KNR:మానేరు నదిపై రూ. 71 కోట్లతో నిర్మించ తలపెట్టిన కొత్త బ్రిడ్జి అలైన్‌మెంట్‌ను మార్చాలని కోరుతూ మండల సర్పంచుల ఫోరం సోమవారం రోడ్లు భవనాల శాఖ ఈఈకి వినతిపత్రం అందజేశారు. కేంద్రమంత్రి బండి సంజయ్ కృషితో మంజూరైన ఈ వంతెనను, గతంలో నిర్ణయించిన ప్రదేశంలో కాకుండా మైలారం మైసమ్మ గుట్ట మీదుగా కరీంనగర్‌కు అనుసంధానించాలని వారు కోరారు.