మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో హోలీ పండుగ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. యువజ్యోతి ఫుట్బాల్ ఆధ్వర్యంలో స్థానిక హాస్టల్ విద్యార్థులు రంగుల పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ, శుభాకాంక్షలు తెలుపుకుంటూ సందడి చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యువజ్యోతి ఫుట్బాల్ కోఆర్డినేటర్ బొంతల సత్యనారాయణ పాల్గొన్నారు.