SRPT: ప్రేమ ప్రేమతో యువతిని వేధిస్తున్న వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం సాయంత్రం నడిగూడెం మండల ఎస్సై అజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..మండల కేంద్రానికి చెందిన మౌనిక అనే యువతిని నడిగూడెంకు చెందిన సంతోష్ గత కొద్దిరోజులుగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
SRD: మెడికల్ కళాశాలలో రెండు సంవత్సరాలకు గాను పనిచేసేందుకు పారామెడికల్ కోర్సుల కోసం దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ప్రకాష్ రావు సోమవారం తెలిపారు. డిప్లమో ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నీషియన్ కోర్సు- 30, డిప్లమో ఇన్ ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్ కోర్స్-30 సీట్లు ఉన్నాయని చెప్పారు. అర్హులైన అభ్యర్థులు నెల28 www.tgpmb.telangana.gov.in లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
WGL: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం సాయంత్రం కాకతీయ మెగా టెక్స్‌టైల్స్ పార్క్ నిర్మాణ పనులపై కలెక్టర్ డా. సత్య శారద అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పార్క్ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన మాస్టర్ ప్లాన్ ప్రకారం అత్యాధునిక సదుపాయాలతో యుద్ధప్రాతిపదికన నిర్మాణం పూర్తి చేయాలని సంబధిత అధికారులను ఆదేశించారు.
MDK: తూప్రాన్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన తాజా మాజీ ఎంపీటీసీ పంజాల వెంకటమ్మ సోమవారం రాత్రి మృతి చెందారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న వెంకటమ్మ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. వెంకటమ్మ మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.
BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు సోమవారం సమకూరిన ఆదాయ వివరాలను ఆలయ ఈవో రవి నాయక్ వెల్లడించారు. అందులో ప్రధాన బుకింగ్ ప్రత్యేక దర్శనాలు, ప్రసాద విక్రయాలు, కళ్యాణ కట్ట, వ్రతాలు, యాదరుషి నిలయం కార్ పార్కింగ్, అన్నదాన విరాళాలు తదితర విభాగాల నుంచి మొత్తం కలిసి రూ.14,13,552 ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు.
KMR: CJI BR గవాయ్ పై దాడి యత్నాన్ని ధర్మ సమాజ్ పార్టీ జిల్లా నాయకులు తీవ్రంగా ఖండించారు. జిల్లా పార్టీ ఆఫీసులో వారు మాట్లాడుతూ.. దేశ సర్వోన్నత న్యాయస్థానానికి చీఫ్ జస్టిస్ అయినా గవాయ్‌పై మతోన్మాద ముసుగులో రాకేష్ కిషోర్ దాడికి యత్నించడం సిగ్గుచేటన్నారు. అతడిపై దేశద్రోహం కింద కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
BHPL: చిట్యాల మండలం వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన చిలుకల రాకేశ్ ఆరు నెలల క్రితం సెల్ ఫోను పోగొట్టుకుని, స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. CEIR పోర్టల్ ద్వారా ఫోను వరంగల్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సోమవారం ఎస్సై శ్రావణ్ కుమార్ రాకేశ్‌కు మొబైల్‌ను అందజేశారు. ఈ సందర్భంగా రాకేశ్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపాడు.
JGL: భీమారం మండలంలోని మన్నెగూడెంలో కుక్క దాడిలో వాసం గంగు అనే మహిళ సోమవారం తీవ్రంగా గాయపడింది. ఇంట్లో పడుకుని ఉన్న ఆమెపై కుక్క చొరబడి విచక్షణారహితంగా దాడి చేయడంతో తలకు గాయాలయ్యాయి. గంగును వెంటనే జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో కుక్కల బెడద అధికంగా ఉందని, అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
NZB: సిరికొండ మండలం కొండాపూర్ గ్రామంలో ఈనెల 4, 5 తేదీల్లో జరిగిన వాలీబాల్ లీగ్ క్రీడా పోటీలు అట్టహాసంగా ముగిశాయి. ఈ పోటీల్లో సహర్ష్ యాదవ్ టీం ప్రథమ స్థానంలో నిలవగా, పరమేశ్వర టెంట్ హౌస్ టీమ్ ద్వితీయ స్థానంలో నిలిచింది. ముఖ్య అతిథిగా సీసీఎంబీ శాస్త్రవేత్త దినేష్ పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. యువత క్రీడల్లో చురుకుగా పాల్గొనడం మంచిదని ఆయన అన్నారు.
ASF: రెబ్బెన మండలం గోలేటి టౌన్ షిప్ లోని సీఈఆర్ క్లబ్‌లో నేడు, రేపు సింగరేణి కంపెనీ స్థాయి క్యారమ్స్,చదరంగం పోటీలు నిర్వహిస్తున్నట్లు GM విజయభాస్కర్ రెడ్డి ప్రకటనలో తెలిపారు. పోటీలలో పాల్గొనే క్రీడాకారులకు ఇప్పటికే అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. పోటీలను వర్కు పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
SRCL: కేసులలో పారదర్శకత చూడాలని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గుడిసె సదానందం అన్నారు. సోమవారం వేములవాడ బార్ అసోసియేషన్ హాల్‌లో నూతనంగా నియామకమైన అడిషనల్ పిపి అవధూత రజనీకాంత్‌ను న్యాయవాదులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెండింగ్ కేసుల పరిష్కారంలోనూ ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. న్యాయవాదులతో సమన్వయంగా ఉండాలని ఆయన అన్నారు.
PDPL: యూరియా సరఫరా విషయంలో అక్టోబర్ నెలాఖరు వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన సమీక్షలో, పెండింగ్ అవసరాల కోసం సరిపడా నిల్వలు ఉండేలా చూడాలని తెలిపారు. యూరియా అక్రమ రవాణా నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. ధాన్యం కొనుగోలు సజావుగా సాగేందుకు ఏఈవో ద్వారా కార్యాచరణ సిద్ధం చెయ్యాలన్నారు.
PDPL: టాస్క్ కేంద్రంలో 8న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. టెలిపెర్ఫార్మెన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో కస్టమర్ సర్వీస్ అసోసియేట్, కంటెంట్ మోడరేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ, బీటెక్, పీజీ ఉత్తీర్ణులైన 18 నుంచి 35 ఏళ్ల అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లతో ఉదయం ఎంపీడీవో కార్యాలయంలోని టాస్క్ కేంద్రానికి హాజరు కావాలన్నారు.
MDK: ఈనెల 12 వరకు సమాచార హక్కు చట్టం వారోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. సమాచార హక్కు చట్టం 2005, ప్రభుత్వ అధికారుల పనితీరులో పారదర్శకత, జవాబుదారీతనాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఒక మైలురాయి చట్టంగా ఉందని తెలియజేశారు. ముఖ్యమైన చట్టం అమలులోకి వచ్చినందుకు ప్రభుత్వం నుంచి సమాచారం పొందే హక్కు గురించి పౌరుల్లో అవగాహన కల్పించాలని అన్నారు.
KNR: సంవత్సరం క్రితం పోగొట్టుకున్న ఫోన్‌ను తిమ్మాపూర్ పోలీసులు సోమవారం బాధితుడికి తిరిగి అప్పగించారు. తిమ్మాపూర్ మండలం జోగుండ్లకు చెందిన జాల నర్సయ్య పోగొట్టుకున్న ఫోన్‌ను పోలీసులు ట్రేస్ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై కదిరే శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ.. మొబైల్ పోగొట్టుకున్నవారు CEIR పోర్టల్‌లో ఫిర్యాదు చేస్తే, ఫోన్‌ను ట్రేస్ చేసి తిరిగి పొందడం సులభమని అన్నారు.