MLG: వెంకటాపూర్ మండలంలోని రామానుజాపూర్ గ్రామ పంచాయతీకి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ నేటి వరకు కాంగ్రెస్ మద్దతుదారులే సర్పంచ్‌గా గెలుస్తున్నారు. ప్రత్యర్థి పార్టీల నుంచి ఎక్కువ మంది పోటీలో ఉన్నప్పటికీ, ఓ సామాజిక వర్గం కీలక పాత్ర పోషిస్తుందని స్థానికులు చెబుతున్నారు. కాగా ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థుల మధ్య పోటీ నువ్వా-నేనా అన్నట్లు సాగుతుందని అంటున్నారు.
JGL: రాయికల్ మండలం ఒడ్డెలింగాపూర్లో బతుకమ్మ వేడుకల వేళ ఊహించని ఘటన చోటుచేసుకుంది. కొందరు వ్యక్తులు కత్తులతో దాడి చేసుకున్న ఘటనలో బోదాసు సతీష్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని స్థానికులు జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. దాడి వెనుక కారణాలు తెలియాల్సి ఉంది.
JGL: ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలై, ఎన్నికల ఆచరణ నియమావళి అమలులో ఉన్నందున ప్రజల వినతులను స్వీకరించే ఈ కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు చెప్పారు.
మహబూబాబాద్ MP పోరిక బలరాం నాయక్ ఈరోజు కురివి వీరభద్ర స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు ఎంపీ తెలిపారు.
NLG: స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున ప్రతి సోమవారం నిర్వహించే ‘పోలీస్ గ్రీవెన్స్ డే’ కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు జిల్లా SP శరత్ చంద్ర తెలిపారు. ZPTC, MPTC, GP ఎన్నికల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం యధావిధిగా ‘గ్రీవెన్స్ డే’ కార్యక్రమం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
HYD: జూబ్లీహిల్స్‌లో స్టాప్ సబ్జెన్స్ అబ్యూస్ 3కే రన్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ జెండా ఊపి ప్రారంభించారు. మాదకద్రవ్యాల వినియోగం యువత ప్రతిభను, భవిష్యత్తును నాశనం చేస్తుందని ఆయన హెచ్చరించారు. అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ‘అనాస్టమోజ్ 2025’ ఉత్సవంలో భాగంగా ఈ రన్ జరిగింది. ఈ వేడుకలు అక్టోబర్ 5 నుంచి 11 వరకు జరుగనున్నాయి.
KMR: గత వారం పదిహేను రోజులు కాస్త ఊరటనిచ్చిన వాతావరణం, మళ్ళీ ఒక్కసారిగా మారిపోయింది. నేటి ఉదయం నుంచి జిల్లాలో వర్షం దంచి పడుతుండటంతో అన్నదాతల ఆశలు నేలపాలయ్యాయి. ముఖ్యంగా మొక్కజొన్న, పత్తి, పంట చేతికొచ్చే దశలో ఉండగా, అకాల వర్షానికి పొలాల్లోకి మళ్ళీ నీరు చేరుతుండడంతో పంటలన్నీ వర్షార్పణం అయ్యింది.
MHBD: గూడూరు మండలం ఏపూర్ గ్రామంలో ఆదివారం ముగ్గురు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) లబ్ధిదారులకు కాంగ్రెస్ నాయకులు రూ.1.16 లక్షల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. సీఎంఆర్‌ఎఫ్ పథకం నిరుపేదలకు వరమని, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
WGL: 9 రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం పున ప్రారంభం కానుంది. గత నెల 27 నుంచి ఈనెల 5 వరకు బతుకమ్మ, దసరా వేడుకలు, వారాంతపు సెలవులు కావడంతో మార్కెట్ బంద్ ఉంది. దీంతో రేపు ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరుకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు.
BDK: మణుగూరు పోలీస్ స్టేషన్ పరిధి ప్రధాన చౌరస్తా బండారిగూడెంలో ట్రాఫిక్ ను నియంత్రించటానికి ఏర్పాటు చేసిన పోస్టులు నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయని ఆదివారం స్థానికులు తెలిపారు. సురక్ష బస్టాండ్ మొదలు పాత పోలీస్ స్టేషన్ వరకు ఏర్పాటుచేసిన మినీ కంట్రోల్ రూములు గడిచిన దశాబ్ద కాలం నుంచి వాటి ఆలనాపాలనా లేకుండా సీసీ కెమెరాల నిఘా సైతం నిరుపయోగంగా ఉందన్నారు.
RR: మన్సురాబాద్ పెద్ద చెరువు పరిసర ప్రాంతాల్లో తలెత్తిన సమస్యలను కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. GHMC, ఇరిగేషన్, హైడ్రా, HMWSSB శాఖల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల చెరువు పరిసర ప్రాంత ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. నిలిచిపోయిన బాక్స్ నాలా పనులు వెంటనే ప్రారంభించాలన్నారు.
RR: కేశంపేటలో మొక్కజొన్న పంటను కోసి రోడ్లపై ఆరబోసిన ధాన్యం అకాల వర్షానికి తడిసి ముద్దయింది. ఆదివారం ఉదయం కురిసిన భారీ వర్షానికి రైతులు కల్లాల్లో ఆరబెట్టుకున్న మొక్కజొన్న ఒక్కసారిగా కొట్టుకుపోయిందని రైతులు వాపోతున్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంతో పాటు నష్టపరిహారం చెల్లించాలని అధికారులను రైతుల కోరుతున్నారు.
SDPT: హుస్నాబాద్ మండలం వంగరామయ్యపల్లి పూల్ నాయక్ తండాకు చెందిన లావుడ్య శ్రీకాంత్ నాయక్ తండా స్థాయి నుంచి డీఎస్పీ స్థాయికి ఎదిగి గిరిజన ఆణిముత్యంగా నిలిచారు. ట్రిపుల్ ఐటీలో విద్యనభ్యసించి, ఎస్సైగా పనిచేసి, గ్రూప్-1లో ఎంపికై డీఎస్పీగా నియామక పత్రం అందుకున్నారు. స్వగ్రామంలో గిరిజన నేతలు ఘనంగా స్వాగతం పలికారు.
ASF: ఆసిఫాబాద్ మండలంలో ఎవరైనా గంజాయి అమ్మినా, విక్రయించినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని CI బాలాజీ వరప్రసాద్ ఆదివారం ఒక ప్రకటన లో కోరారు. సాగు చేసినా, అమ్మకాలు జరిపినా 87125 89660 నంబరుకు తెలపాలని సూచించారు. సమాచారం అందించినవారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, వారికి పారితోషకం అందిస్తామని సీఐ హామీ ఇచ్చారు.
RR: ఫోన్‌లో మాట్లాడుతూ ఆర్టీసీ బస్సు డ్రైవింగ్ చేసిన డ్రైవర్ వినోద్‌పై ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకున్నారు. శనివారం HIT TVలో వచ్చిన కథనానికి స్పందించిన డీఎం ఉష విధుల నుంచి తొలగించారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ఫోన్‌లో మాట్లాడుతూ ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేసిన డ్రైవర్‌పై ‘ఇక మాట్లాడుకో నాయనా తీరిగ్గా’ అంటూ ప్రజలు కామెంట్ చేస్తున్నారు.