• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

తాండూరు మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా పట్లోళ్ల నర్సింలు

VKB: తాండూరు మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా పట్లోళ్ల నర్సింలు నియామకం అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తాండూరు మార్కెట్ కమిటి ఛైర్మన్‌గా ఉన్న సాయిపూర్ బాల్ రెడ్డి ఇటీవల తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన స్థానంలో మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలును మార్కెట్ కమిటి ఛైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

March 3, 2026 / 10:35 AM IST

‘గ్రామ పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి’

MDK: చేగుంట మండలం పోలంపల్లి గ్రామంలో పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్లు సర్పంచ్ కొండి రాజ్యలక్ష్మి స్వామి పేర్కొన్నారు. గ్రామంలో మంగళవారం మురుగు కాలువలలో పేరుకుపోయిన మురుగును తొలగించారు. ప్రజలు ఇళ్ల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రజలు గ్రామ పరిశుభ్రతకు సహకరించాలని సహకరించాలని కోరారు.

March 3, 2026 / 10:34 AM IST

కామదహనం మంటల్లో పడి ఓ వ్యక్తికి గాయాలు..!

MNCL: తాండూరు మండలం కిష్టంపేటలో విషాదం చోటుచేసుకుంది. సోమవారం రాత్రి కామదహనం చేస్తుండగా ఉరడి మల్లేశ్ ప్రమాదవశాత్తు మంటల్లో పడి తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించారు. బెల్లంపల్లి 108 సిబ్బంది నరేశ్, సంపత్ ఘటనా స్థలికి చేరుకుని బాధితుడికి ప్రథమ చికిత్స అందించి, బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

March 3, 2026 / 10:31 AM IST

సల్పంగా పెరిగిన పత్తి ధర..!

KNR: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం పత్తి ధరలు స్వల్పంగా పెరిగాయి. మార్కెట్‌కు మొత్తం 40 వాహనాల్లో 296 క్వింటాళ్ల విడి పత్తి విక్రయానికి రాగా, గరిష్ఠంగా రూ.7,600 ధర పలికింది. మార్కెట్లో కార్యకలాపాలను మార్కెట్ ఛైర్‌పర్సన్ స్వప్న, ఉన్నత శ్రేణి కార్యదర్శి రాజా పరిశీలించారు. తాజాగా పత్తి ధర రూ.50 పెరగడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.

March 3, 2026 / 10:31 AM IST

కోటాంచ ఆలయ ఛైర్మన్ ను సన్మానించిన.. గ్రామస్తులు

BHPL: రేగొండ మండలం కోడవటంచ గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ చైర్మన్ సంపత్ రావును సోమవారం రాయపల్లి గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆలయ ఛైర్మన్ NSR మాట్లాడుతూ.. దేవుడికి సేవ చేయడం భగవంతుడు ఇచ్చిన అదృష్టమని, ఆలయ పునర్నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నందుకు జన్మ ధన్యమని అన్నారు. కార్యక్రమంలో రాయపల్లి గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

March 3, 2026 / 10:29 AM IST

వీధి కుక్కల దాడిలో పలువురికి గాయాలు

SRCL: వేములవాడ పట్టణంలో వీధి కుక్కలు బీభత్సం సృష్టించాయి. బద్ది పోచమ్మ వీధి, అర్బన్ కాలనీ, సుభాష్ నగర్, ధోబి ఘాట్, కూరగాయల మార్కెట్ ప్రాంతాల్లో సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు కుక్కలు దాడి చేయడంతో 20 మందికిపైగా గాయపడ్డారు. వీరిని స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డ వారిలో స్థానికులతో పాటు, భక్తులు ఉన్నారు.

March 3, 2026 / 10:29 AM IST

వాసవీ ఆలయంలో ఘనంగా గోపూజ

GDWL: వడ్డేపల్లి మున్సిపాలిటీ శాంతినగర్ వాసవీ మాత ఆలయంలో చంద్రగ్రహణం సందర్భంగా గోపూజ నిర్వహించారు. గో ప్రచారక్ సేవా సమితి ఆధ్వర్యంలో గోమాతకు ప్రత్యేక పూజలు చేసి గ్రాసం అందించారు. హైదరాబాద్‌కు చెందిన కృష్ణవేణి పంపిన ‘గోమాత చీర’ను భవాని స్వీకరించారు. కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయంలో భక్తి వాతావరణం నెలకొంది.

March 3, 2026 / 10:29 AM IST

‘విద్యుత్ వ్యవస్థకు నష్టం కలగవద్దు’

ASF: మెరుపు,పిడుగుల వల్ల విద్యుత్ వ్యవస్థకు నష్టం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు ఆసిఫాబాద్ SE ఉత్తమ్ జాడే ప్రకటనలో తెలిపారు. కీలక ప్రాంతాల్లో 80 లైట్నింగ్ అరెస్టర్లు ఏర్పాటు చేశామని చెప్పారు. ఇవి అధిక వోల్టేజ్ ను భూమిలోకి మళ్లించి ట్రాన్స్ ఫార్మర్లు, ఇతర పరికరాలను రక్షిస్తాయని వివరించారు.వినియోగదారులు సర్జ్ ప్రొటెక్టర్లు వినియోగించాలన్నారు.

March 3, 2026 / 10:29 AM IST

‘ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ పథకంలో పని కల్పిస్తాం’

PDPL: గ్రామాల్లో అవసరమైన ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ పథకంలో పని కల్పిస్తామని, మంతిని ఎంపీడీవో శ్రీజా రెడ్డి అన్నారు.మంథని మండలం గుంజపడుగు గ్రామంలో ఎంపీడీవో శ్రీజారెడ్డి, ఏపీఓ సదానందం ఉపాధి హామీ పనులను సోమవారం పరిశీలించారు. ఎండలు తీవ్రమవుతున్న వేళ పని ప్రదేశంలో నీడ సౌకర్యం, మంచినీరు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.

March 3, 2026 / 10:23 AM IST

చర్మవ్యాధితో సంచరిస్తున్నశునకం

WNP: వీధి కుక్కల సంచారం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఇది చాలదన్నట్లు వింతైన చర్మ వ్యాధితో వీధుల్లో తిరగడంతో జనం ఆందోళన చెందుతున్నారు. వనపర్తి పురపాలికల్లో ఎక్కడ చూసినా ఇటువంటి శునకాలే కనిపిస్తున్నాయి. వాటిని అదిలించినా, బెదిరించినా ప్రమాదం బారినపడే అవకాశం ఉందని వాపోతున్నారు. దీంతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే వణుకుతున్నామని ప్రజలు వాపోతున్నారు.

March 3, 2026 / 10:20 AM IST

‘రైతులు అవగాహన పెంచుకోవాలి’

MNCL: జన్నారం మండలంలోని అన్ని గ్రామాల రైతులు యాప్ ల విషయంలో అవగాహన పెంచుకోవాలని జన్నారం మండలంలోని వ్యవసాయ క్లస్టర్ ఏఈఓ అక్రమ్ కోరారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ రైతుల మేలు కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫార్మార్ రిజిస్ట్రీ, యూరియా బుకింగ్ యాప్ లను అమల్లోకి తీసుకువచ్చాయన్నారు. ఆ యాప్లలో రైతులకు మేలు చేసే అంశాలు ఉన్నాయని, వాటి ద్వారా సేవలు పొందవచ్చన్నారు.

March 3, 2026 / 10:19 AM IST

బస్సు సౌకర్యం కల్పించండి సారూ..!

HNK: పరకాల RTC డిపో నుంచి దమనపేట, రాయపల్లి, కనపర్తి, నాగుర్లపల్లి గ్రామాలకు బస్సు సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పనులు, విద్య, వైద్యం కోసం పట్టణ కేంద్రానికి వెళ్లాల్సి వచ్చినా ఆటోలు, లిఫ్ట్‌లు లేదా కాలినడకనే ప్రయాణించాల్సి వస్తోంది. స్థానిక MLA, అధికారులు స్పందించి తక్షణమే ఈ రూట్‌లో బస్సు సేవలు ప్రారంభించాలని కోరారు.

March 3, 2026 / 10:13 AM IST

జడ్చర్ల ఆసుపత్రి ఘటనపై ఎంపీ ఆగ్రహం

MBNR: జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఘటనపై ఎంపీ డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యంపై వెంటనే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా ఇంఛార్జ్ మంత్రిగా వైద్యశాఖ మంత్రి ఉన్న చోటే పరిస్థితి ఇలా ఉంటే ఇతర జిల్లాల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఈ ఘటనతో ప్రభుత్వ చిత్తశుద్ధి బయటపడిందని విమర్శించారు.

March 3, 2026 / 10:13 AM IST

భద్రకాళి ఆలయం మూసివేత

WGL: పట్టణ కేంద్రంలోని భద్రకాళి అమ్మవారి ఆలయం నేడు చంద్రగ్రహణం సందర్భంగా ద్వార బంధనం చేశారు. గ్రహణం ప్రారంభానికి ముందు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు పూర్తి చేసి ఆలయ ద్వారాలను మూసివేశారు. నిత్య పూజలను తాత్కాలికంగా నిలిపివేశారు. గ్రహణం ముగిసిన తర్వాత ఆలయ శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పిస్తామని అధికారులు తెలిపారు.

March 3, 2026 / 10:12 AM IST

గ్రహణం సందర్భంగా ఆలయాల మూసివేత

NRPT: చంద్రగ్రహణం పురస్కరించుకుని మంగళవారం నారాయణపేట పట్టణంలోని ఆలయాలను నిర్వాహకులు మూసివేశారు. గ్రహణం సమయం ముగిసిన అనంతరం ఆలయాలను తెరిచి సంప్రోక్షణ చేసి ప్రత్యేక పూజలు చేయనున్నారు. అశోక్ నగర్ అభయాంజనేయ స్వామి ఆలయాన్ని నిర్వాహకులు మూసివేశారు. సాయంత్రం 7 గంటలకు ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణ చేసి ప్రత్యేక పూజలు చేస్తున్నట్లు ఆలయాల కమిటీ సభ్యులు తెలిపారు.

March 3, 2026 / 10:12 AM IST