• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

అక్రమంగా మట్టి తరలించడం చట్ట రీత్యా నేరం: CI

WGL: కరీమాబాద్ SRR తోటలో అక్రమంగా నిర్వహిస్తున్న మూడు ఇసుక డంపులపై ఇవాళ మిల్స్ కాలనీ CI రమేశ్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. అక్రమంగా ఇసుక డంపు చేస్తున్న వారిని అదుపులో తీసుకొని MRO ముందు బైండ్ ఓవర్ చేశారు. అనంతరం CI రమేష్ మాట్లాడుతూ.. అనుమతులు లేకుండా ఇసుక నిల్వ చేయడం, తరలించడం చట్ట రీత్యా నేరమని సీఐ హెచ్చరించారు.

February 27, 2026 / 09:50 AM IST

జనగామలో ప్రకృతి వైజ్ఞానిక యాత్ర

JN: ఓ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన ప్రకృతి వైజ్ఞానిక యాత్ర కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ప్రజా కవి జయరాజ్‌తో కలిసి విద్యార్థులు ప్రకృతి పరిరక్షణ, పర్యావరణ అవగాహనపై చర్చలు జరిపారు. యువతలో ప్రకృతి పట్ల చైతన్యం పెంపొందించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. విద్యార్థులు, అధ్యాపకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

February 27, 2026 / 09:49 AM IST

నేటి నుంచి ‌శ్రీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

NLG: చండూరు మండల పరిధిలోని తుమ్మలపల్లి గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి వచ్చే నెల మార్చి 6 వరకు జరగనున్నాయి. భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండడంతో ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ వార్షిక జాతరకు చండూరు మండల వ్యాప్తంగా పలు గ్రామాలకు భక్తులు తరలిరావాలని ఆలయ కమిటీ కోరుతుంది.

February 27, 2026 / 09:47 AM IST

ఛీ.. ఛీ.. శవాల మీద పేలాలు ఏరుకోవడమంటే ఇదేనేమో..!

HYD: అవినీతికి కాదేదీ అనర్హం అన్నట్లుగా ఉంది GHMC తీరు. ఆఖరికి ప్రజారోగ్యానికి చేసే దోమల ఫాగింగ్‌లోనూ స్కాంకు పాల్పడుతున్నారు. తాజాగా మల్కాజ్‌గిరి సర్కిల్లో ఫాగింగ్‌కు వాడే డీజిల్‌ను సూపర్వైజర్లు, AE, SEల అండతో సిబ్బంది రూ. 10 కమీషన్ చొప్పున పెట్రోల్ బంకులకు అమ్ముకుంటోంది. పంపకాల్లో తేడాలు రావడంతో ఈ ‘దోమల దండు’ బాగోతం బయటపడింది.

February 27, 2026 / 09:45 AM IST

పేదల సొంతింటి కల సాకారం:ఎమ్మెల్యే

MBNR: పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. భూత్పూర్ మండలం షేర్ పల్లి, హస్నాపూర్ గ్రామాల్లో నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల్లో ఆయన పాల్గొన్నారు. లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్ రెడ్డి సర్కార్ పేదలకు అండగా ఉంటూ సంక్షేమ పథకాలను అద్భుతంగా అమలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు.

February 27, 2026 / 09:44 AM IST

నెరవేరిన గ్రామస్తుల కల.. ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు

MDK: నిజాంపేట మండలం కల్వకుంట్ల గ్రామస్తుల కల నెరవేరింది. కొన్ని దశాబ్దాలుగా తమ గ్రామానికి ఆర్టీసీ బస్సు రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు ఎమ్మెల్యే రోహిత్ రావు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు శుక్రవారం నుండి ఆర్టీసీ బస్సు ప్రారంభం కావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు,

February 27, 2026 / 09:43 AM IST

నేడు వరంగల్‌ నిట్‌కు హీరో నిఖిల్

HNK: అర్జున్ సురవరం, కేశవ, కిరాక్ పార్టీ, స్పై, స్వామిరారా తదితర చిత్రాల్లో నటించిన హీరో నిఖిల్ శుక్రవారం ఓరుగల్లుకు రానున్నారు. వరంగల్ నిట్‌లో జరుగుతున్న స్ప్రింగ్ స్ప్రీ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా వస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు నిట్ ఓల్డ్ ఆడిటోరియంలో విద్యార్థులతో మమేకమై చర్చాగోష్ఠి నిర్వహిస్తారు. ఇందుకోసం ఆడిటోరియంలో తగిన ఏర్పాట్లు పూర్తి చేశారు.

February 27, 2026 / 09:42 AM IST

సర్పంచులకు 5 రోజులపాటు శిక్షణ కార్యక్రమం

SDPT: ఈ నెల 23 నుంచి 27 వరకు సిద్దిపేటలో ఐదు రోజులపాటు సర్పంచ్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. బెజ్జంకి, జగదేవ్‌పూర్, వర్గల్, నంగునూరు మండలాలకు చెందిన 101 మంది సర్పంచులు పాల్గొన్నారు. పారిశుద్ధ్యం, చెట్ల పెంపకం, వీధి దీపాల ఏర్పాటు, అభివృద్ధి పనుల నిర్వహణ వంటి అంశాలపై రిసోర్స్ పర్సన్లు రామకృష్ణారెడ్డి, సమ్మిరెడ్డి, మల్లికార్జున్, శిక్షణ అందించారు.

February 27, 2026 / 09:40 AM IST

MLAకు ఆహ్వాన పత్రం అందజేత

BHPL: జిల్లా కేంద్రంలోని MLA క్యాంప్ కార్యాలయంలో ఇవాళ MLA గండ్ర సత్యనారాయణ రావును, బంజారా సంఘాల నేతలు, పలువురు ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా MLAకు రేపు జరగబోయే బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలకు హాజరు కావాలని ఆహ్వాన పత్రం అందజేశారు. దీనికి MLA సానుకూలంగా స్పందించారు.

February 27, 2026 / 09:39 AM IST

కుక్నూరు పాఠశాలలో విద్యాశాఖ బృందం తనిఖీ

NZB: వేల్పూర్ మండలంలోని కుక్నూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా విద్యాశాఖ ప్యానల్ బృందం సందర్శించింది. DEO అశోక్ ఆదేశాల మేరకు అరవింద్ కుమార్ నేతృత్వంలో ఈ తనిఖీలు నిర్వహించారు. పాఠశాలలోని విద్యా ప్రమాణాలు, రికార్డులను పరిశీలించిన బృందం.. ఉపాధ్యాయులకు పలు సూచనలు చేసింది.

February 27, 2026 / 09:39 AM IST

నేడు జాబ్ మేళా

సంగారెడ్డి జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఆధ్వర్యంలో నేడు ఉదయం 10:30 గంటలకు పాత డీఆర్డీఏ కార్యాలయ ఆవరణలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి అధికారి ఎంవై నిర్మల తెలిపారు. అపోలో ఫార్మసీలో ఉద్యోగాల కోసం 10వ తరగతి ఇంటర్, డిగ్రీ అర్హత కలిగి, 28 నుంచి 35 ఏళ్ల వయస్సు ఉన్న వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

February 27, 2026 / 09:39 AM IST

ఆహార కొరతతో రోడ్లపైకి కోతుల గుంపులు

VKB: అనంతగిరి రిజర్వ్ ఫారెస్ట్‌లో ఎండాకాలం ప్రభావంతో వన్యప్రాణులకు ఆహార కొరత తీవ్రంగా మారింది. అడవిలో తిండి దొరకక కోతులు గుంపులు గుంపులుగా రోడ్లపైకి చేరుతున్నాయి. జిల్లా కేంద్రానికి సమీపంలోని అటవీ మార్గాల్లో వాహనదారులు, పర్యాటకుల వద్ద ఆహారం కోసం అవి ఎదురుచూస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. మూగజీవాల రక్షణకు చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు.

February 27, 2026 / 09:38 AM IST

గ్రామంలో ఫార్మర్ రిజిస్ట్రీ కార్యక్రమం

KNR  :గంగాధర మండలం ఉప్పరమల్యాల గ్రామ పంచాయితీలో గురువారం రైతులకు ఫార్మర్ రిజిస్ట్రీ రైతు గుర్తింపు కార్డు గురించి వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కలిపించారు. వ్యవసాయ భూమి కలిగిన ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రీని ఫిబ్రవరి 28 వరకు నమోదు చేసుకోవాలని రైతులకు వ్యవసాయ అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో AEO వెంకట్, సర్పంచ్ ముద్దం నగేష్, రైతులు పాల్గొన్నారు.

February 27, 2026 / 09:38 AM IST

నిరుపయోగంగా విష్ణుపురి కాలనీ పార్క్..!

MDCL: మేడిపల్లిలోని విష్ణుపురి కాలనీ పార్క్ నిరుపయోగంగా తయారైంది. పార్క్‌లో చిన్న పిల్లలు ఆడుకునే పరికరాలు విరిగిపోయి శిథిలావస్థకు చేరుకున్నాయి. పార్క్‌లో చెట్లకు నీరు లేక ఎండిపోయి, పార్క్ పరిసరాలు చెత్త చెదారంతో నిండిపోయి ఇబ్బందిగా తయారయ్యాయి. పార్క్ దుస్థితిని అధికారులు, పాలకులు పట్టించుకుని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.

February 27, 2026 / 09:36 AM IST

మైనార్టీ గురుకులాల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

SRD: సంగారెడ్డి జిల్లాలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో 5వ తరగతి ప్రవేశం కోసం ఈ నెల 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కోఆర్డినేటర్ బహుమతి శుక్రవారం తెలిపారు. 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు నేరుగా మైనార్టీ గురుకుల పాఠశాలలో దరఖాస్తులు చేసుకోవాలని చెప్పారు. 60 సీట్లు మైనార్టీలకు, 20 సీటు నాన్ మైనార్టీలకు కేటాయించినట్లు పేర్కొన్నారు.

February 27, 2026 / 09:35 AM IST