SRPT: కుట్టు మిషన్ ఆవిష్కరించి లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించిన విలియమ్స్ హో జయంతిని పురస్కరించుకుని ఫిబ్రవరి 28న నిర్వహించే టైలర్స్ డేను విజయవంతం చేయాలని జిల్లా టైలర్స్ యూనియన్ నాయకులు బాజీ ఉల్లా తెలిపారు. గురువారం స్థానిక గాంధీ పార్క్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టైలర్ వృత్తి గౌరవాన్ని కాపాడుతూ, సంఘటితంగా కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.
KMM: పట్టణంలో వెలుగుమట్ల ప్రాంతంలో పది సంవత్సరాల క్రితం పేద ప్రజలు భూధన భూమిలో ఇళ్లు నిర్మాణం చేసుకొని ఇక్కడ జీవిస్తున్నారు. ఈనెల 24 తేదీన యంత్రాలతో అధికారులు కూల్చేశారు. గురువారం సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ అనుదీప్‌కు వినతి పత్రం అందజేసి ఇళ్లు కూల్చివేత తిరిగి ప్రత్యామ్నాయమై ఏర్పాటు చేయాలని కోరారు.
HNK: పరకాల వ్యవసాయ మార్కెట్లో ఆర్ఓ వాటర్ ప్లాంట్, 5,000 మెట్రిక్ టన్నుల గోదాం చుట్టూ సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. పరకాల మార్కెట్ యార్డులో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని, రైతు సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను కల్పిస్తుందని అన్నారు.
ADB: ఆదిలాబాద్ నియోజకవర్గంలోని అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. జైనథ్ మండలంలోని దీపాయిగూడ గ్రామంలో ఇందిరమ్మ గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పేదలందరికీ సంక్షేమం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని పేర్కొన్నారు.
MHBD: కేసముద్రం మున్సిపాలిటీ కార్యాలయంలో గురువారం నూతనంగా ఎన్నికైన మున్సిపల్ ఛైర్‌పర్సన్ బానోత్ సునీత, వైస్ ఛైర్‌పర్సన్ డాక్టర్ అల్లం రమ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా MHBD MLA డాక్టర్ భూక్య మురళి నాయక్ హాజరై వారిని శాలువతో ఘనంగా సన్మానించారు. మున్సిపాలిటీ అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని MLA సూచించారు.
MLG: తాడ్వాయి మండలం మేడారంలో పలు గ్రామాలకు చెందిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు రాష్ట్ర మంత్రి సీతక్క చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్లును త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని, పూర్తయిన ఇళ్లుకు డబ్బులు చెల్లించాలని ఆదేశించారు. కార్యక్రమంలో కలెక్టర్ దివాకర టీఎస్ తదితరులు ఉన్నారు.
NGKL: పదర మండల కేంద్రంలోని శ్రీకృష్ణ దేవాలయం యొక్క ప్రహరీ గోడను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ గురువారం ప్రారంభించారు. అనంతరం స్వామివారికి పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ చిక్కుడు అనురాధ, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
HYDలో కస్టమర్లు తీసుకోని పార్సిళ్లను వేలం వేయనున్నట్లు RTC కార్గో విభాగం ప్రకటించింది. ఫిబ్రవరి 27న సికింద్రాబాద్ జేబీఎస్ కార్గో కార్యాలయంలో ఈ వేలం జరగనుంది. మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించే ఈ వేలంలో సుమారు 60 రకాల సరుకులు అమ్మకానికి ఉంటాయి. వస్తువులు అసలు ధర కంటే గరిష్టంగా 30% తక్కువ ధరకు లభించే అవకాశం ఉందన్నారు.
SRD: సంగారెడ్డి మున్సిపాలిటీలో శుక్రవారం మంచినీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. నేషనల్ హైవే విస్తరణ పనులు జరుగుతున్నందున పైప్ లైన్ షిఫ్టింగ్ చేస్తున్నట్లు చెప్పారు. అత్యవసరమైన కలనీలకు మంచినీటి ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తామని పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.
SRCL: ఇల్లంతకుంట మండలంలోని అనంతారం ప్రాజెక్టు అన్నపూర్ణ రిజర్వాయర్ నుండి వేసవి ముందు మత్తడి దూకుతూ గురువారం జలకళను సంతరించుకుంది. ఈ జలాల విడుదల వల్ల స్థానిక రైతులకు సాగునీటి అవసరాలను తీరుస్తూ పంటలను కాపాడుతున్నదని హార్షం వ్యక్తం చేస్తున్నారు.
BHPL: గోరికొత్తపల్లి మండలం నిజాంపల్లి గ్రామంలో నల్లాల బావి దగ్గర మోటార్ పాడైపోవడంతో గురువారం GP కార్యదర్శి రంజిత్, 5వ వార్డు మెంబర్ రాజేందర్, 6వ వార్డు మెంబర్ సురేష్, GP పంప్ ఆపరేటర్ అంజి గురువారం మరమ్మతు పనులు చేపట్టారు. ఈ సందర్భంగా వార్డు మెంబర్ రాజేందర్ మాట్లాడుతూ.. రానున్న వేసవిలో తాగునీటి సమస్య ఇబ్బంది కలగకుండా ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
KMM: జిల్లా వెలగమట్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల కూల్చివేత బాధితులను BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ పరామర్శించారు. వారు మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యం అంటే పేదవారి ఇళ్లను కూల్చడమా? ప్రభుత్వమే ఇచ్చిన పట్టాలు, భూదాన్ బోర్డు పత్రాలు, కాగా కోర్టు ఆర్డర్లు ఉన్నప్పటికీ, కనీస నోటీసులు ఇవ్వకుండా ఇళ్లను ధ్వంసం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు.
JN: జాతీయ రహదారి నిర్మాణంలో ప్లాట్లు కోల్పోతున్న బాధిత ప్లాట్ యజమానుల రిలే దీక్షకు 3వ వార్డు కౌన్సిలర్ బూడిద జ్యోతి మద్దతు తెలిపారు. కౌన్సిలర్ మాట్లాడుతూ.. జనగామ పట్టణంలో ఏకశిలా గడ్డకు ప్లాట్లు కోల్పోతున్న భూ-యజమానులు నష్టపరిహారం ఇవ్వాలని, వారి సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు.
BDK: అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో శ్రీ సద్గురు సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుక ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యావత్ భారతదేశం మొత్తంలో ఉన్న బంజారా ప్రజలను ఏకం చేసి సన్మార్గాన్ని చూపించిన మహనీయుడు సేవాలాల్ మహారాజ్ అని కొనియాడారు.
MDCL: ఉప్పల్ మీడియా క్లబ్ నూతన కమిటీని మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి తన నివాసంలో సత్కరించారు. సీనియర్ జర్నలిస్టు వడ్డేపల్లి కిషోర్ నేతృత్వంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఐక్యంగా ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కమిటీ సేవా కార్యక్రమాలకు సంపూర్ణ మద్దతు ఉంటుందని, అవసరమైన సదుపాయాల కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.