• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

హోలీ సంబరాలు జరుపుకున్న విద్యుత్ ఉద్యోగులు

కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంగళవారం హోలీ పర్వదినాన్ని, విద్యుత్ ఉద్యోగులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యుత్ ఉద్యోగులు సాంప్రదాయ బద్ధమైన, పసుపు కుంకుమను చల్లుకొని ఉత్సవాలను నిర్వహించారు. ఈ ఉత్సవాలలో విద్యుత్ ఉద్యోగులు రాజిరెడ్డి, సంపత్ రెడ్డి, జెఏవో మెహర్ బాబా, రత్నాకర్, స్వామి తదితరులు పాల్గొన్నారు

March 3, 2026 / 01:30 PM IST

‘కోదాడను జిల్లా కేంద్రంగా మార్చాలి’

SRPT: కోదాడ నియోజకవర్గంని జిల్లాగా ప్రకటించాలని పట్టణానికి చెందిన బీజేపీ జిల్లా నాయకుడు హనుమంతరావు మంగళవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాలు, మూడు మున్సిపాలిటీలు, 12 మండలాలను కలిపి కోదాడను జిల్లాగా ప్రకటిస్తే విద్యా, వైద్య, వాణిజ్యం, వ్యాపార రంగాలలో మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన తెలియజేశారు.

March 3, 2026 / 01:30 PM IST

హాస్టళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న మహిళా దొంగ అరెస్ట్

NLG: హన్మకొండ పోలీసులు లావుడి సరిత (27) అనే మహిళను అరెస్ట్ చేశారు. నల్గొండ జిల్లాకు చెందిన ఈమె, విలాసవంతమైన జీవితం కోసం 2023 నల్గొండ, హైదరాబాద్, నార్కెట్‌‌పల్లి ప్రాంతాల్లోని హాస్టళ్లలో ఉంటూ, తనను తాను డాక్టర్‌గా పరిచయం చేసుకుని, ఇతర యువతుల మొబైల్ ఫోన్లు, నగదు దొంగిలించేది. అనుమానాస్పద స్థితిలో ఉన్న ఆమెను ఎస్సై అదుపులోకి తీసుకున్నారు.

March 3, 2026 / 01:30 PM IST

‘సీపీఐ జాతీయ సదస్సును జయప్రదం చేయండి’

KMM: మార్చి 5 న ఖమ్మం పట్టణం జూబ్లీ క్లబ్ లో జరిగే సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జాతీయ సదస్సును జయప్రదం చేయాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ భద్రాద్రి ఖమ్మం సంయుక్త జిల్లా కమిటీ కార్యదర్శి కందగట్ల సురేందర్ మంగళవారం పిలుపునిచ్చారు. ప్రపంచ చరిత్రలో విజయవంతమైన మొదటి కార్మిక విప్లవంగా ఈ సదస్సు జరగనుందని వారు తెలిపారు.

March 3, 2026 / 01:29 PM IST

హోలీ వేడుకల్లో పాల్గొన్న మంత్రి

NGKL: కొల్లాపూర్ పట్టణంలో ప్రజలు ఘనంగా హోలీ సంబరాలు జరుపుకున్నారు. మంగళవారం హోలీ పండుగ వేడుకల్లో రాష్ట్ర మంత్రి వర్యులు జూపల్లి కృష్ణారావు గారు పాల్గొని కొల్లాపూర్ ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పట్టణ ప్రజలు మంత్రితో కలిసి ఒకరికొకరు రంగులు పూసుకుని ఆహ్లాదకరమైన సంబరాలు చేసుకున్నారు.

March 3, 2026 / 01:28 PM IST

సహజ రంగులతో హోలీ సంబరాలు

NRML: దిలావర్పూర్ మండలం న్యూ లోలం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మంగళవారం సహజ రంగులతో హోలీ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ శ్రీలత సాయన్న మాట్లాడుతూ రసాయన రంగులతో కాకుండా ప్రతి ఒక్కరు సహజ రంగులతో హోలీ జరుపుకోవాలని సూచించారు .అనంతరం ఒకరి పై ఒకరు రంగులు చల్లుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

March 3, 2026 / 01:28 PM IST

నూతన డీఎస్పీగా బాధ్యతల స్వీకరించిన శ్రీనివాసులు

SRCL: వేములవాడ సబ్ డివిజన్ కార్యాలయంలో నూతన డీఎస్పీగా శ్రీనివాసులు బాధ్యతలు స్వీకరించారు. మంగళవారం ఉదయం కార్యాలయానికి చేరుకున్న ఆయనకు అధికారులు, సిబ్బంది ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ.. ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని,అన్నారు.

March 3, 2026 / 01:26 PM IST

చిన్నారుల హ్యాపీ హోలీ సంబరాలు

SRD: కంగ్టి మండల కేంద్రంలో మంగళవారం గ్రామస్తులు హోలీ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. అయితే గ్రామంలో చిన్నారులు రంగులు చల్లుకుంటూ సంబరాల్లో మునిగారు. హ్యాపీ హోలీ అంటూ వీధుల్లో సందడి చేస్తున్నారు. ఏ వీధుల్లో చూసిన చిన్నపిల్లలు కేరింతలు కొడుతూ రంగుల పండుగను హ్యాపీగా జరుపుకుంటున్నారు. రంగుల ఆటలో పిల్లల ఆనందోత్సవాన్ని చూసి పెద్దలు మురిసిపోతున్నారు.

March 3, 2026 / 01:26 PM IST

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి

WNP: శ్రీశైలం ప్రాజెక్టు నిర్వాసిత నిరుద్యోగి కురుమన్న మృతి పట్ల మంగళవారం మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఆయన, కురుమన్న మరణం తీరని లోటని పేర్కొన్నారు. ఆ కుటుంబానికి ఎల్లవేళలా ఆర్థికంగా, సామాజికంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

March 3, 2026 / 01:26 PM IST

పోగొట్టుకున్న ఫోన్లు అప్పగింత..!

PDPL: మంథనిలో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ను పోలీసులు సీఈఐఆర్ (CEIR) పోర్టల్ సాయంతో గుర్తించి బాధితులకు అప్పగించారు. నెల రోజుల క్రితం ఫోన్ పోవడంతో బాధితుడు ఆన్లైన్లో దరఖాస్తు చేయగా, సాంకేతిక ఆధారాలతో ఆచూకీ కనుగొన్న పోలీసులు ఫోన్ను స్వాధీనం చేసుకొన్నారు.ఫోన్ పోగొట్టుకున్నవారు సీఈఐఆర్ నమోదు చేసి రసీదులు స్టేషన్లో సమర్పించాలన్నారు.

March 3, 2026 / 01:25 PM IST

కుమారుడు మందలించాడని తండ్రి ఆత్మహత్య

ADB: నార్నూర్ మండలం గుండాలలో విషాదం చోటుచేసుకుంది. మద్యం సేవించవద్దని కుమారుడు మందలించినందుకు మనస్థాపానికి గురైన జంగు(41) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మద్యం విషయంపై కుమారుడు మందలించడంతో జంగు పురుగుల మందు తాగినట్లు తెలిపారు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు.

March 3, 2026 / 01:24 PM IST

గూడెం గుట్ట దేవాలయం మూసివేత..!

MNCL: దండేపల్లి మండలంలోని గూడెంగుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవాలయాన్ని అధికారులు మూసివేశారు. చంద్రగ్రహణం కావడంతో మంగళవారం ఉదయాన్నే వేద పండితులు దేవాలయంలోని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవాలయానికి వేద పండితులు, అధికారులు తాళం వేసి మూసి వేశారు. బుధవారం తెల్లవారుజామున దేవాలయంలో సంప్రోక్షణ పూజలు చేసి భక్తులను అనుమతించనున్నారు.

March 3, 2026 / 01:21 PM IST

ఎస్పీని కలిసిన వేములవాడ డీఎస్పీ

SRCL: వేములవాడ నూతన డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసులు జిల్లా ఎస్పీ మహేష్ బి గితేను మర్యాదపూర్వకంగా కలిసారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీని కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. సబ్ డివిజన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఆయనకు సూచించారు.

March 3, 2026 / 01:19 PM IST

ఎమ్మెల్యే గాంధీపై BRS నేతల ధ్వజం!

RR: మియాపూర్‌లో ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ BRS శ్రేణులు సుభాష్ చంద్రబోస్ నగర్ నుంచి పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. MLA స్వలాభం కోసం కాంగ్రెస్‌లో చేరి ప్రజా సమస్యలను గాలికొదిలేశారని, భూకబ్జాలకు పాల్పడుతున్న బినామీలకు అండగా ఉంటున్నారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని వారు హెచ్చరించారు.

March 3, 2026 / 01:11 PM IST

ధన్వాడ విద్యార్థి రాష్ట్రస్థాయి విజయాలు

NRPT: సమగ్ర శిక్షా తెలంగాణ ఆధ్వర్యంలో దోమలగూడలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ధన్వాడ జడ్పీహెచ్ఎస్ విద్యార్థి ఆంజనేయులు అద్భుత ప్రతిభ చూపించారు. 33 జిల్లాల విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీల్లో సత్తా చాటిన ఆంజనేయును హెచ్ఎం ప్రదీప్ కుమార్, స్పెషల్ ఎడ్యుకేటర్ రాకేశ్ శెట్టి, ఉపాధ్యాయ బృందం అభినందించారు.

March 3, 2026 / 01:08 PM IST