VKB: తాండూరు మార్కెట్ కమిటీ ఛైర్మన్గా పట్లోళ్ల నర్సింలు నియామకం అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తాండూరు మార్కెట్ కమిటి ఛైర్మన్గా ఉన్న సాయిపూర్ బాల్ రెడ్డి ఇటీవల తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన స్థానంలో మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలును మార్కెట్ కమిటి ఛైర్మన్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.