ కాంగ్రెస్‌ది అన్నారు. ముఖ్యంగా 6 పతకాలు తెలంగాణ భవిష్యత్తును మారుస్తాయని తెలిపారు.
Rahul Gandhi: కాంగ్రెస్(Congress) విజయభేరి ములుగు(Mulugu) సభలో రాహుల్ గాంధీ కేసీఆర్ పాలనను, తెలంగాణ(Telangana) ఓటర్లను ఉద్దేశించి ప్రసంగించారు. కేసీఆర్(KCR) గతంలో ఎన్నో హామీలు ఇచ్చారని, అవేవి నేరవేర్చలేదని అన్నారు. దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు, ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు ఇచ్చారా? అని రాహుల్ గాంధీ (Rahul Gandhi) అడిగారు. ఎక్కడ చూసినా అవినీతినే చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులోనే రూ.లక్ష కోట్లు కేసీఆర్ దోచుకున్నారని పేర్కొన్నారు. డబుల్ బెడ్ రూమ్ లేవు, లక్ష రూపాయలు రుణమాఫీ చేయలేదని తెలిపారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇచ్చిన హామీలన్నీ తాము నెరవేర్చామన్నారు. రాజస్థాన్‌లో అందరికీ ఉచిత వైద్యం ఇస్తామన్నాము, రూ.25 లక్షల వరకు ఉచితంగానే వైద్యం అందిస్తున్నామన్నారు. రాజస్థాన్‌లో ఉచిత వైద్యం పథకం దేశంలోనే అద్భుతంగా ఉందన్నారు. కర్ణాటకలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారన్నారు. ప్రతి నెలా మహిళలకు వారి అకౌంట్లోకి ఉచితంగా డబ్బు పడుతోందన్నారు. ఇచ్చిన మాటను కాంగ్రెస్ తప్పకుండా నిలబెట్టుకుంటుందని రాహుల్ గాంధీ అన్నారు.
తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే. దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య ఎన్నికల జరుగుతున్నాయి. రాజకీయ పార్టీలు తమకు నష్టం జరిగే నిర్ణయాన్ని తీసుకోవు. తెలంగాణలో బీజేపీ పని అయిపోయందని, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని బీజేపీ కోరుకుంటుందని అన్నారు. ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నాయి. వాటితో ఎంఐఎం కూడా కలిసే ఉందని పేర్కొన్నారు. ఇక బీఆర్ఎస్కు ఓటు వేస్తే కేసీఆర్‌కు ఓటు వేసినట్లే అని రాహుల్ గాంధీ తెలిపారు. అందుకే కేసీఆర్‌పై సీబీఐ, ఈడీ, ఐటీ కేసులు ఏమీ ఉండవు అని రాహుల్ గాంధీ తెలిపారు.
तेलंगाना का वादा कांग्रेस ने आपसे 2004 में किया था। पूरी दुनिया जानती है कि कांग्रेस ने उस वादे को पूरा कर के दिखाया।
कांग्रेस ने यहां की जनता के बारे में सोचा, यहां के गरीब लोगों के बारे में सोचा और यह निर्णय लिया।
ये सच्चाई आपके सामने है और इसे कोई नहीं मिटा सकता।