MDK: కొల్చారం మండలం పైతర గ్రామంలో సోమవారం శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరగనుంది. శ్రీ శ్రీ మాధవ నంద సరస్వతి స్వామి ఆధ్వర్యంలో నిర్వహించే ఈ వేడుకలో ధ్వజస్తంభ ప్రతిష్ట, లక్ష పుష్పార్చన, పాలాభిషేకం వంటి విశేష పూజలు నిర్వహించనున్నారు. భక్తులు కుటుంబ సమేతంగా హాజరై స్వామివారిని దర్శించుకోవాలని సర్పంచ్ల అధ్యక్షుడు రవితేజ కోరారు .