• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

కలెక్టరేట్ ముందు అంధుడి పోరాటం

NRML: సారంగాపూర్ మండలం కౌట్ల(బి) గ్రామానికి చెందిన అంధుడు కాసారం రాజేశ్వర్ కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టాడు. మెరిట్ ఉన్నప్పటికీ తనకు ఉద్యోగం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. 2015 నుంచి హెల్త్ వర్కర్, అటెండర్‌గా పనిచేసినా వయోపరిమితి పేరుతో తొలగించారని తెలిపారు. తనకు న్యాయం చేయాలని కలెక్టర్‌ను కోరాడు.

March 2, 2026 / 08:00 PM IST

‘వెంటనే డంపింగ్ యార్డును తొలగించాలి’

HNK: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ కు మడికొండ గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. మడికొండలోని డంపింగ్ యార్డులో నిరంతరం చెత్త కాల్చడంతో వెలువడే దట్టమైన పొగ గ్రామమంతా కలుషితమై గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నట్లు బాధితులు తెలిపారు. యార్డును తక్షణమే తరలించాలని కలెక్టర్‌ను కోరారు.

March 2, 2026 / 07:59 PM IST

దాడిని అడ్డుకున్న కార్యకర్తలను అభినందించిన కేంద్ర మంత్రి

KMR: వారం రోజుల క్రితం కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, ఎమ్మెల్యేపై దాడిని అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలను సోమవారం కేంద్రమంత్రి బండి సంజయ్ అభినందించారు. తమ నేతలను కాపాడుకోవడమే కాకుండా తమ స్వార్థ జీవితాన్ని వదిలి సమాజహితంలో భాగంగా జైలుకు వెళ్లిరావడం అభినందనీయమేనని కేంద్ర మంత్రి అన్నారు.

March 2, 2026 / 07:56 PM IST

డీసీపీ ఆఫీసును సందర్శించిన సీపీ

RR: ఫ్యూచర్ సిటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సుధీర్ బాబు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన డీసీపీ ఆఫీస్‌ను సందర్శించారు. డీసీపీ ఆఫీసును సందర్శించిన ఫ్యూచర్ సిటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సుధీర్ బాబును డీసీపీ శిరీష స్వాగతించారు. ఈ కార్యక్రమంలో పట్టణ పోలీసు అధికారులు పాల్గొన్నారు.

March 2, 2026 / 07:54 PM IST

ఇందూరు సంస్కృతికి ప్రతీక కామ దహనం

NZB: జిల్లా ఆర్యసమాజ్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి కామదహన యజ్ఞం నిర్వహించారు. అధ్యక్షుడు సూర్య ప్రకాశ్ ఆర్య మాట్లాడుతూ.. 1993 నుంచి గాంధీ చౌక్లో యజ్ఞం చేస్తున్నామన్నారు. యజ్ఞంతో పర్యావరణ పరిరక్షణ, కాలుష్య క్రిమి నివారణ కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. మార్చి 4న రంగోలి నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

March 2, 2026 / 07:52 PM IST

‘ఈనెల 5న శివపార్వతుల కళ్యాణం’

PDPL: ధర్మారం మండలం నంది మేడారం శ్రీ అమరేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 5న శివపార్వతుల కళ్యాణం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ రాజేష్ యాదవ్ తెలిపారు. ఉదయం 8:30కి గణపతి పూజ పుణ్య వచనం, 11:45కు శివపార్వతుల ఉత్సవ విగ్రహ చర ప్రతిష్ట, సాయంత్రం 5 గంటలకు కళ్యాణ మహోత్సవం నిర్వహించబడతాయన్నారు. కావున భక్తులు ఈ పుణ్యకార్యంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

March 2, 2026 / 07:50 PM IST

కేజీబీవీలో ‘ప్యానల్’ బృందం తనిఖీ

JGL: విద్యార్థుల మేధస్సుకు అనుగుణంగా విద్యాబోధన చేయాలని తనిఖీ బృందం సభ్యులు సూచించారు. సోమవారం పెగడపల్లి మండల కేంద్రంలోని కేజీబీవీని ప్యానల్ బృందం సందర్శించింది.తరగతి గదులకు వెళ్లి బోధన తీరును, విద్యార్థుల మార్కుల జాబితాలను పరిశీలించారు. పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని ఆదేశించారు. ఈ తనిఖీలో హెచ్ఎం, ఎస్ఓ, తనిఖీ బృందం సభ్యులు,  ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

March 2, 2026 / 07:50 PM IST

కామ దహనంలో ఎమ్మెల్యే ధన్పాల్

NZB: నగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కామ దహనంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. ఆయన ప్రత్యేక పూజలు చేసి ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

March 2, 2026 / 07:49 PM IST

‘సహజసిద్ధమైన రంగులతోనే హోళీ సంబరాలు నిర్వహించాలి’

ASF: సహజసిద్ధమైన రంగులతోనే హోళీ సంబరాలు నిర్వహించాలని ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితికా పంత్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. హోళీ వేడుకలు ప్రశాంత వాతావరణంలో, ఇతరులకు హాని కలిగించకుండా సూచించారు. ప్రధాన కూడళ్లలో నిరంతర నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

March 2, 2026 / 07:48 PM IST

జిల్లా ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన.. కలెక్టర్

HNK: హన్మకొండ జిల్లాలోని ప్రజలందరికీ సోమవారం జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ హోలీ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. చెడు పై ప్రతీకగా హోలీ పండగ జరుపుకుంటారన్నారు. సహజసిద్ధ రంగులనే వినియోగించాలని, రసాయన రంగులు ఆరోగ్యానికి హానికరమని కలెక్టర్ హెచ్చరించారు. ప్రజలు శాంతియుతంగా హోలీ వేడుకలు జరుపుకోవాలని కలెక్టర్ సూచించారు.

March 2, 2026 / 07:42 PM IST

AIMIM ఆధ్వర్యంలో ఘనంగా దావత్-ఎ-ఇఫ్తార్ విందు

HYD: AIMIM ఆధ్వర్యంలో సోమవారం మలక్‌పేట నియోజకవర్గంలోని అజాంపురాలోని ఫరత్ నగర్ గ్రౌండ్ వద్ద దావత్-ఎ-ఇఫ్తార్‌ విందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల, MLC మీర్జా రియాజ్ ఉల్ హసన్ పాల్గొన్నారు. మత పెద్దలతో కలిసి వారు (దువా) ప్రత్యేేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ముస్లిం సోదరులతో కలిసి విందు ఆరగించారు.

March 2, 2026 / 07:40 PM IST

మహిళా సమస్య భవనానికి శంకుస్థాపన

MDK: కొల్చారం మండలం చిన్న ఘనపూర్ గ్రామంలో వివో 1, 2 మహిళా సమైక్య భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. సర్పంచ్ చందాపురం మధుసూదన్ రెడ్డి ఎన్నికల హామీలలో ఆమె మేరకు నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చందాపురం మధుసూదన్ రెడ్డి, ఉప సర్పంచ్ అంకమ్మ నరసింహులు, సీసీ వెంకటేశం, వీవోలు, ఓబి అధ్యక్షులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

March 2, 2026 / 07:39 PM IST

జక్లేర్‌ గ్రామంలో మహిళ మృతి

NRPT: మక్తల్ మండలం జక్లేర్ గ్రామంలోని చెరువులో 50 ఏళ్ల లాకా సంజమ్మ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. సోమవారం ఉదయం రైతులు చెరువు కట్టపైంచి రైల్వే స్టేషన్ వైపు పంట పొలాలకు వెళ్తుండగా మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉన్నాయి. పోలీసులు విచారణ చేస్తున్నారు.

March 2, 2026 / 07:37 PM IST

ముందస్తు హోలీ సంబరాలు

PDPL: కాల్వశ్రీరాంపూర్ మండలం ఊషన్నపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ముందస్తు హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి. ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య ఆధ్వర్యంలో విద్యార్థులు రంగులు చల్లుకుంటూ ఆనందంగా పండుగ జరుపుకున్నారు. సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూనే విద్యాభివృద్ధి సాధించాలని ఆయన సూచించారు. నాణ్యమైన ఉచిత విద్య అందించే సర్కారు బడులే మేలని అన్నారు.

March 2, 2026 / 07:37 PM IST

క్రీడాకారుల ప్రతిభను గుర్తించడానికి PM ఖేల్ మహోత్సవం

KNR: క్రీడాకారుల ప్రతిభను గుర్తించడానికి, చాటి చెప్పడానికి ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ కార్యక్రమం, ఎంతో దోహదపడుతుందని, కరీంనగర్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సునీల్ రావు అన్నారు. కరీంనగర్లో ప్రధానమంత్రి కీడే సంస్థ పోటీలను ఆయన ప్రారంభించారు.కేంద్రంలోని మోదీ ప్రభుత్వం క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించడానికి కట్టుబడి పనిచేస్తుందని అన్నారు.

March 2, 2026 / 07:36 PM IST