• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘ప్రతి గ్రామంలో CPI పార్టీని బలోపేతం చేయాలి’

BHPL: మండలం గొల్లబుద్ధారం గ్రామంలో ఆదివారం సాయంత్రం CPI మండల కమిటీ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి రాజ్ కుమార్ మాట్లాడుతూ, అటవీ ప్రాంతంలోని ప్రతి గ్రామంలో సీపీఐ కమిటీలను పటిష్ఠం చేసి పార్టీ బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో CPI పార్టీ నేతలు, గ్రామస్తులు ఉన్నారు.

March 2, 2026 / 07:56 AM IST

కుమ్మెర ఘటనపై నిరసన.. పజ్జూరులో ర్యాలీ

NLG: జిల్లా కుమ్మెరలో అగ్రవర్ణాల దురహంకారానికి బలైపోయిన రెండు నెలల రజక పసిపాప మృతికి నిరసనగా పజ్జూర్లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పాప ఆత్మకు శాంతి చేకూరాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లింగస్వామి, రవితేజ, శ్రవణ్, సైదులు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

March 2, 2026 / 07:56 AM IST

తాళం వేసిన ఇంట్లో చోరీ

NGKL: కల్వకుర్తి నియోజకవర్గంలోని వెల్దండ మండలం అజిలాపూర్ గ్రామ పరిధిలోని అంతిరెడ్డిపల్లిలో ఆదివారం తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. గోరటి అలివేలు అనే మహిళ ఫిబ్రవరి 27న ఇంటికి తాళం వేసి హైదరాబాద్ వెళ్లారు. ఆదివారం తిరిగి వచ్చి చూడగా, ఇంటి తాళం పగులగొట్టి, బీరువాలోని అర్ధ తులం బంగారం, రెండు వెండి మొలతాడులు, రూ. 10 వేల నగదును అపహరించారని తెలిపారు.

March 2, 2026 / 07:55 AM IST

రూ. 60 వేల LOC చెక్కు అందజేత

MDK: ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు సహకారంతో రామాయంపేట మండలం రాయలపూర్ గ్రామానికి చెందిన రాగి సందీప్‌కు రూ.60 వేల ఎల్ఓసి చెక్కును అందజేశారు. ఆపదలో ఉన్నవారికి అండగా ఉంటామని, నియోజకవర్గ ప్రజల సంక్షేమమే ఎమ్మెల్యే ధ్యేయమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ గజవాడ లావణ్య నాగరాజు, పట్టణ అధ్యక్షుడు చింతల స్వామి తదితరులు పాల్గొన్నారు.

March 2, 2026 / 07:53 AM IST

రెండు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత

KMR: నాగిరెడ్డిపేట మండలం జప్తిజానకంపల్లి గేటు సమీపంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను ఎస్సై భార్గవ్ గౌడ్ పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులను గమనించిన రెండు ట్రాక్టర్ల డ్రైవర్లు వాటిని అక్కడే వదిలేసి పారిపోయినట్లు తండావాసులు తెలిపారు. అనంతరం ఎస్సై ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

March 2, 2026 / 07:49 AM IST

50 ఏళ్ల తర్వాత కలిసిన మిత్రులు

MBNR: జిల్లాలోని ఓ జూనియర్ కళాశాల 1974-76 బ్యాచ్ విద్యార్థులు ఆదివారం అపూర్వంగా కలిశారు. అర్థ శతాబ్దం తర్వాత ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఒకరినొకరు ఆలింగనం చేసుకుని పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. తమ కళాశాల అభివృద్ధికి ఆర్థిక సహాయం అందిస్తామని ఈ సందర్భంగా వారు ప్రకటించారు.

March 2, 2026 / 07:48 AM IST

రేపు మైసిగండి మైసమ్మ ఆలయం మూసివేత

RR: చంద్రగ్రహణం కారణంగా రేపు కడ్తాల్ మండల పరిధిలోని మైసిగండి మైసమ్మ ఆలయాన్ని మూసివేయనున్నట్లు ఈవో స్నేహలత తెలిపారు. ఉదయం 7 గంటలకు ఆలయాన్ని మూసివేసి గ్రహణం వీడిన అనంతరం 4వ తేదీ ఉదయం 6 గంటలకు సంప్రోక్షణ, ప్రత్యేక పూజలు, అభిషేకం, అలంకరణ తర్వాత యథావిధిగా భక్తుల దర్శనానికి అనుమతి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.

March 2, 2026 / 07:46 AM IST

15 తులాల బంగారం చోరీ

సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి పరిధిలోని విద్యానగర్లో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. కాలనీలో నివాసం ఉండే బంగారం వ్యాపారి విక్రమ్ ఇంటికి తాళం వేసి శనివారం ఊరికి వెళ్లారు. ఆదివారం ఇంటికి వచ్చేసరికి తాళం పగలగొట్టి ఉంది. బీరువాలో ఉన్న 15 తులాల బంగారం చోరీ అయినట్లు గుర్తించారు. ఘటనా స్థలాన్ని సంగారెడ్డి రూరల్ ఎస్సై మధుసూదన్ రెడ్డి పరిశీలించారు.

March 2, 2026 / 07:43 AM IST

ముసలయ్యపల్లిలో ఎద్దుల బండి పోటీలు

NRPT:  మక్తల్ మండలం ముసలయ్యపల్లి గ్రామంలో శ్రీ నారద గడ్డ జాతర సందర్భంగా ఎద్దుల బండి లాగుడు పోటీలు ఉత్సాహంగా నిర్వహించారు. గ్రామ రైతులు పెద్ద ఎత్తున పాల్గొని తమ ఎద్దులతో ప్రతిభ చాటారు. విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ పవిత్ర, మాజీ జడ్పీటీసీ లక్ష్మారెడ్డి తదితర నాయకులు, గ్రామస్థులు పాల్గొని జాతర వేడుకలను ఘనంగా నిర్వహించారు.

March 2, 2026 / 07:39 AM IST

జిల్లాలో మహా సంగీత్ సదు జయంతి ఉత్సవాలు

JGL: వ్యక్తి నిర్మాణం ద్వారానే దేశ పునర్నిర్మాణం సాధ్యమని ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత సహ వ్యవస్థాపకుడు ప్రముఖ్ తిరుమల్ అన్నారు. ఆర్ఎస్ఎస్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా జగిత్యాల పట్టణంలో నగర మహాసాంఘిక్ నిర్వహించారు. 23 శాఖలకు చెందిన సుమారు 500 మంది స్వయం సేవకులు పాల్గొన్నారు. నిత్య శాఖ ద్వారా వ్యక్తిత్వ వికాసం జరుగుతుందని, శక్తివంతమైన భారతదేశంతోనే ప్రపంచశాంతి సాధ్యమన్నారు.

March 2, 2026 / 07:37 AM IST

ఇంద్రనగర్ అమ్మవారిని దర్శించుకున్న CI శ్రీలత

ASF: రెబ్బెన మండలం ఇంద్రనగర్ అమ్మవారిని కరీంనగర్ జిల్లా మానకొండూర్ సీఐ శ్రీలత ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. లోక కళ్యాణం, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ఆమె తెలిపారు. ఈ కార్య క్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

March 2, 2026 / 07:35 AM IST

ఆపరేషన్ సికింద్రాబాద్.. నిందితుడు అరెస్ట్..!

MDCL: ‘ఆపరేషన్ సికింద్రాబాద్’ పేరిట రైల్వే సామాగ్రి దొంగతనాలపై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రత్యేక చర్యలు చేపట్టింది. సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, మౌలాలి, అశ్వాపురం ప్రాంతాల్లో గాలింపు నిర్వహించి యాక్షన్ ప్లాన్ అమలు చేసింది. ఈ క్రమంలో ఓ దొంగను పట్టుకుని అతని వద్ద నుంచి ఎలక్ట్రిక్ వైర్, భారీ పంపుసెట్ స్వాధీనం చేసుకున్నారు.

March 2, 2026 / 07:30 AM IST

అనుమతి లేకుండా తుపాకీ.. వేటగాడు రిమాండ్!

VKB: జిల్లా మెజిస్ట్రేట్ అనుమతి లేకుండా అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్న వ్యక్తిని కుల్కచర్ల పోలీసులు అరెస్ట్ చేశారు. అడవి పందులను వేటాడేందుకు సదరు వ్యక్తి తుపాకీని వినియోగిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు.

March 2, 2026 / 07:30 AM IST

శంషాబాద్‌లో హాకీ ప్లేయర్లకు స్వాగతం

HYD: మార్చి 8 నుంచి 14 వరకు గచ్చిబౌలి స్టేడియంలో మహిళల హాకీ వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ జరగనున్నాయి. ఈ టోర్నీలో పాల్గొనేందుకు వస్తున్న 8 దేశాల క్రీడాకారిణులకు శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అంతర్జాతీయ ప్రమాణాలతో హాకీ వరల్డ్ కప్ ఏర్పాట్లను ప్రభుత్వం పూర్తి చేసింది.

March 2, 2026 / 07:27 AM IST

మోడల్ స్కూల్ ప్రవేశాల గడువు పొడిగింపు

SDPT: బెజ్జంకి మండలంలోని తెలంగాణ మోడల్ స్కూల్లో 6వ తరగతి ప్రవేశాల దరఖాస్తుల గడువును మార్చి 10 వరకు పొడిగించినట్లు ప్రిన్సిపాల్ మలోత్ సంగీత తెలిపారు. సంచాలకులు సున్నం శ్రీనివాస్ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 19, 2026న జరగనుంది. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ₹2000 నగదు బహుమతి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

March 2, 2026 / 07:26 AM IST