• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

రైతులు వెంటనే ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి:AO

BHPL: గోరికొత్తపల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకుని రైతులు వెంటనే ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని AO సారయ్య హెచ్చరించారు. AO మాట్లాడుతూ.. రిజిస్ట్రేషన్ చేయకపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలకు అర్హత కోల్పోతారని స్పష్టం చేశారు. స్థానిక AEOల వద్ద త్వరగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలన్నారు.

March 2, 2026 / 10:05 AM IST

పేకాట స్థావరంపై దాడి 9 మందిపై కేసు నమోదు

KMM: రఘునాధపాలెం మండలం మంచుకొండ శివారులో పేకాట ఆడుతున్న ఏడుగురిని సోమవారం తెల్లవారుజామున పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపిన వివరాల ప్రకారం మంచుకొండ-పంగిడి దారిలోని ఒక తోటలో దాడులు నిర్వహించి రూ.3వేల నగదుతో పాటు 6 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు పరారవ్వగా మొత్తం తొమ్మిది మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

March 2, 2026 / 10:04 AM IST

వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే

JN: తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, TPCC వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీరెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి ఆశీస్సులు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని, ప్రజలంతా కలకలం ఆయురారోగ్యాలతో, పాడిపంటలతో సమృద్ధిగా ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

March 2, 2026 / 10:03 AM IST

చుక్కాపూర్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం మూసివేత

KMR: మాచారెడ్డి మండలం చుక్కాపూర్ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం భక్తులకు ముఖ్య ప్రకటన విడుదల చేసింది. రేపు చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం 9 గంటలకు ఆలయాన్ని మూసివేస్తామని ఆలయ అభివృద్ధి కమిటీ తెలిపింది. మంగళవారం ఆలయంలో సాధారణ దర్శనాలు ఉండవని స్పష్టం చేశారు. బుధవారం ఉదయం సంప్రోక్షణ, అభిషేక కార్యక్రమాల అనంతరం భక్తులకు తిరిగి దర్శనం కల్పించనున్నారు.

March 2, 2026 / 10:03 AM IST

యాంటీబయోటిక్స్.. ఆరోగ్యానికి ముప్పు..!

MDCL: ఉప్పల్‌లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో యాంటీబయోటిక్స్‌ను వైద్యుల సలహా లేకుండా వాడటం ఆరోగ్యానికి ముప్పు అని డా.సౌశీల్య హెచ్చరించారు. చిన్న జ్వరం, దగ్గు వచ్చినప్పుడే స్వయంగా మందులు కొనుగోలు చేయడం వల్ల యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ పెరిగే ప్రమాదం ఉందన్నారు. అవసరమైనప్పుడు మాత్రమే, పూర్తి కోర్స్ పాటిస్తేనే ప్రయోజనం ఉంటుందని సూచించారు.

March 2, 2026 / 10:02 AM IST

గోటి తలంబ్రాలతో రామయ్య చెంతకు భక్తులు

BDK: జూలూరుపాడు మండలం పెద్ద హరిజన వాడ గ్రామస్తులు భక్తిభావంతో రామనామ స్మరణతో భద్రాచలం వైపు తమ పవిత్ర పాదయాత్రను సోమవారం ప్రారంభించారు. భక్తులు గత నెల రోజులుగా అత్యంత నియమ నిష్టలతో, కఠిన ఉపవాసాలతో సిద్ధం చేసుకున్న ఒలిచిన గోటి తలంబ్రాలను భద్రాద్రి రామయ్య చెంతకు సమర్పించనున్నారు. భక్తులు సంప్రదాయక నారింజ, పసుపు రంగు దుస్తులు ధరించి వెళ్లారు.

March 2, 2026 / 10:01 AM IST

‘ఆపరేషన్ కవచ్’ సక్సెస్

KMR: జిల్లాలో నేరాల నియంత్రణే లక్ష్యంగా అమలు చేస్తున్న ‘ఆపరేషన్ కవచ్’ సత్ఫలితాలను ఇస్తోంది. రామారెడ్డి (M) పోసానిపేట వాసి పెంటయ్య ట్రాక్టర్‌ను నిందితులు దొంగిలించి బాన్సువాడలో విక్రయించేందుకు తరలిస్తుండగా ఆదివారం పద్మాజీవాడి X రోడ్డు వద్ద ‘ఆపరేషన్ కవచ్’ తనిఖీల్లో భాగంగా గాంధారి SI ఆంజనేయులు అడ్డుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

March 2, 2026 / 09:49 AM IST

హోలీ వేళ ప్రకృతి రంగుల కోలాహలం

VKB: హోలీ పండుగ సమీపిస్తున్న వేళ వికారాబాద్ జిల్లాలో ప్రకృతి రంగుల విందు చేస్తోంది. పెద్దేముల్ మండల పరిధిలోని జనగాం, మారేపల్లి, మంబాపూర్, తట్టేపల్లి, అడికిచెర్ల, ఇందూర్ సహా పలు గ్రామాల్లోని పొలాల గట్లు, అటవీ ప్రాంతం మోదుగ పూలతో ఎర్రగా మెరిసిపోతోంది. రోడ్డుకు ఇరువైపులా విరబూసిన ఈ పూలు అగ్ని కీలల్లా కనిపిస్తూ బాటసారులను కట్టిపడేస్తున్నాయి.

March 2, 2026 / 09:47 AM IST

సెమిస్టర్ ఫీజు చెల్లింపుకు అపరాధ రుసుంతో నేడే ఆఖరు

NZB: TU పరిధిలోని M.Ed మూడో సెమిస్టర్ రెగ్యులర్ విద్యార్థులు పరీక్షల ఫీజు చెల్లింపునకు అపరాధ రుసుం రూ.100తో నేడే ఆఖరు తేదీ అని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆచార్య కె.సంపత్ కుమార్ తెలిపారు. రూ.1,210 ఫీజుతో పాటు అపరాధ రుసుంతో చెల్లింపునకు అవకాశముందన్నారు. సాయంత్రం లోపు పరీక్షల ఫీజు చెల్లించాలన్నారు. పరీక్షలను మార్చి నెలలో నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.

March 2, 2026 / 09:47 AM IST

మల్లికార్జున స్వామి కళ్యాణం‌లో పాల్గొన్న ప్రభుత్వ విప్

SRCL: చందుర్తి మండల కేంద్రంలోనీ శ్రీ మల్లికార్జున స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజల మధ్య మల్లన్న కళ్యాణం నిర్వహించారు. మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొని స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

March 2, 2026 / 09:46 AM IST

జామా మసీదులో ఇఫ్తార్ విందు

NRPT: జామా మసీదులో ఆదివారం రాత్రి ముస్లింలకు ఇఫ్తార్ విందును మండల పరిషత్ మాజీ కోఆప్షన్ సభ్యుడు రెహమాన్ ఖాన్ ఏర్పాటు చేశారు. సామూహిక ప్రార్థనలు అనంతరం ఉపవాస విరమణ చేసి విందును స్వీకరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పీఎస్ చిట్టెం మాధవరెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ లక్ష్మయ్య గౌడ్, ఉప సర్పంచ్ నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

March 2, 2026 / 09:42 AM IST

షార్ట్ సర్క్యూట్.. ఆస్తి నష్టం..!

KNR: శంకరపట్నం( M) తాడికల్ గ్రామానికి చెందిన మొలుగూరి బాలకృష్ణ వాటర్ హీటర్ సహాయంతో నీటిని వేడి చేసుకునే క్రమంలో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ జరిగి ఇంట్లోని టీవీ,ఫర్నిచర్, మొబైల్ ఫోన్ కాలిపోయినట్లు తెలిపాడు. కుటుంబ సభ్యులు, స్థానికులు కలిసి పక్కనే ఉన్న ఇసుకతో మంటలను ఆర్పి వేసినట్లు పేర్కొన్నాడు. ప్రమాదంలో 40,000 రూపాయల మేరకు నష్టం వాటిల్లిందని తెలిపాడు.

March 2, 2026 / 09:39 AM IST

కురుమూర్తి క్షేత్రం 750 ఏళ్ల వైభవం

MBNR: జిల్లాలోని కురుమూర్తి స్వామి దేవస్థానం 750 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ప్రాచీన క్షేత్రం. ‘పేదల తిరుపతి’గా పేరొందిన ఈ ఆలయాన్ని 13-14వ శతాబ్దాల్లో ఆత్మకూరు–అమరచింత సంస్థానాధీశులు నిర్మించారు. స్వామివారిని కులదైవంగా ఆరాధించిన వారు ఆలయ అభివృద్ధికి కృషి చేశారు. ఈ క్షేత్రం నాటి రాచరిక వైభవం, భక్తి సంప్రదాయాలను ప్రతిబింబిస్తోంది.

March 2, 2026 / 09:39 AM IST

ఘనంగా బీరప్ప కామరతి కళ్యాణ మహోత్సవం

SRD: మనూరు మండల కేంద్రంలో గత ఐదు రోజుల నుంచి బీరప్ప ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా గొల్ల కురుమలు సంప్రదాయ పద్ధతి ప్రకారంగా ఆదివారం బీరప్ప ఆలయం ప్రాంగణంలో బీరప్ప కామరతి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో ఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, ఖేడ్ మున్సిపల్ ఛైర్మన్ నగేష్ శెట్కార్ తదితరులు సందర్శించి బీరప్ప స్వామి దర్శించుకున్నారు.

March 2, 2026 / 09:36 AM IST

మక్తల్ 8వ వార్డులో అభివృద్ధి పనులు

NRPT: మక్తల్ మున్సిపాలిటీ 8వ వార్డులో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. మంత్రి వాకిటి శ్రీహరి ప్రత్యేక చొరవతో సుమారు రూ.2.50 కోట్ల వ్యయంతో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు పనులు జరుగుతుండటంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధికి సహకరిస్తున్న మంత్రికి ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

March 2, 2026 / 09:33 AM IST