• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఏడుపాయల ఆలయం మూసివేత

MDK: చంద్రగ్రహణం సందర్భంగా మార్చి 3న మంగళవారం ఏడుపాయల వన దుర్గాభవాని మాత ఆలయాన్ని మూసివేయనున్నట్లు ఈవో వీరేశం తెలిపారు. ఉదయం 5 గంటలకు అభిషేకం, అలంకరణ ముగిశాక 6 గంటల నుంచి ద్వారాలు మూసివేయనున్నట్లు చెప్పారు. ఆ రోజున అన్ని రకాల పూజలు, సేవలను నిలిపివేస్తామన్నారు. తిరిగి మార్చి 4న బుధవారం ఉదయం శుద్ధి, సంప్రోక్షణ అనంతరం 8 గంటల నుంచి భక్తులకు దర్శనం ఉంటుందని పేర్కొన్నారు.

February 27, 2026 / 07:16 AM IST

‘హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి’

MBNR: TGSC స్టడీ సర్కిల్లో 5 నెలల ఉచిత రెసిడెన్షియల్ శిక్షణకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://www.tsstudycircle.co.in వెబ్‌సైట్‌లో టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని స్టడీ సర్కిల్ డైరెక్టర్ కాడం శ్రీనివాస్ తెలిపారు. మహబూబ్‌నగర్‌లోని NTR ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మార్చి 1న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు.

February 27, 2026 / 07:13 AM IST

ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం

NZB: జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో అరికట్టాలని అధికారులను కలెక్టర్ ఇలాత్రిపాఠి ఆదేశించారు. గురువారం సాయంత్రం నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. ఇసుక బుకింగ్ ఇకపై పూర్తిగా ఆన్‌లైన్‌లో “మనా ఇసుక వాహనం”యాప్ ద్వారానే జరగాలని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆఫ్‌లైన్ బుకింగ్‌లకు అనుమతి లేదని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాలని కోరారు.

February 27, 2026 / 07:10 AM IST

నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు

RR: కొత్తూరు మండలం ఇన్ములనర్వ గ్రామంలో వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తుగా ఏర్పాటు చేస్తున్నట్లు సర్పంచ్ లలిత గోపాల్ నాయక్ తెలిపారు. జీపీ నిధుల నుంచి రూ. 4 లక్షల రూపాయలతో కొడిచెర్ల రోడ్డు పక్కన గల అండర్ గ్రౌండ్ సంపు నుంచి ట్యాంకు వరకు పైప్ లైన్ పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలన్నారు.

February 27, 2026 / 07:10 AM IST

చిన్నారి మృతికి కొవ్వొత్తులతో నివాళులు

JGL: నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో అగ్రకులస్తుల దాడిలో మరణించిన బేబీ మౌనిక ఆత్మ శాంతి చేకూరాలని కోరుతూ జగ కేంద్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ జగిత్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జగిత్యాల పట్టణంలోని తహశీల్ చౌరస్తాలో కొవ్వొత్తులతో నివాళులు అర్పిస్తూ, నిందితులను కఠినంగా శిక్షించాలని అన్నారు.

February 27, 2026 / 07:06 AM IST

మంచినీటి బోరు మోటర్ ప్రారంభించిన: కౌన్సిలర్

WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలోని 4వ వార్డులో వేసవిలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా MLA దొంతి మాధవరెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ పెండెం లక్ష్మీ రామానందులు సహకారంతో ఏర్పాటు చేసిన నూతన మంచినీటి బోరు మోటర్‌ను నిన్న సాయంత్రం కౌన్సిలర్ బీరం భరత్ రెడ్డి ప్రారంభించినట్లు తెలిపారు. ఆయన వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు.

February 27, 2026 / 07:06 AM IST

వెలుగుమట్ల బాధితులకు ఎంపీ రవిచంద్ర భోజనాలు

KMM: భూదాన్ బోర్డు భూమిలో ప్రభుత్వం తొలగించిన గుడిసెలు నిరాశ్రయులైన బాధితులకు గురువారం ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సుమారు 600 మంది బాధితులకు భోజనాలు, మంచినీటి సదుపాయం కల్పించారు. సర్వం కోల్పోయి నిరాశ్రయులైన బాధితులు భోజనాలు లేక అలమటిస్తున్న తరుణంలో ఘటనా స్థలిలో భోజనాలు ఏర్పాటు చేసిన ఎంపీకు ఋణపడి ఉంటామని బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.

February 27, 2026 / 07:05 AM IST

బాధితుల వద్దకే పోలీస్.. SI వినూత్న చొరవ

SRCL: వీర్నపల్లి మండలం పోలీస్ వ్యవస్థలో బాధితులకు తక్షణ న్యాయం అందించడమే లక్ష్యంగా వీర్నపల్లి పోలీసులు బాధితుల కేంద్రంగ “Victim Centric Approach” ( సేవలు) విధానానికి శ్రీకారం చుట్టారు. బాధితులు పోలీస్ స్టేషన్‌కు రాలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, పోలీసులే నేరుగా ఘటనా స్థలానికి వెళ్లి కేసు నమోదు చేసే ప్రక్రియను వీర్నపల్లి SI లక్ష్మణ్ అమలు చేస్తున్నారు. 

February 27, 2026 / 07:05 AM IST

నేడు లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో మహాయజ్ఞం .!

NLG: కట్టంగూరు మండలంలోని లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో నేడు ఏకాదశ మహా యజ్ఞం వైభవంగా జరగనుంది. తృతీయ ఏకాదశి వార్షికోత్సవం పురస్కరించుకుని ఈరోజు ఉదయం 9 గంటలకు యాగ క్రతువును ప్రారంభించనున్నట్లు పూజారి శ్రీనివాస్ శర్మ తెలిపారు. లోక కళ్యాణార్థం నిర్వహించే ఈ విశేష పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

February 27, 2026 / 07:02 AM IST

ఆదివాసీలకు రూరల్ ఎస్సై చేయూత

ADBV: రూరల్ ఎస్సై వి. విష్ణువర్ధన్ ఆదివాసీల అభివృద్ధికి సేవలందిస్తున్నారు. 500 మంది పదో తరగతి విద్యార్థులకు ఉచిత పరీక్ష సామగ్రి, 8 మహిళా క్రీడాకారిణులకు ట్రాక్‌సూట్లు పంపిణీ చేశారు. చించుఘాట్ ఆశ్రమ పాఠశాల ఆర్చరీ క్రీడాకారిణులు సిడాం రామకళ, పెందూర్ రూపకు రూ.20 వేల కిట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ చేతుల మీదుగా అందజేశారు.

February 27, 2026 / 07:02 AM IST

ఉచిత కంటి పరీక్ష శిబిరంలో పాల్గొన్ననున్న SP

ASF: కాగజ్‌నగర్‌ పట్టణంలో లారీ, ట్రక్ డ్రైవర్లకు శుక్రవారం ఉచిత కంటి పరీక్ష శిబిరం నిర్వహిస్తున్నట్లు CI ప్రేమ్ కుమార్ ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని SPM హెచ్‌ఆర్‌డీ భవనంలో ఉదయం 10 గంటలకు లారీ, ట్రక్ డ్రైవర్లు, క్లీనర్లకు ఉచిత కంటి పరీక్ష శిబిరం నిర్వహించబడుతుందన్నారు. ముఖ్య అతిథిగా SP నితిక పంత్ హాజరై డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించనున్నారు.

February 27, 2026 / 07:01 AM IST

నేరాల నియంత్రణే లక్ష్యం: ఎస్పీ

ADB: జిల్లా పోలీసు కార్యాలయంలో ఉట్నూర్ సబ్ డివిజన్ నెలవారీ నేర సమీక్షా సమావేశాన్ని ఎస్పీ అఖిల్ మహాజన్ నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అరైవ్ అలైవ్ 2.0, సైబర్ నేరాలపై విద్యార్థులకు ఖాకీ కిడ్స్ ద్వారా అవగాహన కల్పించాలని ఆదేశించారు. జిల్లాను గంజాయి రహితంగా మార్చాలని, పెండింగ్ కేసులను త్వరగా పూర్తి చేసి చార్జిషీట్లు దాఖలు చేయాలని సూచించారు.

February 27, 2026 / 07:01 AM IST

SUలో తెలుగు పీహెచ్‌డీ ప్రవేశ మౌఖిక పరీక్షలు

KNR: శాతవాహన విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగంలో పీహెచ్‌డీ ప్రవేశ మౌఖిక పరీక్షలు మార్చి 6వ, 7వ తేదీల్లో ఉదయం 10:30 నుంచి విభాగాధిపతి కార్యాలయంలో నిర్వహిస్తామని శాతవాహన విశ్వవిద్యాలయ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ సంచాలకులు డా. మహమ్మద్ జాఫర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇతర వివరాలకు విశ్వవిద్యాలయ వెబ్ సైట్‌లో చూడాల్సిందిగా కోరారు.

February 27, 2026 / 07:01 AM IST

నేటి నుంచి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సెమినార్..

కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల జాతీయ సెమినార్ నిర్వహణకు ముస్తాబవుతోంది. ఈనెల 27, 28 తేదీల్లో నిర్వహించనున్న జాతీయ సెమినార్ కోసం కళాశాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు.సెమినార్ ఏర్పాట్లలో భాగంగా కళాశాల ప్రవేశ ద్వారం వద్ద రోడ్డుకు ఇరువైపులా మట్టితో చదును చేసి సుందరీకరణ పనులు చేపట్టామన్నారు.

February 27, 2026 / 07:00 AM IST

‘పెద్ద దవాఖానాకు పెద్దాయన పేరు కై కృషి చేస్తా’

SRD: పటాన్ చెరువులో రూ.100 కోట్ల CSR నిధులతో నిర్మించి, ప్రారంభానికి సిద్ధంగా ఉన్న “పెద్ద దవాఖానకు పెద్దాయన డాక్టర్ కిషన్ రావు పేరుకై” తీవ్రంగా కృషి చేస్తానని, సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడుతానని మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జి నీలం మధు అన్నారు. జిల్లాకు 567 కోట్ల CSR నిధులు తెచ్చిన ఘనత డాక్టర్ కిషన్ రావుది అన్నారు.

February 27, 2026 / 06:53 AM IST