• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

సజావుగా జరుగుతున్న పదవ తరగతి పరీక్షలు

 MNCL: జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. గురువారం జరిగిన భౌతిక రసాయన శాస్త్రం పరీక్షకు మొత్తం 9,735 మంది విద్యార్థులకు గాను 9,704 మంది హాజరు కాగా, 31 మంది గైర్హాజరయ్యారు. వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 9,703 మందికి 9,680 మంది (23 మంది గైర్హాజరు), గతంలో తప్పిన వారు 32 మందికి 24 మంది (8 మంది గైర్హాజరు) హాజరైనట్లు అధికారులు వెల్లడించారు.

April 2, 2026 / 02:11 PM IST

ప్రశాంతంగా పరీక్షలు కొనసాగుతున్నాయి: డీఈవో

MLG: జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థ రెడ్డి తెలిపారు. వెంకటాపురం మండలం చిరుతపల్లి పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించారు. విద్యార్థులంతా హాజరై పరీక్షలు రాస్తున్నారని చెప్పారు. తదుపరి పరీక్షలకు సిద్ధంగా ఉండాలని సూచించారు.

April 2, 2026 / 02:11 PM IST

ప్రతి పేద కుటుంబాలకు సంక్షేమ పథకాలు: MRO

ADB: ప్రతి ఒక్క పేద కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ జాడి రాజలింగు అన్నారు. గురువారం నార్నూర్ మండలంలోని మహాగావ్ గ్రామంలో సర్పంచ్ మెస్రం భీంబాయి మాణికరావు ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామసభకు హాజరయ్యారు. సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందుగానే మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు.

April 2, 2026 / 02:10 PM IST

హనుమాన్ ఆలయానికి విరాళం అందజేత

NRML: బాసర సమీపంలోని రేణుకపూర్ దక్షిణముఖి హనుమాన్ ఆలయ అభివృద్ధి కోసం ఆలయ కమిటీ అధ్యక్షుడు సంజీవరావు దేశ్ముఖ్ గురువారం రూ. 2 లక్షల విరాళాన్ని అందజేశారు. హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని, ఈ విరాళానికి సంబంధించిన చెక్కును ఆలయ కమిటీ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ గురుస్వామికి అందజేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

April 2, 2026 / 02:10 PM IST

26వ వార్డులో ‘ప్రజా పాలన’ సభ

KNR: వేములవాడ మున్సిపల్ పరిధిలోని 26వ వార్డులో గురువారం ‘ప్రజా పాలన – 99 రోజుల యాక్షన్ ప్లాన్’ వార్డు సభ నిర్వహించారు. కౌన్సిలర్ మామిండ్ల అమర్శ లక్ష్మీరాజ్యం, నోడల్ అధికారి ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఇందిరమ్మ కమిటీ సభ్యులు పాల్గొని స్థానిక సమస్యలపై చర్చించారు.

April 2, 2026 / 02:10 PM IST

ఆలయ నిర్మాణానికి ముస్లిం వ్యక్తి విరాళం

KNR: ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో నిర్మిస్తున్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సాహెబ్ రూ.5,016 విరాళం అందజేసి మతసామరస్యాన్ని చాటారు. గురువారం గ్రామ పంచాయతీలో సర్పంచ్ గీతాంజలి, పాలకవర్గానికి ఈ మొత్తాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అతన్ని వారు అభినందించారు.

April 2, 2026 / 02:10 PM IST

హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్న MLA

ASF: హనుమాన్ జయంతి పర్వదినం పురస్కరించుకుని ఆసిఫాబాద్ మండలం కేస్లాపూర్, TR నగర్, బజార్ వాడి ప్రాంతాల్లో ఉన్న పలు హనుమాన్ దేవాలయాలను MLA కోవ లక్ష్మి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గోని భక్తులకు వడ్డించారు.

April 2, 2026 / 02:07 PM IST

సంగమేశ్వర్ ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు

KMR: దోమకొండ మండలం సంగమేశ్వర్ గ్రామంలో గల ఆంజనేయ స్వామి ఆలయంలో గురువారం భక్తులు పూజలు చేశారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఆంజనేయస్వామికి చంద్రం పెట్టి తమలపాకులతో అలంకరణ చేశారు. అనంతరం ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు తీర్చుకున్నారు.

April 2, 2026 / 02:02 PM IST

ఆర్గానిక్ పంటలపై విద్యార్థులకు అవగాహన

NZB: భీమగల్ మండలం జాగిర్యాల్ గ్రామంలో సర్పంచ్ గడాల ప్రసాద్ ఆధ్వర్యంలో జాతీయ ఉత్తమ ఆర్గానిక్ రైతు చిన్ని కృష్ణయ్యతో గ్రామంలో ఉన్న రైతులకు, విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆర్గానిక్ పంటల వల్ల లాభాలు, వాటి వల్ల కలిగే ప్రయోజనాలు, అలాగే ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాల గురించి కొన్ని ప్రయోగాల ద్వారా రైతులకు, విద్యార్థులకు సమాచారాన్ని అందించారు.

April 2, 2026 / 02:02 PM IST

ఎమ్మెల్యే చేతుల మీదుగా ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం

NLG: ఉచ్చరాలతండాలో ప్రభుత్వం మంజూరు చేసిన నూతన ఇందిరమ్మ ఇంటిని ఎమ్మెల్యే బాలునాయక్ ప్రారంభించారు. లబ్ధిదారుల గృహప్రవేశ వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి కుటుంబాలకు సొంత ఇల్లు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ పథకం ద్వారా లబ్ధిదారుల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

April 2, 2026 / 02:01 PM IST

కాట్రియాలలో ఉత్సాహంగా గ్రామసభ

MDK: రామాయంపేటలోని కాట్రియాలలో ’99 రోజుల ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ గ్రామసభ గురువారం సర్పంచ్ కొత్త స్రవంతి రాజేందర్ గుప్తా అధ్యక్షతన ఉత్సాహంగా జరిగింది. తొలుత ముఖ్యమంత్రి సందేశాన్ని కార్యదర్శి ధనలక్ష్మి చదివి వినిపించారు. ఈ సందర్భంగా ఆరు గ్యారంటీ పథకాల అమలు తీరుపై అధికారులు సమీక్షించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

April 2, 2026 / 01:49 PM IST

వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు

NGKL: లింగాల మండలం రాయవరం గ్రామంలో హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం ఆలయాల్లో అర్చకులు ప్రత్యేక పూజలు, ఆకు పూజలు, యజ్ఞాలు చేశారు. గ్రామంలో పబ్బతి ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు తెల్లవారుజాము నుంచి స్వామి వారిని దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

April 2, 2026 / 01:46 PM IST

భీమారంలో ప్రజా పాలన గ్రామ సభ

HNK: భీమారంలో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా వార్డు సభను ఏర్పాటు చేశారు. వార్డు సభకు స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. ప్రగతి ప్రణాళికలో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రజా ప్రతినిధులు సూచించారు. అనంతరం ప్రజల వద్ద నుంచి పలు వినతులను స్వీకరించారు.

April 2, 2026 / 01:45 PM IST

చలివేంద్రాన్ని ప్రారంభించిన తహసీల్దార్

NZB: సిరికొండ మండలం పెద్ద వాల్గోట్ గ్రామంలో గురువారం సిరికొండ తహసీల్దార్ రవీందర్‌రావు చలివేంద్రాన్ని ప్రారంభించారు. తహసీల్దార్ మాట్లాడుతూ.. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రయాణికులు, గ్రామ ప్రజల కోసం ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వనిత నర్సింగ్, ఉప సర్పంచ్ రాము, గ్రామ శాఖ నర్సారెడ్డి, కిసాన్ కేత్ నర్సారెడ్డి ఉన్నారు.

April 2, 2026 / 01:43 PM IST

ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత

VKB: ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంత లభిస్తుంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య వైద్యుడు కిరణ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. శ్రీపాంబండ రామలింగేశ్వర స్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పని ఒత్తిడిలో ఉన్న వ్యక్తులకు దైవచింతనతో మానసిక ప్రశాంత లభిస్తుందన్నారు. రామలింగేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన డాక్టర్‌కు ఆలయ కమిటీ సభ్యులు సన్మానం చేశారు.

April 2, 2026 / 01:39 PM IST