SRCL: చందుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని శుక్రవారం అదనపు ఎస్పీ చంద్రయ్య సందర్శించారు. ఈ సందర్భంగా పరీక్ష కేంద్రంలో వసతులను పరిశీలించారు. విద్యార్థులకు డెస్కులు, మంచినీటి, ఫ్యాన్లు అన్ని వసతులు ఉన్నాయని చీఫ్ సూపరింటెండెంట్ మోహన్ కుమార్ అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట సీఐ వెంకటేశ్వర్లు ఉన్నారు.
KMM: ఖమ్మం రైల్వే స్టేషన్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. రైల్వే స్టేషన్ ఫ్లాట్ ఫాంపై ఆకస్మికంగా మృతి చెందినట్లు సమాచారం. మృతుడి వ్యక్తిగత సమాచారాలు అందలేదని, గుర్తు తెలియని కారణంగా రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మృతుడి వివరాలు తెలిస్తే రైల్వే జీఆర్పీ అధికారులను సంప్రదించాలని సూచించారు.
WGL: ప్రయాణికుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నర్సంపేట ఆర్టీసీ డిపోలో నేడు ‘డయల్ యువర్ డీఎం’ కార్య క్రమం నిర్వహించనున్నారు. శుక్రవారం సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ప్రయాణికులు తమ ఫిర్యాదులు, సలహాలను తెలియజేయాలని డిపో మేనేజర్ ప్రసన్నలక్ష్మి తెలిపారు. 7382926166, 9989038476కు ఫోన్ చేసి బస్సుల రాకపోకలు, సౌకర్యాలపై మాట్లాడాలని ఆమె కోరారు.
KMR: వార్డు సభ్యులు శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని తమ వార్డులను అభివృద్ధి పథంలో నడిపించాలని మండల ప్రత్యేక అధికారి రామ్మోహన్ సూచించారు. శుక్రవారం మద్నూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన శిక్షణలో ఆయన పాల్గొన్నారు. ఇక్కడ నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో అమలు చేయాలన్నారు.
MNCL: లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులలో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ ఛైర్మన్ దొంత అంజలి, వైస్ ఛైర్మన్ మోత్కూరి రాజేశ్వరి తెలిపారు. శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలోని 5, 11, 13 వార్డులలో వారు విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య సమస్యలు, మంచినీటి సరఫరా లోపాలు, డ్రైనేజీ, నాలాల క్లీనింగ్ పరిశీలించారు.
JGL: రాయికల్ మండలం కిష్టంపేటలో రూ.12 లక్షల నిధులతో నిర్మించనున్న అంగన్వాడీ నూతన భవనానికి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. గ్రామస్థాయి సంక్షేమ సేవలకు అంగన్వాడీ కేంద్రాలు కీలకమని, మౌలిక వసతుల బలోపేతానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అంజా గౌడ్, ఉపసర్పంచ్ చాంద్ పాషా, ఎంపీడీవో చిరంజీవి పాల్గొన్నారు.
KMR: ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేస్తూ జిల్లా రక్తదాతల సేవా సమితి రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తోంది. కామారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజయ్య కు ‘బీ పాజిటివ్’ రక్తం అవసరమవడంతో, సమితి సభ్యుడు పుండరీకాక్ష వెంటనే స్పందించి రక్తదానం చేశారు. మానవత్వాన్ని చాటుకున్న దాతకు సమితి నిర్వాహకులు పాల్గొన్నారు.
NZB: ధర్పల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం జరగాల్సిన ఇసుక బహిరంగ వేలం అనివార్య కారణాల వల్ల రద్దయినట్లు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ రాజేశ్వర్ తెలిపారు. తహసీల్దార్ శాంత అందుబాటులో లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. సుమారు 200 ట్రాక్టర్ల ఇసుకను ఈరోజు వేలం వేయాల్సి ఉండగా, మరో రోజున వేలం ఉంటుందన్నారు.
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ (నావంధీగి) రైల్వే స్టేషన్‌లో హుబ్లీ ట్రైన్ ఆపాలని 13 ఏళ్లగా కలగా మిగిలిన సమస్యను చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కృషితో వారి కల నేటితో నెరవేరింది. ఎంపీ కోరిక మేరకు కేంద్ర రైల్వే శాఖ ఉత్తర్వులతో ఇవాళ హుబ్లీ రైలును బషీరాబాద్‌లో ఆపారు. ఎంపీతో పాటు స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి రైల్లో హైదరాబాద్ వరకు ప్రయాణించారు.
KNR: రైతు భరోసా ఇవ్వకుంటే బీజేపీ అధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్ జిల్లాలోని 51 డివిజన్‌లో 16 లక్షలతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.
HYD: దాదాపు 30% డిజిటల్ మీటర్లు పనిచేయడం లేదని స్వయంగా హైదరాబాద్ మహానగర జలమండలి అధికారులే క్షేత్రస్థాయి పరిశీలనలో గుర్తించారు. మీటర్లు రీడింగ్ చూపించకపోవడం వల్ల వినియోగదారులకు ‘లాక్డ్ రీడింగ్’ (Locked Reading) పడటం లేదు. దీంతో వచ్చే అదనపు ఆదాయం బోర్డుకు వెళ్తున్నా, మీటర్ల కొనుగోళ్లల్లో జరిగిన నష్టానికి ఎవరూ బాధ్యత వహిస్తారు..?
KMR: ఎల్లారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం జరిగిన ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు ప్రశాంతంగా కొనసాగాయి. ఇంగ్లిష్ సబ్జెక్టుకు సంబంధించి అధికారులు ‘సెట్-C’ ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేశారు. మొత్తం 233 మంది విద్యార్థులకు గాను 230 మంది హాజరు కాగా, ముగ్గురు విద్యార్థులు గైర్హాజరయ్యారని అధికారులు వెల్లడించారు.
BDK: కొత్తగూడెం కార్పొరేషన్ 44వ డివిజన్‌లో ఉన్న మున్సిపల్ స్థలం ఆక్రమణకు గురవుతున్నదని బీజేపీ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పొనిశెట్టి వెంకటేశ్వర్లు మున్సిపల్ అధికారులకు అధికారిక ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు శుక్రవారం 44 వ డివిజన్‌లోని ఆ మున్సిపల్ స్థలాన్ని TPBO అధికారులు ప్రత్యక్షంగా పరిశీలించారు. మున్సిపల్ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు.
NLG: నార్కట్‌పల్లిలోని నల్గొండ క్రాస్ రోడ్డులో లారీ బీభత్సం ఒక నిరుపేద కుటుంబాన్ని కోలుకోలేని దెబ్బ తీసింది. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన మేడి కృష్ణ, కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్న క్రమంలో ఈ ప్రమాదంలో దుర్మరణం చెందాడు. నలుగురు అన్నదమ్ముల్లో ఇప్పటికే ఒకరు చనిపోగా, ఇప్పుడు కృష్ణ కూడా దూరమవ్వడం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.
KMR: బిక్కనూరు మండలంలోని కాచాపూర్ గ్రామ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళకు గాయాలయ్యాయి. బిక్కనూరుకు చెందిన వందన స్కూటీపై మాందాపూర్ వెళ్తుండగా, వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ఓమ్ని వాహనం ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ వాహనంతో పరారయ్యాడు. స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి, బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.