• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఆర్యభట్ట పాఠశాలపై అధికారుల చర్యలేవి..?

MHBD: తొర్రూరు మండల కేంద్రంలోని ఆర్యభట్ట పాఠశాలలో గత మూడు రోజుల క్రితం 5వ తరగతి చదువుతున్న బాలుడిని ఉరితీసి స్లాబ్‌కి వేలాడదీయడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ విషయంపై పాఠశాల యజమాన్యాన్ని బాలుడి తల్లిదండ్రులు నిలదీయడంతో నిజాన్ని కప్పిపుచ్చారు. న్యాయం కోసం బాధితులు తొర్రూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని వాపోయారు.

March 2, 2026 / 10:25 AM IST

నేడు శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి కళ్యాణం!

MDK: కొల్చారం మండలం పైతర గ్రామంలో సోమవారం శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరగనుంది. శ్రీ శ్రీ మాధవ నంద సరస్వతి స్వామి ఆధ్వర్యంలో నిర్వహించే ఈ వేడుకలో ధ్వజస్తంభ ప్రతిష్ట, లక్ష పుష్పార్చన, పాలాభిషేకం వంటి విశేష పూజలు నిర్వహించనున్నారు. భక్తులు కుటుంబ సమేతంగా హాజరై స్వామివారిని దర్శించుకోవాలని సర్పంచ్‌ల అధ్యక్షుడు రవితేజ కోరారు .

March 2, 2026 / 10:25 AM IST

‘గడువు ముగిసేలోగా రుణాలు పంపిణీ చేస్తాం’

ASF: 2025- 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మహిళా సంఘాల సభ్యులకు రూ. 232.43 కోట్ల రుణాలను అందించాలనె లక్ష్యం చేరుకుంటామని ఆసిఫాబాద్ DRDO దత్తరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు రూ.164.76 కోట్ల రుణాలను ఆయా సంఘాలకు పంపిణీ చేశామన్నారు. గడువు ముగిసేలోగా వందశాతం రుణాలు పంపిణీ చేసేలా ప్రణాళికలు అమలు చేస్తున్నామన్నారు.

March 2, 2026 / 10:23 AM IST

స్వగ్రామం చేరిన మాజీ మావోయిస్టు

PDPL: ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల కోటేశ్వరరావు 45 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత స్వగ్రామమైన పెద్దపల్లికి ఆదివారం వచ్చారు. 1980లో ఉద్యమ బాట పట్టిన మల్లోజుల మావోయిస్టు పార్టీలో అంచలంచెలుగా ఎదిగి కేంద్ర కమిటీ సభ్యుడి వరకు ఎదిగి ఇటీవల మహారాష్ట్ర సీఎం ఎదుట లొంగిపోయాడు. కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.

March 2, 2026 / 10:22 AM IST

భక్తుల కష్టాలు తీర్చిన బోరిగామ సర్పంచ్

ADB: ఇచ్చోడ మండలం బోరిగామ పోచమ్మ తల్లి ఆలయానికి వెళ్లే భక్తులు రోడ్డు గుంతలమయంగా మారడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాల కారణంగా ఆలయ మార్గం గుంతలమయంగా మారి భక్తులు నానా అవస్థలు పడుతున్న విషయాన్ని గుర్తించిన సర్పంచ్ ఆసిఫ్ ఖాన్ వెంటనే స్పందించారు. తన చొరవతో రహదారిపై మొరం వేయించి, మరమ్మతులు చేయించారు. దీంతో అమ్మవారి దర్శనానికి మార్గం సుగమమైంది.

March 2, 2026 / 10:20 AM IST

వరంగల్‌లో ‘లక్కీ డ్రా’ మోసాలపై పోలీసుల కఠిన చర్యలు

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అడ్డదారిలో డబ్బు సంపాదనకు ‘లక్కీ డ్రా’ పేరుతో సామాన్యులను మోసం చేస్తున్న నిర్వాహకులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇళ్లు, వాహనాలు గెలుచుకోవచ్చంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఇప్పటికే పలువురిపై కేసులు నమోదు చేశారు. ప్రజలు ఇలాంటి మోసపూరిత ఆశలకు లోనవకూడదన్నారు.

March 2, 2026 / 10:20 AM IST

వివిధ ఆర్టీసీ డిపోలో ఉద్యోగ అవకాశాలు

WNP: జీఎస్ఆర్టీసి మహబూబ్‌నగర్ రీజియన్ పరిధిలో వివిధ డిపోలలో అప్రెంటిస్ శిక్షణ ప్రాతిపదికన ఆసక్తిగల వారి కొరకు ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నట్లు రీజనల్ మేనేజర్ సంతోష్ కుమార్ తెలిపారు. ఇంజనీరింగ్, డిప్లమా, ఏదైనా డిగ్రీ 2021 సంవత్సరంలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు అన్నారు. http://nats.education.gov.in వెబ్‌సైట్‌లో మార్చి 16 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

March 2, 2026 / 10:14 AM IST

మైనర్ కాలువలకు సాగునీటి విడుదల

JGL: పెగడపల్లి మండల పరిధిలోని ఎస్సారెస్పీ ప్రధాన కాలువ నుంచి మైనర్ కాలువలకు ఆదివారం అధికారులు సాగునీటిని విడుదల చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన వారబందీ పద్ధతిలో డిస్ట్రిబ్యూటరీ కాలువలకు నీరు చేరుతోంది. ఎండల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా, కాలువ మొదట్లో ఉన్న రైతులు నీటిని వృధా చేయకుండా సహకరించాలని అధికారులు కోరారు. పంటలు ఎండిపోకుండా కాపాడుకోవాలన్నారు.

March 2, 2026 / 10:11 AM IST

కోతుల సమస్య.. పంచాయతీ వినూత్న పరిష్కారం

KNR: రామడుగు గ్రామంలో కోతుల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం గ్రామ పంచాయతీ వినూత్న కార్యక్రమం చేపట్టింది. గ్రామస్తులకు ఇబ్బందులు కలగకుండా పంచాయతీ సిబ్బంది ప్రత్యేక వేషధారణతో గ్రామంలో తిరుగుతూ కోతులను తరిమివేస్తున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ మొయిజ్, ఉపసర్పంచ్ పెందోట రాజుతో పాటు వార్డ్ సభ్యులు పాల్గొన్నారు. గ్రామస్తులు భయపడకుండా సహకరించాలని కోరారు.

March 2, 2026 / 10:11 AM IST

చంద్రగ్రహణం.. చెర్వుగట్టు ఆలయం మూసివేత

NLG: చంద్రగ్రహణం కారణంగా రేపు నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడాల రామలింగేశ్వర స్వామి దేవాలయం, గోపాలయపల్లి సమీపంలోని వారిజాల వేణుగోపాల స్వామి దేవాలయాలను మూసివేస్తున్నట్లు ఆయా ఆలయాల ఈవోలు సల్వాది మోహన్ బాబు, వెంకట్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

March 2, 2026 / 10:10 AM IST

కొనసాగుతున్న పారిశుద్ధ్య పనులు

సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ అశ్రిత్ కుమార్ ఆదేశాల మేరకు పట్టణంలో పారిశుద్ధ్య పనులు కొనసాగుతున్నాయి. పలు కాలనీల్లో నిండిన డ్రైనేజీలను శుభ్రం చేశారు. ప్రధాన రోడ్లపై ఉన్న చెత్తాచెదారం మట్టిని తొలగించారు. ఇంటింటికి వెళ్లి చెత్త సేకరించి డంపింగ్ యార్డ్‌కు తరలించారు. ప్రజలు చెత్త రోడ్లపై పారవేయకుండా మున్సిపల్ వాహనాలకు అందివాలని కమిషనర్ కోరారు.

March 2, 2026 / 10:09 AM IST

నేడు లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవం

SRPT: మునగాల మండలం రేపాల గ్రామంలోని స్వయంభు లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవం నేడు రాత్రి 10 గంటలకు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కళ్యాణాన్ని దర్శించుకోవడం వల్ల ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. కళ్యాణ మహోత్సవానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఛైర్మన్ సారిక చిన్న రామయ్య యాదవ్ తెలియజేశారు.

March 2, 2026 / 10:08 AM IST

రోజుకు అరకిల తింటే ఆరోగ్యం బాగు..!

HYD: నగరాల్లో మారుతున్న జీవనశైలితో చాలామంది రోజుకు కనీసం 200 గ్రాముల కూరగాయలు, ఆకుకూరలు కూడా తీసుకోవడం లేదని అధికారులు చెబుతున్నారు. దీనివల్ల రక్తహీనత, మధుమేహం సమస్యలు పెరుగుతున్నాయని హెచ్చరిస్తున్నారు. రోజుకు కనీసం 400–500 గ్రాముల వరకు కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవడంతో విటమిన్లు, ఖనిజాలు అందుతాయని HYD NIN మాజీ శాస్త్రవేత్త డాక్టర్ లక్ష్మయ్య సూచించారు.

March 2, 2026 / 10:07 AM IST

బాబ్లీ గేట్లు ఎత్తడంతో గోదావరిలోకి భారీగా నీరు

NZB: సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు మహారాష్ట్రలోని బాబ్లీ గేట్లను నిన్న ఎత్తారు. ఈ కార్యక్రమంలో TG, MH, కేంద్ర జలవనరులశాఖ అధికారులు, ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం జూలై 1 నుంచి అక్టోబరు 29 వరకు నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేయాల్సి ఉంటుంది. అదనంగా మార్చి 1న ఒకరోజు 0.6 టీఎంసీల నీటిని కూడా విడుదల చేస్తారు.

March 2, 2026 / 10:06 AM IST

దుబాయ్‌లో చిక్కుకున్న 360 మంది

మహబూబ్‌నగర్ జిల్లా వాసులు దుబాయ్‌లో ఇరుక్కుపోయారు. ఓ గోల్డ్ లోన్ సంస్థ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 360 మందిని టూర్‌కు తీసుకెళ్లింది. తిరుగు ప్రయాణానికి విమానాశ్రయానికి చేరుకున్న వేళ యుద్ధ పరిస్థితుల కారణంగా ఫ్లైట్లు రద్దయ్యాయి. దీంతో వారు అక్కడే నిలిచిపోయారు. అధికారుల జోక్యం కోరుతున్నారు.

March 2, 2026 / 10:05 AM IST