KNR: ఇటీవల ములుగు జిల్లా మేడారంలోని ఆడిటోరియం హాల్లో రాష్ట్రస్థాయి కరాటే పోటీలు నిర్వహించారు. ఈ కరాటే పోటీలో హుజురాబాద్ చెందిన మండ సాన్విత గోల్డ్ మెడల్ సాధించినట్లు స్థానిక బీబీఆర్ కరాటే అకాడమీ డైరెక్టర్ భూసారపు బాబురావు, రాజ్ కుమార్ తెలిపారు. కుమతి కట్టా విభాగంలో ఏడుగురు విద్యార్థులు సైతం గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర క్షేత్రంలో శివ కళ్యాణోత్సవాలకు విస్తృత ఏర్పాటు చేయాలని ఆలయ ఈవో రమాదేవి ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం ఆమె సమీక్ష నిర్వహించారు. ఐదు రోజులపాటు నిర్వహించనున్న ఉత్సవాలలో భాగంగా 6వ తేదీ స్వామివారి కళ్యాణం, 8వ తేదీ రథోత్సవం నిర్వహిస్తామని, కళ్యాణోత్సవానికి వేలాది మంది తరలివచ్చే అవకాశం ఉన్నందున విస్తృత ఏర్పాట్లు చేయాలని అన్నారు.
NRML: నిర్మల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ ద్వంద్వ రాజకీయాలను ఎండగడతామని బీజేపీ నేత రావుల రామనాథ్ హెచ్చరించారు. తైబజార్ సమస్యపై అధికార పార్టీ నేతలు డ్రామాలు ఆపాలని డిమాండ్ చేశారు. సొంత ప్రభుత్వమే ఉన్నందున సమస్యను పరిష్కరించాలని, లేదంటే ప్రజల పక్షాన పోరాడుతామని స్పష్టం చేశారు.
PDPL 6కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. భార్య ఐదేళ్లుగా కాపురానికి రాకపోవడంతో మనస్తాపానికి గురైన కందునూరి రాజకుమార్ తన గదిలో సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒంటరితనం కారణంగా మద్యానికి బానిసై ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
MNCL: బెల్లంపల్లి సింగరేణి ఏరియాలో పనిచేస్తున్న లారీ డ్రైవర్, క్లీనర్,హెల్పర్‌లకు పెరిగిన ధరలకనుకూలంగా వేతనాలు పెంచి ఇతర సమస్యలు పరిష్కరించాలని AITUC రీజియన్ ప్రెసిడెంట్ ఉపేందర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం TTC సుదీర్‌కు సమ్మె నోటీస్ అందజేశారు. వారు మాట్లాడుతూ.. సంస్థ అభివృద్ధికి, లాభాలు రావడంలోను ట్రాన్స్ పోర్ట్ కార్మికుల పాత్ర కీలకమన్నారు.
WNP: ఘనపురం మండలం దొంతికుంట తండాలో ఉన్న ఆదర్శ పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతి ప్రవేశానికి సీట్ల భర్తీకి దరఖాస్తు గడవు పొడిగించినట్లు ప్రత్యేక అధికారి ఉమాదేవి తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 10వ తేదీలోగా http://tgms.telangana.gov.in వెబ్ సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నరు.
NZB: వేల్పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించనున్నట్లు డాక్టర్ వీణ తెలిపారు. ఈ అవకాశాన్ని మండల ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఫార్మసిస్ట్ వేణు, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు.
MHBD: నేడు చంద్రగ్రహణం సందర్భంగా కురవి మండల కేంద్రంలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామివారి ఆలయాన్ని అధికారులు మూసివేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి సత్యనారాయణ పర్యవేక్షణలో స్వామివారికి పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ గేట్లకు తాళం వేశారు. ఆలయ అర్చకులు, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.
KMM: కూసుమంచి మండలం లోక్యతండా గ్రామంలో మంగళవారం హోలీ సంబరాలు ప్రారంభం అయ్యాయి. రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది యువకులు, బంజారాలు ఈ కోలాటంలో పాల్గొంటారు. రాష్ట్రంలోనే ఎక్కడ జరగని విధంగా 3 రోజుల పాటు జరిగే హోలీ వేడుకల్లో భాగంగా ఈ రోజు సాయంత్రం కోలాటం కార్యక్రమం ప్రారంభం కానుంది. కుల పెద్దలు డప్పు కొట్టి హోలీని ప్రారంభిస్తారు.
గద్వాల మున్సిపాలిటీలో కొత్తగా బాధ్యతలు స్వీకరించిన మాదిగ కౌన్సిలర్లు శంకర్, చిన్న రాములు, లలితమ్మ, చిన్న చంటేన్నలను గంజిపేట తిమ్మన్న ఘనంగా సన్మానించారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు సేవ చేయాలని ఆయన అభ్యర్థించారు. కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని అభినందనలు తెలిపారు.
JN: కొడవటూరు శ్రీ సిద్దేశ్వర స్వామి దేవాలయం గ్రహణం సందర్భంగా తాత్కాలికంగా మూసివేశారు. ఆలయ అధికారులు ఆగమ శాస్త్రాల ప్రకారం గ్రహణ సమయంలో దేవాలయ ద్వారాలను మూసివేసినట్లు తెలిపారు. గ్రహణం ముగిసిన అనంతరం శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి, ప్రత్యేక పూజలు చేసి భక్తులకు దర్శనం కల్పిస్తామని ఆలయ వర్గాలు వెల్లడించాయి.
MLG: టీచ్ ఫర్ చేంజ్ ట్రస్ట్ ఫౌండర్, సినీనటి మంచు లక్ష్మి మంగళవారం మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిశారు. తమ సంస్థ ఆధ్వర్యంలో మార్చి 27 నిర్వహిస్తున్న కార్యక్రమానికి రావాలని ఆమె మంత్రిని ఆహ్వానించారు. తాను స్థాపించిన ఫౌండేషన్ సేవా కార్యక్రమాలను మంచు లక్ష్మి మంత్రికి వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్య కోసం తమ సంస్థ చేయూతనిస్తున్నదన్నారు.
BDK: చర్ల మండలం గుంపెనగూడెంలో ఇసుక లారీ బీభత్సం సృష్టించినట్లు స్థానికులు మంగళవారం తెలిపారు. చర్ల నుంచి భద్రాచలం వెళ్తున్న లారీ ఢీకొనడంతో చిట్టిబాబు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అతడిని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. నిత్యం ఇసుక లారీల రాకపోకలతో ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
NRPT: చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అయిన హోలీ పండుగ సందర్భంగా జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రంగులు చల్లుకునేటప్పుడు ఇతరులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. మహిళలు పట్ల గౌరవంగా వ్యవహరిస్తూ పండుగను హుందాగా జరుపుకోవాలని తెలిపారు.
BHPL: నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించేందుకు అందరూ కృషి చేయాలని సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి కార్మికులకు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. ఫిబ్రవరి 2026లో 4.26 లక్షల టన్నుల లక్ష్యం ఉండగా 3.45 లక్షల టన్నులు ఉత్పత్తి అయిందని తెలిపారు. మార్చి నెలలో 4.54 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యం ఉందని పేర్కొన్నారు.