• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

బస్సు కోసం ఎదురుచూస్తూ.. వ్యక్తి మృతి

JGL: జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్‌లో బస్సు కోసం ఎదురుచూస్తున్న మల్లాపూర్ గ్రామానికి చెందిన కాశవత్తుల పెద్ద గంగారం(58) గుండెపోటుతో మృతి చెందారు. అనారోగ్య కారణాలతో వైద్య పరీక్షలకు వచ్చిన ఆయన, స్వగ్రామానికి వెళ్ళేందుకు బస్టాండ్‌లో వేచి ఉన్నప్పుడు అకస్మాత్తుగా కుప్పకూలి మరణించారు. వైద్యులు చూసి మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

March 3, 2026 / 09:42 AM IST

KU విద్యార్థికి డాక్టరేట్

HNK: కాకతీయ విశ్వవిద్యాలయం ఎకనామిక్స్ విభాగ పరిశోధక విద్యార్థిని నేరెళ్ల శైలజకు డాక్టరేట్ ప్రకటించబడింది. పరీక్షల నియంత్రణ అధికారి రాజేందర్ సోమవారం ఈ విజయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఆమె ‘తెలంగాణ రాష్ట్రంలో ఆహార పంటలు & ఆహారేతర పంటల ఆర్థిక విశ్లేషణ – ఉత్తర తెలంగాణ అధ్యయనం’ అనే అంశంపై విశ్రాంత ఆచార్యులు భాస్కర్ పర్యవేక్షణలో పరిశోధన పూర్తి చేశారు.

March 3, 2026 / 09:41 AM IST

పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఘన సన్మానం

KMM: జిల్లా కలెక్టరేట్లో ఫిబ్రవరిలో పదవీ విరమణ పొందిన ఉద్యోగులను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఘనంగా సన్మానించారు. సుమారు 30 నుండి 35 ఏళ్ల పాటు ప్రభుత్వ సేవలో ఉండి, ప్రజా శ్రేయస్సు కోసం కృషి చేసిన ఉద్యోగులకు కలెక్టర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రిటైర్మెంట్ తర్వాత వారి జీవితం ప్రశాంతంగా, ఆరోగ్యవంతంగా సాగాలని ఆకాంక్షించారు.

March 3, 2026 / 09:39 AM IST

బ్రిడ్జి అలైన్మెంట్ మార్చాలని సర్పంచుల వినతి

KNR:మానేరు నదిపై రూ. 71 కోట్లతో నిర్మించ తలపెట్టిన కొత్త బ్రిడ్జి అలైన్మెంట్‌ను మార్చాలని కోరుతూ మండల సర్పంచుల ఫోరం సోమవారం రోడ్లు భవనాల శాఖ ఈఈకి వినతిపత్రం అందజేశారు. కేంద్రమంత్రి బండి సంజయ్ కృషితో మంజూరైన ఈ వంతెనను, గతంలో నిర్ణయించిన ప్రదేశంలో కాకుండా మైలారం మైసమ్మ గుట్ట మీదుగా కరీంనగర్కు అనుసంధానించాలని వారు కోరారు.

March 3, 2026 / 09:37 AM IST

జలమండలిలో ‘ఈ-ఆఫీస్’ సేవలు షురూ

HYD: జలమండలిలో కాగిత రహిత పరిపాలనకు శ్రీకారం చుట్టారు. మంగళవారం బోర్డు ప్రధాన కార్యాలయంలో ఎండీ అశోక్ రెడ్డి ‘ఈ-ఆఫీస్’ వ్యవస్థను ప్రారంభించారు. ఫైళ్ల కదలికలో పారదర్శకత, వేగవంతమైన సేవల కోసమే ఈ డిజిటల్ విధానమని ఆయన తెలిపారు. రియల్‌టైమ్ ట్రాకింగ్ ద్వారా పనుల పురోగతిని పర్యవేక్షించవచ్చన్నారు.

March 3, 2026 / 09:37 AM IST

బలవంతపు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటాం: SI

MHBD: కొత్తగూడ మండల ప్రజలకు SI రాజ్ కుమార్ హోలీ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. హోలీ వేడుకలను సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని సూచించారు. పర్యావరణ హితమైన సహజ రంగులను మాత్రమే వినియోగించాలని, ఇతరుల ఇష్టానికి విరుద్ధంగా రంగులు చల్లడం, నీటి బెలూన్లు విసరడం నివారించాలని కోరారు. హోలీ చందా పేరుతో బలవంతపు వసూళ్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

March 3, 2026 / 09:36 AM IST

రామాయంపేటలో ఘనంగా హోలీ సంబరాలు

మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో హోలీ పండుగ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. యువజ్యోతి ఫుట్బాల్ ఆధ్వర్యంలో స్థానిక హాస్టల్ విద్యార్థులు రంగుల పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ, శుభాకాంక్షలు తెలుపుకుంటూ సందడి చేశారు.​ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యువజ్యోతి ఫుట్బాల్ కోఆర్డినేటర్ బొంతల సత్యనారాయణ పాల్గొన్నారు.

March 3, 2026 / 09:34 AM IST

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి: DMHO

HNK: ఐనవోలు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సోమవారం సాయంత్రం HNK జిల్లా DMHO డా. అప్పయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో పలు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వైద్యాధికారులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అధికారులకు సూచించారు.

March 3, 2026 / 09:33 AM IST

రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయం తాత్కాలిక మూసివేత

NLG: నేడు చంద్రగ్రహణం కారణంగా కనగల్ మండలం ధర్వేశిపురం గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. మంగళవారం ఉ. 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆలయ ద్వారాలు మూసి ఉంటాయని ఆలయ అర్చకులు నాగోజు మల్లాచారి తెలిపారు. తిరిగి రేపు (బుధవారం, మార్చి 4) ఉ. 8 గంటలకు ఆలయ సంప్రోక్షణ నిర్వహించి, దర్శనం కల్పిస్తారు.

March 3, 2026 / 09:31 AM IST

చంద్రగ్రహణం వేళ శివాలయం మూసివేత

SRPT: మేళ్లచెరువు స్వయంభూ శంభు లింగేశ్వర దేవస్థానాన్ని చంద్రగ్రహణం పురస్కరించుకుని మంగళవారం ఉదయం 7 గంటలకు మూసివేశారు. ఈవో నాగెళ్ల శంభిరెడ్డి, ప్రధాన అర్చకులు విష్ణువర్ధన్ శర్మ ఆధ్వర్యంలో ఆలయ ద్వారబంధనం చేశారు. తిరిగి బుధవారం ఉదయం సంప్రోక్షణ, శుద్ధి కార్యక్రమాల అనంతరం 6 గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పిస్తామని ఆలయ వర్గాలు వెల్లడించాయి.

March 3, 2026 / 09:30 AM IST

ఎలుగుబంటి వేషంతో కోతులు పరార్

MNCL: జన్నారంలోని గాంధీ నగర్ లో కోతులను తరిమేందుకు వార్డు సభ్యుడు ముడుగు ప్రవీణ్ వినూత్నమైన ఆలోచనను అమలు చేశారు. కాలనీలో కోతుల బెడద ఎక్కువగా ఉండడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీంతో వార్డు సభ్యుడు ప్రవీణ్ ఒక వ్యక్తికి ఎలుగుబంటి వేషం వేయించి కాలనీలోని అన్ని వీధులలో తిప్పించారు. దీంతో కోతులు భయపడి అక్కనుండి పారిపోయాయి. ప్రవీణ్ను స్థానికులు అభినందించారు.

March 3, 2026 / 09:29 AM IST

చందుర్తిలో ఘనంగా కామ దహనం

SRCL: చందుర్తి మండల కేంద్రంలో సోమవారం రాత్రి కామ దహనం ప్రజలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం హోలీ పండుగకు ఒక రోజు ముందు రాత్రి కాముని దహనం చేయడం ఆనవాయితీగా వస్తుంది పిడకలతో కట్టెలను పేర్చి కామ దహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కాముని చుట్టూ ప్రదక్షిణలు చేసి ప్రత్యేక పూజలు చేసి శాస్త్రవేత్తంగా కామదాహనం నిర్వహించారు.

March 3, 2026 / 09:25 AM IST

విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలి: MLA

MLG: ఈ నెల 14 నుంచి ప్రారంభమయ్యే 10వ తరగతి వార్షిక పరీక్షల సన్నాహాల పై MLG జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ మహేందర్ జీ సమీక్ష సమావేశం నిర్వహించారు. పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ప్రశ్నాపత్రాలు, సమాధాన పత్రాల రవాణా పోలీసు భద్రతలోనే జరగాలని సూచించారు. విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలన్నారు.

March 3, 2026 / 09:24 AM IST

బాధితుడికి అఖిల భారత యాదవ సంఘం నాయకుల పరామర్శ

MBNR: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా రైతులు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొని అరెస్ట్ అయిన మహబూబ్ నగర్ వాస్తవ్యుడు నరసింహులు యాదవ్ కుటుంబాన్ని అఖిలభారత యాదవ మహాసభ నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను విడనాడాలన్నారు. యాదవులు పోరాట పట్టిమగలవారన్నారు.

March 3, 2026 / 09:18 AM IST

గ్రహణం సందర్భంగా రామయ్య ఆలయం మూసివేత

BDK: చంద్ర గ్రహణం సందర్భంగా నేడు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రామాలయ మూసివేస్తున్నట్లు ఆలయ సిబ్బంది తెలిపారు. ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా పసుపు కొట్టి రామయ్యని పెళ్ళికొడుకుని చేసి తలంబ్రాలు కలపడం ఆనవాయితీ. నేడు గ్రహణం కారణంగా ఈ క్రతువును బుధవారం నిర్వహించే విధంగా వైదిక సిబ్బంది నిర్ణయించారు. బుధవారం దేవస్థానం రామయ్య పెళ్లి పనులు ప్రారంభం.

March 3, 2026 / 09:18 AM IST