»Police Case On 29 Years Pranav Jail Sentenced Narayanaguda Hyderabad
Police case: తప్పుచేయకున్నా యువకుడికి జైలు శిక్ష?
ఇటివల ఓ యువకుడు అమెరికా నుంచి వచ్చాడు. హైదరాబాద్లో అత్యుత్సాహం ప్రదర్శించాడు. చివరకు 20 రోజులు జైలు శిక్ష అనుభవించాడు. అయితే ఈ ఘటనలో పలువురు తప్పు పోలీసులదేనని చెబుతుండగా..మరికొందరు మాత్రం ఆ యువకుడిదే మిస్టెక్ అని అంటున్నారు. అయితే అసలు ఏ జరిగింది? ఆ కేసు వివరాలెంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Police case on 29 years pranav Jail sentenced narayanaguda hyderabad
ప్రస్తుత కాలంలో యువకులు ఏ మాత్రం కూడా వెనక్కి తగ్గడం లేదు. అది సినిమాల ప్రభావమో లేదా వారు చేస్తున్న ఉద్యోగాల ఎఫెక్టో తెలియదు కానీ. పలు రకాలు మాటలు అనడం లేదా వారి బైకులు గానీ..వారి వస్తువులకు ఏదైనా ఇబ్బంది తలపెట్టినా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అస్సలు కంప్రమైజ్ కావడం లేదు. అచ్చం అలాంటి సంఘటనే ఇటివల హైదరాబాద్లో చోటుచేసుకుంది. ఇక అసలు వివరాల్లోకి వెళితే నారాయణగూడకు చెందిన ప్రణవ్ అనే 29 ఏళ్ల యువకుడు తనకు ఉన్న రెండు ఇపోర్టెడ్ శునకాలను(dogs) తీసుకుని అలా వాకింగ్ కోసం వెళ్లాడు. ఆ క్రమంలోనే అటుగా వచ్చిన పోలీస్ పెట్రోలింగ్ వాహనం వచ్చి అతనికి ఉన్న ఓ శునకాన్ని తాకింది.
దీంతో ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న శునకానికి పోలీస్ వాహనం తాకడంతో ఆ యువకుడు పోలీసులపై(police) ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ క్రమంలో పోలీసులు అతనికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కానీ అతను మాత్రం వెనక్కి తగ్గలేదు. నడిరోడ్డుపైనే ఆగి పోలీసులపై పరుష పదజాలంపై పలు వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జాం సమస్య ఏర్పడింది. అయితే ఈ తంతంగాన్ని మొత్తం అక్కడున్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా..వీడియో తెగ వైరల్ అయ్యింది. ఆ క్రమంలోనే ప్రణవ్ పై పోలీసులు న్యూసెన్స్ కేసు కూడా నమోదు చేశారు.
దీంతో అతనికి నాంపల్లి కోర్టు 20 రోజుల జైలు శిక్షను విధించింది. అయితే అతను ఇటివలనే అమెరికా(USA) నుంచి హైదరాబాద్ వచ్చినట్లు తెలిసింది. ఈ విషయం తెలిసిన పలువురు నెటిజన్లు అతనిది తప్పు లేకున్నా కూడా శిక్ష అనుభవించాడని అంటున్నారు. అమెరికాలో జీవనానికి అలవాటుపడి ఇక్కడ కూడా అలా రూల్స్ పాటించాలని చూస్తే వర్క్ అవుట్ కాదని చెబుతున్నారు. ఏం జరిగినా ఓపికతో ఉండాలని పోలీసుల విషయంలో దురుసుగా ప్రవర్తిస్తే కుదరదని ఇంకొంత మంది వాపోతున్నారు. మరికొంత మంది అయితే పోలీసులైతే వారికి రూల్స్ వర్తించవా అని నిలదీస్తున్నారు.