• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం.!

MDK: వచ్చే వర్షాకాలం నాటికి ముంపు ప్రాంతాల ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని రామాయంపేట మున్సిపల్ ఛైర్‌పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే రోహిత్ రావు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు ప్రత్యేక బృందం డ్రైనేజీ నిర్మాణ పనులను పరిశీలించినట్లు తెలిపారు.

February 27, 2026 / 04:11 PM IST

ధర్మారంలో ఇంటర్ పరీక్షకు 97 శాతం హాజరు

PDPL: ధర్మారంలో ఇవాళ నిర్వహించిన ఇంటర్మీడియట్ సంవత్సరం ఆంగ్లం పరీక్షకు 97 శాతం విద్యార్థులు హాజరైనట్లు చీఫ్ సూపరింటెండెంట్‌లు అనంత రామకృష్ణ, గీతా వాణి తెలిపారు. ప్రభుత్వ, సాధన జూనియర్ కళాశాలలో 539 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా, 556 మంది హాజరయ్యారు. 13 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు.

February 27, 2026 / 04:11 PM IST

‘ఉద్దేశ్య పూర్వకంగానే మాపై దాడులు చేశారు’

MNCL: క్యాతనపల్లి మున్సిపాలిటీలో జరిగిన దాడి ఘటన పైన మంత్రి వివేక్ వెంకటస్వామి శుక్రవారం స్పందించారు. అయన మాట్లాడుతూ.. ఉద్దేశ్య పూర్వకంగానే తమ కాన్వాయ్‌పై, కాంగ్రెస్ నాయకులపై, BRS నాయకులు దాడులు చేశారన్నారు. దాడుల్లో కానిస్టేబుల్, కాంగ్రెస్ కార్యకర్తకు తీవ్ర గాయాలయ్యాయన్నారు. గతంలో ఎమ్మెల్యేగా పని చేసి, ఒక MLA పైన దాడులు చేయడం సిగ్గు చేటన్నారు.

February 27, 2026 / 04:09 PM IST

రుచుల విందు.. ‘ఫ్లేవర్ ఫియస్టా’ పొందు

KNR: SRR కళాశాలలో జంతుశాస్త్ర విభాగ ఆధ్వర్యంలో ‘ఫ్లేవర్ ఫియస్టా’ పేరుతో విద్యార్థులు తెలంగాణ సాంప్రదాయ వంటకాలను ప్రదర్శించారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రిన్సిపల్ రామకృష్ణ మాట్లాడుతూ.. ఇటువంటి ప్రదర్శనలు విద్యార్థుల్లో సృజనాత్మకతతో పాటు ఆహారపు అలవాట్లపై అవగాహన పెంచుతాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సురేందర్ రెడ్డి, అధ్యాపకులు రాజయ్య పాల్గొన్నారు.

February 27, 2026 / 04:04 PM IST

రోడ్డు ప్రమాదాలు తగ్గించడమే లక్ష్యం: ఎస్పీ

SRD: రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా పోలీస్ వ్యవస్థ పనిచేస్తున్నట్లు ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. జహీరాబాద్ పట్టణంలో శుక్రవారం ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రారంభించారు. అనంతరం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించే లక్ష్యంతో నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమమే ‘అరైవ్ అలైవ్’ అని చెప్పుకొచ్చారు.

February 27, 2026 / 04:03 PM IST

బషీరాబాద్‌లో ఉచిత కంటి వైద్య శిబిరం

NZB: కమ్మర్‌పల్లి మండలం బషీరాబాద్‌లో GP ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. కంటి వైద్యుడు డాక్టర్ టి.శ్రీనివాస్ 95 మందికి కంటి పరీక్ష చేశారు. వారిలో 17 మంది బాధితులకు కంటి ఆపరేషన్లు అవసరం ఉందని గుర్తించారు. నేత్ర పరీక్షలపై నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకోవాలని సర్పంచ్ బైకని జమున మహేశ్, ఉప సర్పంచ్ భూమేశ్ సూచించారు.

February 27, 2026 / 04:02 PM IST

శ్రమించినా దక్కని ఫలితం

ASF: పురిటి నొప్పులతో తీవ్రంగా బాధపడిన ఆవుకు 2 గంటలపైగా శ్రమించి పశు వైద్యులు మురళి ప్రసవం చేశారు. ఆసిఫాబాద్ మండలం మాణిక్ గుడాకి చెందిన రైతు కన్నెరాం ఆవు శుక్రవారం పురిటి నొప్పులతో బాధపడింది. పరిస్థితిని గమనించిన ఉప సర్పంచ్ అజయ్ పశువైద్య సిబ్బందికి సమాచారం అందించారు. 2 గంటలపైగా శ్రమించి దూడను వైద్యులు బయటకు తీయగా దూడ మృతి చెందిందని తెలిపారు.

February 27, 2026 / 03:55 PM IST

పంచాయతీ భవనాల నిర్మాణానికి భూమి పూజ

KMR: మహమ్మద్ నగర్ మండలం తెల్గాపూర్, హాసన్‌పల్లి గ్రామాల్లో శుక్రవారం గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి భూమి పూజ చేశారు. గాలిపూర్‌లో అంగన్‌వాడీ భవన నిర్మాణానికి జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు శంకుస్థాపన చేశారు. సుమారు రూ.52 లక్షల వ్యయంతో ఈ పనులు చేపట్టనున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి గ్రామానికి మౌలిక సదుపాయాలు ఉంచడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

February 27, 2026 / 03:55 PM IST

జాతీయ రహదారిపై వాహనం బోల్తా

SDPT: నంగునూరు(మం) రాంపూర్ వద్ద సిద్దిపేట-వరంగల్ జాతీయ రహదారిపై శుక్రవారం పెను ప్రమాదం తప్పింది. సిద్దిపేట నుంచి వరంగల్ వెళ్తున్న వాహనం ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి బోల్తా పడింది. జనరేటర్ లోడుతో ఉన్న ఈ వాహన బోల్తా కొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు విచారణ చేపట్టారు.

February 27, 2026 / 03:53 PM IST

అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల తనిఖీ

KMR: రాజంపేట మండలం అరగొండలో ఎంపీడీవో బాలకృష్ణ అంగన్వాడీ కేంద్రంలోని మౌలిక వసతులు, ప్రైమరీ స్కూల్, ఉపాధి హామీ పనులను, ఇందిరమ్మ ఇళ్లను శుక్రవారం పరిశీలించారు. తనిఖీ చేసి అక్కడ స్టాక్ రిజిస్టర్లు, పిల్లలు, గర్భిణులు, బాలింతలు తినే మధ్యాహ్న భోజనాలను రుచి చూశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ విక్రాంత్ రెడ్డి, ఉపసర్పంచ్ తుల రవి, ఏపీవో శృతి పాల్గొన్నారు.

February 27, 2026 / 03:52 PM IST

విధుల నిర్వహణలో అంకితభావం చూపాలి: కలెక్టర్

ADB: ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమమైన ‘భూ భారతి’లో భాగంగా శిక్షణ పూర్తి చేసుకున్న సర్వేయర్లు ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించాలని శుక్రవారం కలెక్టర్ రాజర్షిషా సూచించారు. రెండవ విడతలో శిక్షణ పొంది ఉత్తీర్ణులైన 65 మంది లైసెన్స్డ్ సర్వేయర్లకు లైసెన్స్‌లను అందజేశారు. కఠినమైన శిక్షణను విజయవంతంగా పూర్తి చేశామన్నారు.

February 27, 2026 / 03:50 PM IST

సేవాలాల్ జయంతి వేడుకకు పీవో, ఎస్పికి ఆహ్వానం

BDK: ఇల్లందు నియోజకవర్గ కేంద్రంలోని సింగరేణి గ్రౌండ్‌లో రేపు నిర్వహించబోయే సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ముగింపు వేడుకలకు హాజరుకావాలని ఐటీడీఏ పీవో రాహుల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజుకు మార్కెట్ కమిటీ ఛైర్మన్ రాంబాబు ఆహ్వాన పత్రికను శుక్రవారం అందజేశారు. ఈ వేడుకకు ఎమ్మెల్యే కోరం కనకయ్య, ఎంపీ బలరాం నాయక్ హాజరు అవుతారని తెలిపారు.

February 27, 2026 / 03:49 PM IST

మంచ్య తండా సర్పంచ్ భద్రమ్మకు శిక్షణ పత్రం అందజేత

SRPT: మఠంపల్లి మండలంలోని మంచ్య తండా నూతన సర్పంచ్‌గా ఎన్నికైన మలోత్ భద్రమ్మ ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. శుక్రవారం ముగిసిన ఈ శిక్షణలో భాగంగా డీఎల్‌పీవో చేతుల మీదుగా ఆమె శిక్షణ పత్రాన్ని అందుకున్నారు. ​ఈ సందర్భంగా భద్రమ్మ మాట్లాడుతూ.. శిక్షణలో నేర్చుకున్న అంశాలతో గ్రామ పంచాయతీ పాలనను పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు.

February 27, 2026 / 03:49 PM IST

JGL: మొరం తరలిస్తున్న టిప్పర్ బోల్తా

JGL: కోరుట్ల పట్టణం కల్లూరు రోడ్డుకు సమీపంలో కొనసాగుతున్న రైల్వే ట్రాక్ నిర్మాణ పనుల్లో భాగంగా మొరం తరలిస్తున్న టిప్పర్ వాహనం శుక్రవారం అదుపుతప్పి బోల్తా పడింది. ఘటన సమయంలో వాహనం వేగంగా మలుపు తిరుగుతుండగా నియంత్రణ కోల్పోయినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రాణహాని కలగలేదు. వాహనం దెబ్బతినడంతో పనులు కొంతసేపు నిలిచిపోయాయి.

February 27, 2026 / 03:47 PM IST

బీజేపీ ఫ్లోర్ రీడర్‌గా సంతోష్‌కు మద్దతు

మహబూబ్ నగర్ కార్పొరేషన్ ఎన్నికల ముగిశాయి. ప్రస్తుతం నూతన కార్యవర్గం నెలకొనే సమయం ఆసన్నమైంది. ఈ సందర్భంలో బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా సీనియర్ నేత గుండా సంతోష్‌ను నియమించాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వెలువడుతున్నాయి. ఈ మేరకు చాలామంది ఆయనను ప్రతిపాదిస్తూ బీజేపీ కార్యాలయంలో వినతి పత్రాలు సమర్పిస్తున్నారు.

February 27, 2026 / 03:47 PM IST