HYD: జలమండలిలో కాగిత రహిత పరిపాలనకు శ్రీకారం చుట్టారు. మంగళవారం బోర్డు ప్రధాన కార్యాలయంలో ఎండీ అశోక్ రెడ్డి ‘ఈ-ఆఫీస్’ వ్యవస్థను ప్రారంభించారు. ఫైళ్ల కదలికలో పారదర్శకత, వేగవంతమైన సేవల కోసమే ఈ డిజిటల్ విధానమని ఆయన తెలిపారు. రియల్‌టైమ్ ట్రాకింగ్ ద్వారా పనుల పురోగతిని పర్యవేక్షించవచ్చన్నారు.