NZB: జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో అరికట్టాలని అధికారులను కలెక్టర్ ఇలాత్రిపాఠి ఆదేశించారు. గురువారం సాయంత్రం నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. ఇసుక బుకింగ్ ఇకపై పూర్తిగా ఆన్లైన్లో “మనా ఇసుక వాహనం”యాప్ ద్వారానే జరగాలని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆఫ్లైన్ బుకింగ్లకు అనుమతి లేదని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాలని కోరారు.