పెద్దపల్లి: మండలంలోని అందుగులపల్లి గ్రామ రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలని ఉపసర్పంచ్ స్వప్న అన్నారు. సోమవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆమె పరిశీలించారు.ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే ప్రభుత్వం అందిస్తున్న పథకాలు అందుతాయని స్పష్టం చేశారు.గ్రామ పంచాయతీ కార్యదర్శి ఉన్నారు.
MLG: హోలీ పండుగ సందర్భంగా ములుగు జిల్లా ప్రజలకు, అధికారులకు రాష్ట్ర మంత్రి సీతక్క శుభాకాంక్షలు తెలిపారు. పండుగను ప్రశాంత వాతావరణంలో సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని మంత్రి సీతక్క సూచించారు. రసాయనిక రంగులు వాడకుండా సహజ సిద్ధమైన రంగులనే ఉపయోగించాలని, ఇతరుల ఇష్టాయిష్టాలను గౌరవిస్తూ వేడుకలు నిర్వహించాలని కోరారు.
ADB: భారత ప్రజారోగ్య ప్రమాణాల హామీల అమలులో భాగంగా 100 రోజుల పాటు ఆరోగ్య కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు DMHO నరేందర్ రాథోడ్ తెలిపారు. ఆదిలాబాద్ DMHO కార్యాలయంలో ఏర్పాటు చేసిన శిక్షణలో ఆయన సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ నెల 4న ప్రారంభంకానున్న 100 రోజుల ఆరోగ్య కార్యక్రమాల వివరాల MLHP, MOలు, పర్యవేక్షణ సిబ్బందికి శిక్షణ అందించారు.
KNR: ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇకపై మరో లెక్క అంటూ కరీంనగర్ మున్సిపల్ అధికారులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్లోని ఎంపీ కార్యాలయంలో దిశానిర్దేశం చేశారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతికి స్వస్తి పలకాలని, నిబంధనల ప్రకారం ఇళ్ల అనుమతులు సులభతరం చేయాలని ఆయన ఆదేశించారు. నిజాయితీగా పనిచేసే వారికి అండగా ఉంటానని, హామీ ఇచ్చారు.
GDWL: గ్రహణ కాలంలో ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం ఆలయ గర్భాలయ ద్వారాలను మూసివేయడం సంప్రదాయం అని ఆలయ ఈవో పురందర్ కుమార్ పేర్కొన్నారు. చంద్రగ్రహణం నేపథ్యంలో మంగళవారం ఉదయం 8 గంటలకే గద్వాల జిల్లాలోని ప్రసిద్ధ శ్రీ జమ్ములమ్మ పరశురామ స్వామి దేవాలయాన్ని ప్రత్యేక పూజల అనంతరం మూసివేశారు. గ్రహణ కాలం ముగిసిన తర్వాత, బుధవారం తెల్లవారుజామున 6 తెరుస్తామన్నారు.
MBNR: కౌకుంట్ల మండల కేంద్రంలో సర్పంచ్ ఉల్లి నరేశ్ కుమార్ ఆధ్వర్యంలో లార్వా నిర్మూలన కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామంలోని కాలువలు, నీరు నిల్వ ఉన్న ప్రదేశాల్లో లార్విసైడ్ మందులను పిచికారీ చేయించారు. వారం రోజుల పాటు సాగే ఈ డ్రైవ్లో భాగంగా ప్రజలు తమ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సర్పంచ్ సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
RR: షాద్‌నగర్ ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు సోమవారం డీసీపీ కార్యాలయాన్ని సందర్శించారు. శాంతిభద్రతలు, నేరాల నియంత్రణపై అధికారులతో సమీక్షించారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని ఆదేశించారు. రికార్డులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ పర్యటనతో పోలీస్ సేవలపై స్పష్టత పెరిగింది.
WNP: రైతు దేశానికి వెన్నెముక అని, సాగు లేకపోతే మానవ సమాజానికి మనుగడ లేదని డాక్టర్ ఎద్దుల రాజవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. శ్రీ సాయి అఖిల ట్రస్ట్ రూపొందించిన ‘రైతుకు వందనం’ పాట వండర్ రికార్డు సాధించిన సందర్భంలో ఎల్బీ స్టేడియంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. చిన్న జీయర్ స్వామి చేతుల మీదుగా రాజవర్ధన్ రెడ్డి ‘ఉత్తమ రైతు’ పురస్కారాన్ని అందుకున్నారు.
KMR: హోళీ పండుగను పురస్కరించుకుని జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ జిల్లా ప్రజలకు హోళీ వేడుక శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ.. రాగద్వేషాలకు అతీతంగా అందరినీ ఒక్కచోట చేర్చే ఈ హోళీ వేడుక ప్రజలందరి జీవితాలలో రంగుల పండుగ అందరి జీవితాల్లో శాంతిసౌఖ్యాలు నింపాలన్నారు. జిల్లా ప్రజలు ఆనందోత్సాహాలతో హోళీ వేడుక జరుపుకోవాలని అభిలాషించారు.
SDPT: కోహెడ మండలం నకిరేకొమ్ములలో కోతుల బెడద నుంచి ఉపశమనం పొందేందుకు గ్రామస్థులు వినూత్న ప్రయత్నం చేపట్టారు. పంటలను నాశనం చేస్తూ, ఇళ్లలోకి చొరబడుతున్న కోతులను తరిమికొట్టేందుకు ఓ వ్యక్తికి ఎలుగుబంటి వేషధారణ వేయించి ఊరంతా తిప్పారు. ఎలుగుబంటిని చూసి కోతులు భయంతో పారిపోవడంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు. సమస్య పరిష్కారానికి ఇది తాత్కాలిక మార్గమన్నారు.
నల్గొండ పాతబస్తీలోని షేర్ బంగ్లా ప్రాంతంలో కాముని దహన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. స్థానిక సంతోషి మాత ఆలయం వద్ద ఏర్పాటు చేసిన ఈ వేడుకకు భక్తులు భారీగా తరలివచ్చారు. సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించిన అనంతరం అగ్నిని వెలిగించి కామదహనం చేశారు. రంగుల పండుగకు ముందు నిర్వహించే ఈ వేడుకలో యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు.
సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో మార్చి నెలకు సంబంధించిన సదరం శిబిరాల షెడ్యూల్ను ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురళీకృష్ణ విడుదల చేశారు. మార్చి 4, 11, 18, 25 తేదీల్లో ఈ శిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. దివ్యాంగులు ముందుగానే స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. శిబిరానికి వచ్చే వారు స్లాట్ బుకింగ్ మెసేజ్, ఆధార్ కార్డు తీసుకుని రావాలి అన్నారు.
SRPT: మునగాల మండలం రేపాల గ్రామంలోని లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు భాగంగా మంగళవారం తెల్లవారుజామున లక్ష్మీనరసింహస్వామి కళ్యాణాన్ని పూజారులు శాస్త్ర పాయంగా నిర్వహించారు. భక్తులు స్వామివారి కల్యాణాన్ని కన్నుల పండగ వీక్షించారు. అనంత భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కళ్యాణ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
WGL: నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మంగళవారం తన నివాసంలో కార్యకర్తల సమక్షంలో హోలీ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలకు, ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. రంగుల పండుగ ఆనందాన్ని పంచుకుంటూ అందరూ సోదరభావంతో, ఐక్యతతో జీవించాలని జీవించాలని ప్రజలు కోరారు. ఈ కార్యక్రమంలో అశోక్, హరి, సురేష్, తదితరులు పాల్గొన్నారు.
HYD: ‘ఫ్యూచర్ సిటీ’ నుంచి ఏపీ రాజధాని అమరావతి మధ్య ప్రతిపాదిత గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేకు సమాంతరంగా సెమీ బుల్లెట్ ట్రైన్ రానుంది. గంటకు 250 కి.మీ. వేగంతో ప్రయాణించే ఈ రైలు ద్వారా HYD నుంచి అమరావతికి కేవలం గంటన్నరలోనే చేరుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనతో మిర్యాలగూడ మీదుగా సాగే ఈ కారిడార్‌ను చెన్నై వరకు పొడిగిస్తే 3 గంటల్లోనే వెళ్లొచ్చు.