• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

చంద్ర గ్రహణం.. బాసర ఆలయం మూసివేత

NRML: కేతుగ్రస్త చంద్రగ్రహణం సందర్భంగా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయాన్ని మంగళవారం మూసివేశారు. ఉదయం 7 గంటలకు అమ్మవార్లకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రధాన, ఉప ఆలయాలను అర్చకులు ద్వారబంధనం చేశారు. సాయంత్రం 7 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి సంప్రోక్షణ, మహాహారతి నిర్వహిస్తామని ఏఈఓ తెలిపారు.

March 3, 2026 / 09:17 AM IST

రోడ్డుపై నీరు.. వెళ్లేదేలా?

ADB: గాదిగూడ మండలంలోని లోకారి గ్రామానికి వెళ్లే రహదారిపై నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తోంది. గ్రామ సమీపంలో చిన్న వంకలు ఉండడంతో బ్రిడ్జి లేక నీరు రోడ్డుపైకి వస్తుంది. ఆ రహదారి మీదుగా రోజు పదుల సంఖ్యలో రాకపోకలు సాగిస్తుండగా వారికి ఆటంకం కలిగిస్తుంది. అధికారులు స్పందించి నూతన బ్రిడ్జి నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.

March 3, 2026 / 09:17 AM IST

కామ దాహం చేసిన ఎలిగండ్ల యువకులు

NRPT: మరికల్ మండలంలోని ఎలిగేండ్ల గ్రామంలో సోమవారం రాత్రి కామ దహనాన్ని వైభవంగా నిర్వహించారు. మంగళవారం చంద్రగ్రహణం సందర్భంగా సోమవారం రోజు కామ దహనాలు నిర్వహించిన అనంతరం బుధవారం సహజసిద్ధమైన రంగులతో హోలీ నిర్వహించుకోవాలని గ్రామ సర్పంచ్ అశ్విని నరేష్ గౌడ్ గ్రామంలో చాటింపు వేశారు. యువత పెద్ద ఎత్తున కామదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.

March 3, 2026 / 09:16 AM IST

ప్రతిభకు వేదిక ‘సంసద్ ఖేల్ మహోత్సవం’

KNR: క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన ‘సంసద్ ఖేల్ మహోత్సవం’ అద్భుత వేదికని డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు పేర్కొన్నారు. కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియంలో అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి పోటీలను ఆయన ప్రారంభించారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్స్ పోటీల్లో 200 మందికి పైగా క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

March 3, 2026 / 09:14 AM IST

ఘనంగా లక్ష్మీ నరసింహ స్వామి జాతర ఉత్సవాలు

JGL: కథలాపూర్ మండలం గంభీర్పూర్ గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర ఉత్సవాలు, సోమవారం ఘనంగా నిర్వహించారు. దేవాలయంలో భక్తులు పూజలు చేసి కొబ్బరికాయాలు కొట్టి, స్వామివారి కళ్యాణం నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుంటుక మనోహర్, ఉపసర్పంచ్ గండి తిరుపతి, అర్చకులు మాధవచారీ, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

March 3, 2026 / 09:08 AM IST

దోమకొండలో మార్చి 7న ఉద్యోగ మేళా

KMR: దోమకొండ కోటలో మార్చి 7వ తేదీ(శనివారం)ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. కామారెడ్డి ఎంప్లాయ్‌మెంట్ ఆఫీస్, డీఎంకే ఫోర్ట్ ట్రస్ట్, లైఫ్-ఎన్‌జీవో ఆధ్వర్యంలో జరుగనున్న ఈ మేళాలో 30కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొని ప్రత్యక్ష ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. నిరుద్యోగ యువత బయోడేటాతో హాజరుకావాలని నిర్వాహకులు సూచించారు. వివరాలకు 9493143378 నంబర్‌‌కు సంప్రదించలన్నారు

March 3, 2026 / 09:08 AM IST

‘సాంప్రదాయబద్ధంగా హోలీ వేడుకలు నిర్వహించుకోవాలి’

MBNR: సాంప్రదాయబద్ధంగా హోలీ వేడుకలను నిర్వహించుకోవాలని మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలోని 21వ డివిజన్ కార్పొరేటర్ గుండా సంతోష్ అన్నారు.హోలీ పండుగను పురస్కరించుకుని మంగళవారం తెల్లవారుజామున కామ దహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు చిన్నారులు రసాయనిక రంగులు జల్లుకోకుండా సాంప్రదాయ బద్ధమైన రంగులను చల్లుకోవాలని సూచించారు.

March 3, 2026 / 09:04 AM IST

గోపాల్‌పేట వార్డు సభ్యుల శిక్షణ

WNP: గోపాల్ పేట మండలంలోని 15 గ్రామ పంచాయతీల వార్డు సభ్యులకు శిక్షణ శిబిరం ప్రారంభమైంది. సోమవారం ఎంపీడీవో ఆయుష్ అంజుమ్ కార్యాలయంలో శిక్షణ ప్రారంభమైంది. వార్డు సభ్యులు తమ వార్డులలో పథకాలు ప్రజలకు ఎలా చేరవేయాలో నేర్చుకుంటున్నారు. ఎంపీడీవో, గ్రామ కార్యదర్శి మరియు వార్డు సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

March 3, 2026 / 09:03 AM IST

‘కుల గణన రెమ్యూనరేషన్ వెంటనే చెల్లించాలి’

SRD: ఉపాధ్యాయులకు కుల గణన రెమ్యూనరేషన్ వెంటనే చెల్లించాలని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలు డిమాండ్ చేశారు. సంగారెడ్డిలోని సంఘ భవనంలో సోమవారం సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు రెమ్యూనరేషన్ చెల్లించకపోవడం సరి కాదన్నారు. అధికారులు స్పందించకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

March 3, 2026 / 09:03 AM IST

ఐటీఐ మైదానంలో అంబరాన్నంటిన హోలీ వేడుకలు

NZB: ఐటీఐ మైదానంలో మంగళవారం హోలీ వేడుకలు మిన్నంటాయి. వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో వాకర్లందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. సంగీతానికి అనుగుణంగా నృత్యాలు చేస్తూ కేరింతలు కొట్టారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.

March 3, 2026 / 09:01 AM IST

రేపటి నుంచే సాగునీటి విడుదల!

NLG: జిల్లాలో రబీ సీజన్లో సాగు చేసిన పంటలు నీరందక ఎండిపోతున్న తరుణంలో నీటిపారుదల శాఖ అధికారులు సానుకూల నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 11వ తేదీ నుంచి డీ-25 కాలువ గేట్లను మూసివేయడంతో, కాలువ కింద ఉన్న పొలాలు బీటలు వారుతున్నాయి. రైతుల విజ్ఞప్తులు, పంటల పరిస్థితిని గమనించిన నీటిపారుదల శాఖ అధికారులు, డీ-25 కాలువ ద్వారా రేపటి నుంచి నీటిని వదలనున్నారు.

March 3, 2026 / 09:01 AM IST

ఇద్దరు పంచాయతీ కార్యదర్శుల బదిలీ

VKB: బొంరాస్‌పేట మండలం రేగడిమైలారం కార్యదర్శి నాగరాజు, తుంకిమెట్ల కార్యదర్శి రాజేష్ బదిలీపై వెళ్లారు. గత నాలుగు సంవత్సరాలుగా గ్రామాలల్లో విధులు నిర్వహించి ప్రజల మన్ననలు పొందారు. కార్యదర్శి నాగరాజు సూర్యాపేట జిల్లాకు, కార్యదర్శి రాజేష్ నల్లగొండ జిల్లాకు బదిలీ అయినట్లు అధికారులు వెల్లడించారు. ఆయా గ్రామాల ప్రజలు వారు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.

March 3, 2026 / 08:57 AM IST

గద్వాల కలెక్టర్‌ను సన్మానించిన నేతలు

గద్వాల జిల్లా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన రిజ్వాన్ బాషా షేక్‌కు సోమవారం సీనియర్ సిటిజన్ ఫోరం నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. మోహన్ రావు, రామన్ గౌడ్, కలీమ్ తదితరులు శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అభివృద్ధికి అందరూ సహకరించాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి కలిసి పనిచేయాలని కలెక్టర్ కోరారు.

March 3, 2026 / 08:54 AM IST

ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరుకావలి: కలెక్టర్

KMM: ఖమ్మం నగరంలోని శ్రీ భక్తరామదాసు కళాక్షేత్రంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన పరీక్షల సంసిద్ధత కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీవితంలో పదవ తరగతి అత్యంత కీలకమని, విద్యార్థులు భయం వీడి ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరుకావాలని సూచించారు.

March 3, 2026 / 08:44 AM IST

కొడుకులు పట్టించుకోవడం లేదని కలెక్టర్‌కు వినతి

JGL: బుగ్గారం మండల కేంద్రానికి చెందిన కొడిమ్యాల రాజయ్య తన కొడుకులు పట్టించుకోవడం లేదని జగిత్యాలలో నిర్వహించిన ప్రజావాణిలో సోమవారం జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్‌కు వినతిపత్రం సమర్పించారు. తన భార్య 2020లో మృతి చెందిందని, ఆమె మరణించిన తర్వాత 6 నెలలు చూసుకుని తన పెద్ద కుమారుడు ఇంటి నుంచి గెంటేశాడని, చిన్న కొడుకు వద్దకు వెళ్తే కోడలు బూతులు తిడుతుందని తెలిపారు.

March 3, 2026 / 08:42 AM IST