• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

సీఎం సహాయనిధి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే

MHBD: తొర్రూరు మండలంలోని వివిధ గ్రామాలు, మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులకు చెందిన 87 మంది లబ్ధిదారులకు రూ.43,50,000 విలువ గల సీఎం సహాయనిధి చెక్కులను ఇవాళ పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అందజేశారు. సీఎం సహాయనిధి ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలు వైద్య చికిత్సల కోసం అప్పుల పాలు కాకుండా ప్రభుత్వం సహాయం అందిస్తుందని తెలిపారు.

February 27, 2026 / 06:20 AM IST

కారుని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. తప్పిన ప్రమాదం

MLG: పట్టణ కేంద్రంలోని మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట గురువారం ఆర్టీసీ బస్సు పార్క్ చేసి ఉన్న కారును ఢీకొట్టింది. ఎస్సీ కాలనీ నుంచి బస్టాండ్ వైపు వెళ్తున్న బస్సు, ఎదురుగా వస్తున్న మరో బస్సును తప్పించే క్రమంలో నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన నిలిపిన కారును ఢీకొట్టినట్లు సమాచారం. ఘటనలో కారుకు నష్టం వాటిల్లగా, ఎవరికి గాయాలు కాలేదు.

February 27, 2026 / 06:19 AM IST

శ్రీ షిరిడిసాయి ఆలయంలో స్పీకర్

RR: దిల్‌సుఖ్‌నగర్‌లోని శ్రీ షిరిడి సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్‌లో నిర్వహించిన శ్రీ సాయి నామ శతకోటి (వంద కోట్లు) జప మహాయజ్ఞం ముగింపు ఉత్సవం భక్తి శ్రద్ధలతో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొని, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఛైర్మన్, ఆలయ ట్రస్ట్ సభ్యులు స్పీకర్‌‌ను శాలువాతో ఘనంగా సన్మానించి మెమొంటో అందజేశారు.

February 27, 2026 / 06:13 AM IST

భర్త ప్రాణాలు కాపాడండి అంటూ CMను వేడుకున్న భార్య

WGL: నగరంలో పదవీవిరమణ చేసి 6నెలలు గడిచినా తన భర్తకు రావాల్సిన ప్రయోజనాలు అందలేదని విజయలక్ష్మి నేడు సామాజిక మాధ్యమాల్లో సీఎం రేవంత్‌ను వేడుకున్నారు. ఏఎస్ఐగా రిటైర్ అయిన వీవీఎల్ఎన్ మూర్తి గుండెసమస్యతో సికింద్రాబాద్‌లో చికిత్స పొందుతున్నారు. అప్పులు, వైద్య ఖర్చులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వెంటనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల చేయాలని కోరారు.

February 27, 2026 / 06:11 AM IST

నేటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు

HYD: హెచ్-సిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పనుల నేపథ్యంలో బంజారాహిల్స్ రోడ్ నం. 2, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ఈ నెల 27 నుంచి ట్రాఫిక్ మళ్లింపులు అమల్లోకి రానున్నాయి. స్టీల్ ఫ్లైఓవర్, అండర్‌పాస్ నిర్మాణ పనుల కారణంగా రద్దీ ఏర్పడే అవకాశం ఉందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకోవాలని సూచించారు.

February 27, 2026 / 06:11 AM IST

M.Ed 3వ సెమిస్టర్ ఫీజు చెల్లింపునకు నేడే ఆఖరు

NZB: TU పరిధిలోని M.Ed మూడో సెమిస్టర్ రెగ్యులర్ విద్యార్థులు పరీక్షల ఫీజు చెల్లింపునకు నేడు చివరి తేదీ అని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు.నేడు సాయంత్రం లోపు ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా రూ.1210 ఫీజు చెల్లించవచ్చన్నారు.రూ.100 అపరాధ రుసుంతో మార్చి 2 వరకు అవకాశముందని పేర్కొన్నారు.పరీక్షలను మార్చి నెలలో నిర్వహించనున్నట్లు తెలిపారు

February 27, 2026 / 06:09 AM IST

‘చట్టాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి’

వనపర్తి మండలంలోని సవాయిగూడెం జడ్పీ హైస్కూల్లో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వీ.రజని పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు పోక్సో చట్టం, బాల్య వివాహాల నిషేధం, విద్యా హక్కు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రాథమిక విధులు, హక్కుల గురించి వివరిస్తూ చట్టాల పట్ల అవగాహనతోనే నేరాలను అరికట్టవచ్చ అన్నారు.

February 27, 2026 / 06:09 AM IST

నేడు ఈప్రాంతంల్లో పవర్ కట్

SRPT- నడిగూడెం మండలం సిరిపురం సబ్ స్టేషన్ ఫీడర్ పరిధిలోని సిరిపురం గ్రామంలో నేడు ఉ.9.00 నుంచి మ.2.00 గంటల మధ్య విద్యుత్ సరఫరా లో అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ అధికారులు తెలిపారు. గ్రామంలోని ఐదవ వార్డుకు చెందిన బండల బజార్‌లో విద్యుత్తు సరఫరాకు ఆటంకంగా మారిన చెట్ల కొమ్మలను తొలగిస్తున్న కారణంగా విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు.

February 27, 2026 / 06:09 AM IST

నేడు ఈప్రాంతాల్లో పవర్ కట్

SRPT- నడిగూడెం మండలం సిరిపురం సబ్ స్టేషన్ ఫీడర్ పరిధిలోని సిరిపురం గ్రామంలో నేడు ఉ.9.00 నుంచి మ.2.00 గంటల మధ్య విద్యుత్ సరఫరా లో అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ అధికారులు తెలిపారు. గ్రామంలోని ఐదవ వార్డుకు చెందిన బండల బజార్‌లో విద్యుత్తు సరఫరాకు ఆటంకంగా మారిన చెట్ల కొమ్మలను తొలగిస్తున్న కారణంగా విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు.

February 27, 2026 / 06:09 AM IST

రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు

SRCL: చందుర్తి మండలం మరిగడ్డ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు అయ్యా యి. మల్యాల గ్రామానికి చెందిన ప్రశాంత్ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గురువారం రాత్రి ప్రమాదానికి గురయ్యాడు. దీంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 10 కు సమాచారం ఇవ్వగా వెంటనే స్పందించిన 108 హుటా హుటిన అక్కడికి చేరుకొని క్షతగాత్రాలను ఆసుపత్రికి తరలించారు.

February 27, 2026 / 06:08 AM IST

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం స్వాధీనం

KNR: కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బొమ్మకల్ ఫ్లైఓవర్, ఆరెపల్లి, కృష్ణానగర్ ప్రాంతాల్లో పోలీసులు గురువారం దాడులు నిర్వహించి 70 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న మల్లేష్, లక్ష్మిపతి, స్వామిదాస్, సత్యనారాయణ, సత్తయ్యలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు.

February 27, 2026 / 06:08 AM IST

రాష్ట్ర స్థాయి పోటీల్లో క్రీడాకారుల ప్రతిభ

MNCL: హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి CM కప్ కరాటే పోటీల్లో జిల్లాకు చెందిన కరాటే క్రీడాకారులు ప్రతిభ కనబర్చారు. నస్పూరు చెందిన అన్విత 59 కేజీల విభాగంలో కాంస్య పతకం, బెల్లంపల్లికి చెందిన అభిషేక్ 75 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించినట్లు జిల్లా కరాటే సంఘం ప్రధాన కార్యదర్శి శివమహేష్ తెలిపారు. పతకాలు సాధించిన క్రీడాకారులను పలువురు అభినందించారు.

February 27, 2026 / 06:08 AM IST

వ్యవసాయ మార్కెట్‌లో ఉద్యోగుల బదిలీలు

WGL: ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో ఏళ్ల తరబడి ఒకేచోట విధులు నిర్వహిస్తున్న పలువురు ఉద్యోగులను అధికారులు అంతర్గత బదిలీలు చేశారు. వరంగల్ లక్ష్మీపురం కూరగాయల మార్కెట్ సూపర్వైజర్‌ను ఎనుమాముల మార్కెట్‌లోని పల్లి, పత్తి యార్డుకు బదిలీ చేశారు. అలాగే అపరాలు, ధాన్యం, మిర్చి తదితర యార్డుల సూపర్వైజర్లకు అంతర్గత బదిలీలు చేశారు.

February 27, 2026 / 06:07 AM IST

విద్యుత్ ట్రాన్స్‌ఫార్మల దొంగల మూఠా అరెస్ట్

KMR: విద్యుత్ ట్రాన్స్‌ఫార్మల నుంచి కాపర్, ఆయిల్ చోరికి పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. బాన్సువాడ DSP విఠల్ రెడ్డి వివరాల ప్రకారం పలు గ్రామాల్లో దుండగులు ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసి కాపర్, ఆయిల్ చోరికి పాల్పడుతున్నారు. దర్యాప్తు చేపట్టి నిందితులు సుభాష్, కరీం, సురేఖఅర్జున్ తాంబే, సునీల్ శ్యామ్ రావు వాగ్మారేను గురువారం సాయంత్రం అరెస్ట్ చేశారు.

February 27, 2026 / 06:06 AM IST

సీఎం కప్ పోటీల్లో రాణించిన సాహిత్య

PDPL: మంథని మండలం గుంజపడుగు గ్రామానికి చెందిన ఉదారి సాహిత్య సీఎం కప్ టోర్నీలో గురువారం రెండు పథకాలతో మెరిసింది. సిద్దిపేటలో నిర్వహించిన 2025- 26, రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్-15, 10 కి.మీ సైక్లింగ్ పోటీల్లో సిల్వర్, 20 కి.మీ సైక్లింగ్ పోటీల్లో సిల్వర్ పథకాలతో రాణించిందని కోచ్ మ్యాక్స్ వెల్ ట్రావర్ పేర్కొన్నారు. ఆమెని పలువురు అభినందించారు.

February 27, 2026 / 06:05 AM IST