కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో పదవీ విరమణ పొందిన ఎస్సైలు ఎం.ప్రకాష్, ఎం.రాజయ్య, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ ఎం.నారాయణలకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో అధికారులు వారికి శాలువాలు కప్పి సత్కరించారు. అదనపు ఎస్పీ కె.నరసింహ రెడ్డి మాట్లాడుతూ.. 40 ఏళ్లకు పైగా సేవలందించినందుకు అభినందనలు తెలిపారు.
BDK: మణుగూరు లంక మల్లారం TGTWURJC లో వైద్యులు ఇవాళ హెల్త్ క్యాంప్ నిర్వహించారు. అనంతరం పిల్లలకు వేసవి కాలంలో డీహైడ్రేషన్‌కు లోనూ కాకుండా నీరు ఎక్కువగా తీసుకోవడం, చల్లని ప్రదేశంలో ఉండడం, మధ్యాహ్నం పూట ఎండకు బయటకు వెళ్లొద్దని డా.సునీల్ సూచించారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.
ఆసిఫాబాద్ పట్టణం బజార్ వాడీలో నిర్వహించిన SIR మ్యాపింగ్ కార్యక్రమానికి మంగళవారం మున్సిపల్ వైస్ ఛైర్మన్ అహ్మద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మ్యాపింగ్ ప్రక్రియను దగ్గరుండి పరిశీలించిన ఆయన, సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం చేపట్టిన ఈ మ్యాపింగ్ ప్రక్రియ పౌరులందరికీ ఎంతో కీలకమని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ వివరాలను నమోదు చేయించుకోవాలన్నారు.
సూర్యాపేట పట్టణంలో అసంపూర్తిగా ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను వెంటనే పూర్తి చేయాలని సీపీఐ (ఎం-ఎల్) మాస్ లైన్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం మున్సిపల్ కమిషనర్ హనుమంత్ రెడ్డికు వినతిపత్రం అందజేశారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల రోడ్లు అధ్వానంగా మారి ప్రజలు అనారోగ్యం, ప్రమాదాల బారిన పడుతున్నారని అన్నారు.
NRML: భారీ వర్షానికి పంట నష్టపోయిన జిల్లా రైతులను తక్షణమే నష్టపరిహారం చెల్లించి ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బుఖ్య రమేష్ డిమాండ్ చేశారు. కడెంలో వారు మాట్లాడుతూ.. గత రాత్రి కురిసిన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి మామిడి పంట, నువ్వుల పంట, ఆరబెట్టిన పసుపు కొమ్ములు, మొక్కజొన్న, వరి తదితర పంటలు నేలమట్టమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
NGKL: చారకొండ మండలం ఎర్రవల్లి, ఎర్రవల్లితండా వాసులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారం 120వ రోజుకు చేరుకున్నాయి. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ప్రాథమిక నోటిఫికేషన్‌ను వెంటనే రద్దు చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. రిజర్వాయర్ సామర్థ్యం తగ్గించి తమ ఊర్లకు ముంపు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.
PDPL: పత్తిపాక జడ్పీ హైస్కూల్ HM నరేందర్ రావు విద్యాభివృద్ధికి చేసిన సేవలు అమోఘం అని ధర్మారం ఎంఈవో ప్రభాకర్ కొనియాడారు. ఇవాళ MRCలో నరేందర్ రావు పదవీ విరమణ కార్యక్రమంలో ఆయన పాల్గొని సన్మానించారు. పాఠశాలలో మౌలిక వసతుల కల్పనతో పాటు విద్యార్థుల గుణాత్మక అభివృద్ధికి పాటు పడ్డారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు పాఠశాలల హెచ్ఎంలు పాల్గొన్నారు.
NGKL: కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. మంగళవారం జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీ పటిష్టతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గోలి శ్రీనివాస్ రెడ్డి, ఉప్పల వెంకటేశ్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
NGKL: జిల్లాకు చెందిన మాజీ మంత్రి పోతుగంటి రాములుకు బీజేపీలో కీలక బాధ్యతలు దక్కాయి. ఆయనను బీజేపీ రాష్ట్ర కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమిస్తూ అధిష్ఠానం ఉత్తర్వులు జారీ చేసింది. రాములు సుదీర్ఘ రాజకీయ అనుభవం తెలంగాణలో పార్టీ బలోపేతానికి, ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పార్టీ ఎదుగుదలకు ఎంతగానో దోహదపడుతుందని అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుంది.
WGL: BJP రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా వరంగల్‌కు చెందిన సిద్ధం నరేష్ పటేల్ నియమాకమయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షలు రాంచందర్ రావు నరేష్‌కు నియమాక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ.. తన నియమాకానికి సహకరించిన వరంగల్ తూర్పు నియోజకవర్గ BJP పార్టీ ఇంఛార్జ్ ఎర్రబెల్లి ప్రదీప్ రావుకు కృతఙ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.
KNR: ల్యాగలమర్రి గ్రామంలో సర్పంచి రవి అధ్యక్షతన పౌర హక్కుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కులమత, లింగ వివక్ష లేని సమాజ నిర్మాణం కోసం ప్రతి పౌరుడు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ, సమాన అవకాశాలను అందరికీ అందించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.
NGKL: వెల్దండ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 99 రోజుల ప్రణాళికలో భాగంగా విద్యార్థులకు ప్రత్యేక ఆరోగ్య శిబిరం నిర్వహించారు. డాక్టర్లు సింధు, రమణకుమార్, కవిత విద్యార్థులకు రక్తహీనత, హిమోగ్లోబిన్ పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అనంతరం వ్యక్తిగత పరిశుభ్రత, పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు.
SRD: పటాన్‌చెరువు మండలం నందిగామలో ఏప్రిల్ 2న నిర్వహించనున్న చండీయాగానికి రావాలని జిల్లా ఇంఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామిని పటాన్‌చెరువు కాంగ్రెస్ ఇంఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ఆహ్వానించారు. మంత్రిని తన నివాసంలో కలిసిన శ్రీనివాస్ గౌడ్, కుటుంబ సమేతంగా ఈ యాగంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమానికి భారీగా భక్తులు తరలిరావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
JN: రఘునాథపల్లి మండలంలోని వీరారెడ్డితండాలో దుర్గమ్మ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకలకు జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రాంబాబు, జిల్లా ఉపాధ్యక్షులు జగదీష్ చంద్ర రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు రవి గౌడ్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుర్గమ్మ ఆశీస్సులతో రఘునాథపల్లి మండలం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని వారు ఆకాంక్షించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా మహాలక్ష్మి పథకం విజయోత్సవ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ పథకం ద్వారా పేద మహిళకు లబ్ధి చేకురిదన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ తాంగళ్ళపల్లి శ్రీవాణి రవి కుమార్, మున్సిపల్ వైస్ ఛైర్మన్ మంజుల వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంధాలయం ఛైర్మన్ అవైస్ చిస్తీ, వార్డ్ కౌన్సిలర్ మహిళలు పాల్గొన్నారు.