HYD: గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రవేశపెట్టనున్న ఎలక్ట్రిక్ బస్సుల కోసం కావాల్సిన EV డిపోలు, హైటెన్షన్ (HT) విద్యుత్ లైన్ల నిర్మాణంపై RTC దృష్టి సారించింది. నగరంలో ఇప్పటికే 265 ఎలక్ట్రిక్ బస్సులు తిరుగుతుండగా.. మరో మూడు నెలల్లో 275 బస్సులు రానున్నాయి. రానున్న మూడేళ్లలో 2,800 EV బస్సులను తిప్పాలని RTC లక్ష్యంగా పెట్టుకుంది.
NLG: తెలంగాణ మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ (CITU) 4వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి పోలే సత్యనారాయణ కోరారు. సోమవారం దొడ్డి కొమరయ్య భవనంలో కార్మికులతో కలిసి ఆయన మహాసభల పోస్టర్‌ను ఆవిష్కరించారు. అక్టోబర్ 26, 27 తేదీలలో ఇబ్రహీంపట్నంలో జరగనున్న ఈ రెండు రోజుల మహాసభల్లో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సూచించారు.
GDWL: వనపర్తిలోని ఎస్వీఎంఆర్ డిగ్రీ కళాశాలలో ఫస్టియర్ చదువుతున్న విద్యార్థిని మౌనిష అదృశ్యమైంది. దసరా సెలవుల కోసం స్నేహితురాలి ఊరైన జోగులాంబ గద్వాల జిల్లా అనంతపురం గ్రామానికి వచ్చిన మౌనిష, ఈనెల 5న హైదరాబాద్ వెళ్తున్నానని చెప్పి వెళ్లి, తిరిగి రాలేదు. బంధుమిత్రుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో, తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
MBNR: జిల్లా ప్రభుత్వ మెడికల్ కళాశాలలో నూతన సంవత్సర విద్యార్థులు వారి తల్లిదండ్రుల కోసం ఓరియంటేషన్ ప్రోగ్రాం సోమవారం నిర్వహించారు. జిల్లా ఎస్పీ జానకి మాట్లాడుతూ.. వైద్య విద్యార్థులు రేపటి సమాజానికి సేవ చేయబోయే వైద్యులు అన్నారు. మాదకద్రవ్యాల కట్టడి, ర్యాగింగ్ డ్రగ్స్ వంటి నేరాలకు దూరంగా ఉండాలన్నారు.
GDWL: గ్రీవెన్స్ డేలో వచ్చిన అర్జీలపై పోలీస్ అధికారులు వెంటనే స్పందించి, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకు మొత్తం 12 అర్జీలు వచ్చాయని ఆయన తెలిపారు. వీటిలో భూ వివాదాలకు సంబంధించి 6 ఫిర్యాదులు, అంశాలపై మిగతా ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ పేర్కొన్నారు.
ASF: కెరమెరి మండలం జోడే ఘాట్ వద్ద ప్రభుత్వం భీం వర్ధంతిని నేడు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఉమ్మడి జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, మంత్రులు గడ్డం వివేక్,లక్ష్మణ్,సీతక్కలు హాజరు కానున్నారు. అలాగే MP గోడం నగేశ్,MLA లు కోవ లక్ష్మి, వెడ్మ బొజ్జు నివాళులర్పించనున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కారణంగా కేవలం నివాళులు అర్పిస్తారు.
KMM: కామేపల్లి మండలంలోని మద్దులపల్లి ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో మంగళవారం ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డాక్టర్ చందన తెలిపారు. భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి, ఖమ్మం వైద్య ఆరోగ్య శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవలన్నారు.
SRPT: ప్రేమ ప్రేమతో యువతిని వేధిస్తున్న వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం సాయంత్రం నడిగూడెం మండల ఎస్సై అజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..మండల కేంద్రానికి చెందిన మౌనిక అనే యువతిని నడిగూడెంకు చెందిన సంతోష్ గత కొద్దిరోజులుగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
SRD: మెడికల్ కళాశాలలో రెండు సంవత్సరాలకు గాను పనిచేసేందుకు పారామెడికల్ కోర్సుల కోసం దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ప్రకాష్ రావు సోమవారం తెలిపారు. డిప్లమో ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నీషియన్ కోర్సు- 30, డిప్లమో ఇన్ ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్ కోర్స్-30 సీట్లు ఉన్నాయని చెప్పారు. అర్హులైన అభ్యర్థులు నెల28 www.tgpmb.telangana.gov.in లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
WGL: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం సాయంత్రం కాకతీయ మెగా టెక్స్‌టైల్స్ పార్క్ నిర్మాణ పనులపై కలెక్టర్ డా. సత్య శారద అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పార్క్ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన మాస్టర్ ప్లాన్ ప్రకారం అత్యాధునిక సదుపాయాలతో యుద్ధప్రాతిపదికన నిర్మాణం పూర్తి చేయాలని సంబధిత అధికారులను ఆదేశించారు.
MDK: తూప్రాన్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన తాజా మాజీ ఎంపీటీసీ పంజాల వెంకటమ్మ సోమవారం రాత్రి మృతి చెందారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న వెంకటమ్మ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. వెంకటమ్మ మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.
BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు సోమవారం సమకూరిన ఆదాయ వివరాలను ఆలయ ఈవో రవి నాయక్ వెల్లడించారు. అందులో ప్రధాన బుకింగ్ ప్రత్యేక దర్శనాలు, ప్రసాద విక్రయాలు, కళ్యాణ కట్ట, వ్రతాలు, యాదరుషి నిలయం కార్ పార్కింగ్, అన్నదాన విరాళాలు తదితర విభాగాల నుంచి మొత్తం కలిసి రూ.14,13,552 ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు.
KMR: CJI BR గవాయ్ పై దాడి యత్నాన్ని ధర్మ సమాజ్ పార్టీ జిల్లా నాయకులు తీవ్రంగా ఖండించారు. జిల్లా పార్టీ ఆఫీసులో వారు మాట్లాడుతూ.. దేశ సర్వోన్నత న్యాయస్థానానికి చీఫ్ జస్టిస్ అయినా గవాయ్‌పై మతోన్మాద ముసుగులో రాకేష్ కిషోర్ దాడికి యత్నించడం సిగ్గుచేటన్నారు. అతడిపై దేశద్రోహం కింద కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
BHPL: చిట్యాల మండలం వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన చిలుకల రాకేశ్ ఆరు నెలల క్రితం సెల్ ఫోను పోగొట్టుకుని, స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. CEIR పోర్టల్ ద్వారా ఫోను వరంగల్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సోమవారం ఎస్సై శ్రావణ్ కుమార్ రాకేశ్‌కు మొబైల్‌ను అందజేశారు. ఈ సందర్భంగా రాకేశ్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపాడు.
JGL: భీమారం మండలంలోని మన్నెగూడెంలో కుక్క దాడిలో వాసం గంగు అనే మహిళ సోమవారం తీవ్రంగా గాయపడింది. ఇంట్లో పడుకుని ఉన్న ఆమెపై కుక్క చొరబడి విచక్షణారహితంగా దాడి చేయడంతో తలకు గాయాలయ్యాయి. గంగును వెంటనే జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో కుక్కల బెడద అధికంగా ఉందని, అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.