SRPT- నడిగూడెం మండలం సిరిపురం సబ్ స్టేషన్ ఫీడర్ పరిధిలోని సిరిపురం గ్రామంలో నేడు ఉ.9.00 నుంచి మ.2.00 గంటల మధ్య విద్యుత్ సరఫరా లో అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ అధికారులు తెలిపారు. గ్రామంలోని ఐదవ వార్డుకు చెందిన బండల బజార్లో విద్యుత్తు సరఫరాకు ఆటంకంగా మారిన చెట్ల కొమ్మలను తొలగిస్తున్న కారణంగా విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు.