RR: జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. రంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్మన్ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో ఆశావాహులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. జిల్లాలోని కందుకూరు, షాబాద్ మండలాల్లో ఎస్సీ మహిళలకు రిజర్వ్ కావడంతో అన్ని పార్టీల నుంచి పోటీ ఎక్కువగా ఉంది.
NGKL: ఆర్టీసీ డిపో మేనేజర్ వైఖరికి నిరసనగా కల్వకుర్తి డిపో ఎదుట బీసీ సబ్ ప్లాన్ సాధన కమిటీతో పాటు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం ధర్నా నిర్వహించారు. సబ్ ప్లాన్ సాధన కమిటీ తాలూకా అధ్యక్షులు రాజేందర్ మాట్లాడుతూ.. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ ప్రమాదానికి గురైన బాధితులను ఆదుకోవడంలో డిపో మేనేజర్ నిర్లక్ష్య వైఖరి అవలంబించిందని అన్నారు.
జగిత్యాల జిల్లా స్థాయి పాఠశాలల క్రీడా పోటీలకు అంతర్గాం పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు. బాలికల విభాగంలో వైశాలి, స్పందన, ఇందు, శరణ్య, దీపిక, రవళి, పాల్, రాధిక, అవంతి, బాలుర విభాగంలో నిశాంత్, అభి, సాత్విక్, రాంచరణ్, స్వామి ఎంపికయ్యారని ప్రధానోపాధ్యాయులు సింగు సత్తయ్య తెలిపారు. ఉపాధ్యాయులు భూపతిరావు, సరోజ, అనిత, తదితరులు అభినందించారు.
MNCL: జిల్లాలో యూరియా సమృద్ధిగా అందుబాటులో ఉందని, రైతులు అవసరం మేరకు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. యూరియా సక్రమంగా వినియోగించుకునే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అసవరం లేదని, ప్రతీ రైతుకు యూరియా అందించే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటారని చెప్పారు.
PDPL: ఆర్టీఎం ట్రాఫిక్ పోలీసులు గత కొంతకాలంగా నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 11మందిని సోమవారం జీడీకే సెకండ్ అడిషనల్ మేజిస్ట్రేట్ వెంకటేష్ దుర్వ ముందు హాజరుపరిచారు. 11 మందికి కలిపి మొత్తం రూ.20 వేల జరిమానా విధించారు. వీరిలో రెండోసారి పట్టుబడిన ఆటో డ్రైవర్‌కు 2 రోజుల జైలు శిక్ష విధించినట్లు ట్రాఫిక్ సీఐ రాజేశ్వర రావు తెలిపారు.
BDK: జూలూరుపాడు మండలం పాపకొల్లులోని ముత్యమ్మకాలనీలో సోమవారం దారుణ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ధారావత్ గోపి అనే వ్యక్తి తన భార్య సునీతను వేట కొడవలితో నరికి చంపాడని అన్నారు. నిందితుడు భార్యను చంపిన అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
SRCL: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీని వాస్ అన్నారు. సోమవారం చందుర్తి మండల కేంద్రంలోని స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీకి బలమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
KMR: జిల్లాలో సోమవారం కురిసిన వర్షానికి పలు గ్రామాల్లోని చెరువుల అలుగులు ఉప్పొంగాయి. పిట్లం మండలం తిమ్మనగర్ వద్ద కాకివాగు, నల్లవాగులు పొంగిపొర్లడంతో వరద తీవ్రత పెరిగింది. ఈ వరదలో పెద్ద కొడఫ్గల్ మండలం పోచారం తండాకు చెందిన రైతు ఫక్రే సైమల్ చిక్కుకుపోయాడు. సమాచారం అందుకున్న సహాయక బృందాలు వెంటనే రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు.
HYD: గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రవేశపెట్టనున్న ఎలక్ట్రిక్ బస్సుల కోసం కావాల్సిన EV డిపోలు, హైటెన్షన్ (HT) విద్యుత్ లైన్ల నిర్మాణంపై RTC దృష్టి సారించింది. నగరంలో ఇప్పటికే 265 ఎలక్ట్రిక్ బస్సులు తిరుగుతుండగా.. మరో మూడు నెలల్లో 275 బస్సులు రానున్నాయి. రానున్న మూడేళ్లలో 2,800 EV బస్సులను తిప్పాలని RTC లక్ష్యంగా పెట్టుకుంది.
NLG: తెలంగాణ మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ (CITU) 4వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి పోలే సత్యనారాయణ కోరారు. సోమవారం దొడ్డి కొమరయ్య భవనంలో కార్మికులతో కలిసి ఆయన మహాసభల పోస్టర్‌ను ఆవిష్కరించారు. అక్టోబర్ 26, 27 తేదీలలో ఇబ్రహీంపట్నంలో జరగనున్న ఈ రెండు రోజుల మహాసభల్లో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సూచించారు.
GDWL: వనపర్తిలోని ఎస్వీఎంఆర్ డిగ్రీ కళాశాలలో ఫస్టియర్ చదువుతున్న విద్యార్థిని మౌనిష అదృశ్యమైంది. దసరా సెలవుల కోసం స్నేహితురాలి ఊరైన జోగులాంబ గద్వాల జిల్లా అనంతపురం గ్రామానికి వచ్చిన మౌనిష, ఈనెల 5న హైదరాబాద్ వెళ్తున్నానని చెప్పి వెళ్లి, తిరిగి రాలేదు. బంధుమిత్రుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో, తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
MBNR: జిల్లా ప్రభుత్వ మెడికల్ కళాశాలలో నూతన సంవత్సర విద్యార్థులు వారి తల్లిదండ్రుల కోసం ఓరియంటేషన్ ప్రోగ్రాం సోమవారం నిర్వహించారు. జిల్లా ఎస్పీ జానకి మాట్లాడుతూ.. వైద్య విద్యార్థులు రేపటి సమాజానికి సేవ చేయబోయే వైద్యులు అన్నారు. మాదకద్రవ్యాల కట్టడి, ర్యాగింగ్ డ్రగ్స్ వంటి నేరాలకు దూరంగా ఉండాలన్నారు.
GDWL: గ్రీవెన్స్ డేలో వచ్చిన అర్జీలపై పోలీస్ అధికారులు వెంటనే స్పందించి, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకు మొత్తం 12 అర్జీలు వచ్చాయని ఆయన తెలిపారు. వీటిలో భూ వివాదాలకు సంబంధించి 6 ఫిర్యాదులు, అంశాలపై మిగతా ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ పేర్కొన్నారు.
ASF: కెరమెరి మండలం జోడే ఘాట్ వద్ద ప్రభుత్వం భీం వర్ధంతిని నేడు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఉమ్మడి జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, మంత్రులు గడ్డం వివేక్,లక్ష్మణ్,సీతక్కలు హాజరు కానున్నారు. అలాగే MP గోడం నగేశ్,MLA లు కోవ లక్ష్మి, వెడ్మ బొజ్జు నివాళులర్పించనున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కారణంగా కేవలం నివాళులు అర్పిస్తారు.
KMM: కామేపల్లి మండలంలోని మద్దులపల్లి ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో మంగళవారం ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డాక్టర్ చందన తెలిపారు. భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి, ఖమ్మం వైద్య ఆరోగ్య శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవలన్నారు.