RR: షాద్‌నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలంలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కళ్యాణ లక్ష్మి చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పేద కుటుంబాల ఆర్థిక భారం తగ్గించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
KMR: పోచారం ప్రాజెక్టు నుంచి యాసంగి పంటల కోసం ఇప్పటి వరకు 0.541TMCల నీటిని విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. వర్షాకాలం నుంచి ప్రాజెక్టులోకి మొత్తం 30.543 TMCల నీరు వచ్చి చేరిందని అన్నారు. ప్రస్తుతం ఎండల తీవ్రత వల్ల 30 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో పోతోందని వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1.820TMCలు కాగా,ప్రస్తుతం 1.05TMC నీరు నిల్వ ఉంది.
సిద్దిపేట పట్టణంలోని శ్రీ మార్కండేయ స్వామి దేవాలయ ధ్వజ స్తంభ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఎమ్మెల్యే హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దేవాలయ కమిటీ సభ్యులు హరీశ్ రావుకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ధ్వజ స్తంభ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
RR: చేవెళ్ల మున్సిపల్ పరిధి దేవుని ఎర్రవల్లి 3వ వార్డులో ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీని కౌన్సిలర్ మీనాక్షి సత్యనారాయణ నిలబెట్టుకున్నారు. శుక్రవారం పాత బోరుకు మరమ్మతులు చేయించి నీటిని ప్రారంభించారు. ప్రజల సమస్యలకు వెంటనే స్పందిస్తూ పరిష్కరించే కౌన్సిలర్‌పై వార్డు ప్రజలు ప్రశంసలు కురిపించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.
SRD: వీరారెడ్డిపల్లిలో రూ.25 లక్షల విలువైన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇందులో మొల్లగూడెం పాఠశాల ప్రహరీ గోడకు రూ.10 లక్షలు, రిటైనింగ్ వాల్ నిర్మాణానికి రూ.15 లక్షలు కేటాయించినట్లు ఆయన తెలిపారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
MHBD: కేసముద్రం మున్సిపాలిటీ 7వ వార్డు కౌన్సిలర్ రావుల వినయ్ సతీమణి రావుల మనీషా అనారోగ్యంతో సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. విషయం తెలుసుకున్న మహబూబాబాద్ మాజీ ఎంపీ మాలోత్ కవిత ఇవాళ వారిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
NRPT: మక్తల్ పట్టణంలో 16వ వార్డుకు చెందిన వల్లంపల్లి లక్ష్మణ్ తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా శుక్రవారం ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తన కుటుంబాన్ని పరామర్శించారు. బాధితునికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు మంత్రి సూచించారు. ప్రభుత్వం తరుఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
NGKL: అచ్చంపేట పట్టణంలో ఈరోజు ఉదయం స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ పలు ప్రాంతాలను సందర్శించారు. అనంతరం లింగాల చౌరస్తాలో అడ్డా కూలీలతో మాట్లాడుతూ.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బస్ స్టాండ్ సమీపంలో నిర్మిస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించి. త్వరగా పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్‌కు తెలిపారు.
JGL: జగిత్యాల పట్టణంలోని చింతకుంట ప్రాంతంలో ఉన్న శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయంలో ఫాల్గుణ మాస శుక్ల పక్ష శుక్రవారం ఏకాదశి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాతలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చన నిర్వహించారు. అలాగే భక్తిశ్రద్ధలతో లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేశారు.
MNCL: గ్రామాల అభివృద్ధి వార్డు సభ్యుల చేతుల్లోనే ఉందని లక్షెట్టిపేట, జన్నారం మండలాల ఎంపీడీవోలు సరోజ, ఉమర్ షరీఫ్ అన్నారు. లక్షెట్టిపేట, జన్నారం మండల కేంద్రాల్లోని రైతు వేదికల్లో వార్డు సభ్యులకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమం శుక్రవారం కొనసాగింది.. ఈ సందర్భంగా గ్రామస్థాయిలో అభివృద్ధి ప్రణాళికలపై వార్డు సభ్యులకు అధికారులు అవగాహన కల్పించారు.
ADB: జిల్లాలో విమానాశ్రయ నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. సైనిక అవసరాలతో పాటు పౌర విమానయానానికి అనుకూలంగా మార్చడంతో 3KM రన్‌వే కోసం అదనంగా 249.80 ఎకరాల భూసేకరణ అనివార్యమైంది. దీనిపై అధికారులు రైతులతో చర్చలు జరిపి త్వరలోనే ప్రధానమంత్రి చేతులమీదుగా శంకుస్థాపన చేయించాలని ఎంపీ, ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఈ మేరకు పనులు వేగమందుకోవాలని చేయాలని కలెక్టర్‌ను కోరారు.
ADB: ఆదిలాబాద్‌లోని రాంపూర్ మహారాజుల కాలనీ విద్యుత్ దీపాలు లేక అంధకారంలో మగ్గుతోంది. రాంపూర్ మున్సిపాలిటీలో విలీనమైనా తమ సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రుళ్లు వీధి దీపాలు లేక రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నామని, విష పురుగుల భయం వెంటాడుతోందని వాపోతున్నారు.
KNR: జిల్లా నూతన కలెక్టర్‌గా చిత్రా మిశ్రా శుక్రవారం కలెక్టరేట్ ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కలెక్టర్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన చిత్రా మిశ్రాను కలెక్టర్ ఛాంబర్‌లో కలిసిన అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, ఆర్డీవో మహేశ్వర్, ఏవో సుధాకర్ పలువురు జిల్లా అధికారులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు
RR: షాద్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలో 2025-26 సంవత్సరానికి గాను పురపాలక సంస్థకు చెల్లించాల్సిన ఆస్తి పన్నుతో పాటు నీటి పన్నును చెల్లించాలని పురపాలక శాఖ అధికారులు తెలిపారు. పన్నులు చెల్లించని వారిపై పురపాలక సంస్థ చట్టం-2019 ప్రకారం ఆస్తి జప్తు చేయడం జరుగుతుందన్నారు. నీటి పన్ను బకాయిలు చెల్లించని వారి కలెక్షన్ తొలగించడం జరుగుతుందని పేర్కొన్నారు.
BDK: చండ్రుగొండ మండలం తుంగారం పంచాయతీలో ప్రభుత్వ స్థలాలను ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారని ఆరోపణలు వెలువడుతున్నాయి. కొంతమంది ప్రభావశీలుల అండతో నిర్మాణాలు కూడా సాగుతున్నట్లు సమాచారం. ఫిర్యాదులపై స్పందన లేకపోవడంతో స్థానికుల్లో అనుమానాలు పెరుగుతున్నాయి. అధికారులు తక్షణమే సర్వే నిర్వహించి భూములను రక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు.