MHBD: డోర్నకల్ పట్టణంలోని 10వ వార్డులో ఓపెన్ సైడ్ డ్రైనేజీ పనుల సమయంలో తాగునీటి పైప్‌లైన్ దెబ్బతిని లీకేజీ సమస్య ఏర్పడింది. మున్సిపల్ సిబ్బంది పలుమార్లు మరమ్మతులు చేసినప్పటికీ సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదు. గురువారం కౌన్సిలర్ మల్లం అనిల్ వెంటనే స్పందించి కాంట్రాక్టర్ దృష్టికి తీసుకెళ్లి, నీటి కాలుష్యం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
MDCL: బోడుప్పల్ సర్కిల్లో 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను వసూళ్లలో భాగంగా ముగింపు రోజుకి రూ.86 లక్షలు వసూలయ్యాయి. మొత్తం ఆర్థిక సంవత్సరంలో రూ.45 కోట్లు వసూళ్లు నమోదయ్యాయి. మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ 14 సర్కిళ్లలో బోడుప్పల్ సర్కిల్ అత్యధిక వసూళ్లతో ముందంజలో ఉంది. 2026-27కు చెక్కులు కమిషనర్, ఎంఎంసీ పేరిట చెల్లించాలన్నారు.
VKB: కుల్కచర్లలో వెలిసిన కాళికాదేవి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అమ్మవారి ఊరేగింపు వైభవంగా జరిగింది. నిన్న రాత్రి ఆలయంలో అఖండ భజన నిర్వహించారు. దైవచింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని హైందవ ఉత్సవ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
HYD: సౌదీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రాంనగర్‌కు చెందిన నజీరుద్దీన్ ఫ్యామిలీలో 18 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఆ ఇంట్లో సిరాజుద్దీన్ ఒక్కడే మిగిలాడు. ఫ్యామిలీని మొత్తం కోల్పోయిన అతడు ప్రస్తుతం అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. ఎక్స్‌గ్రేషియా కింద చెక్కు మంజూరై నెలలు గడుస్తోన్న బాధితుడికి అందడం లేదని స్థానిక నాయకుడు అస్లాం RTI ద్వారా ఫిర్యాదు చేశాడు.
మహబూబ్ నగర్: ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పారా క్వాట్ కలుపు మందును రాష్ట్రంలో పూర్తిగా నిషేధించినట్లు జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్ తెలిపారు. జీ.ఓ. నం.24 ప్రకారం ఏప్రిల్ 1 నుంచి నిల్వ, విక్రయం, రవాణా, వినియోగం చట్టవిరుద్ధమన్నారు. ఇది ప్రమాదకర రసాయనం కావడంతో ప్రాణాపాయం, క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదం ఉందని హెచ్చరించారు.
BDK: ఆళ్లపల్లి మండలం నాగినేనిప్రోలు అంగన్వాడీ వద్ద సెలవర్ నిర్మాణాన్ని నిరసిస్తూ గ్రామస్థులు చేపట్టిన ఆందోళనపై జిల్లా యంత్రాంగం స్పందించి బుధవారం DRDO విద్యాలత నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. అలాగే విచారణ చేపట్టారు. చిన్నారుల ఆరోగ్యం దృష్ట్యా నివాస ప్రాంతాలు, అంగన్వాడీలకు దగ్గరగా టవర్ వద్దని ఇప్పటికే CDPO అభ్యంతరం వ్యక్తం చేశారు.
WGL: నల్లబెల్లి మండలంలోని 29 గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో నేడు నిర్వహించనున్న గ్రామ సభలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు MPDO శ్రీనివాసరావు తెలిపారు. గ్రామ సభల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, గ్రామ అభివృద్ధి పనులపై సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు చర్చించేందుకు అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు.
KNR: జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో ఆర్పీలు అవినీతికి పాల్పడితే సహించబోమని ఛైర్మెన్ మొలుగు ప్రశాంత్ కుమార్, కమిషనర్ మహమ్మద్ అయాజ్ హెచ్చరించారు. బుధవారం జరిగిన సమావేశంలో SHG రుణాల విషయంలో పారదర్శకత పాటించాలని సూచించారు. ఎవరైనా లోన్స్ ఇప్పించే క్రమంలో కమీషన్ డబ్బులు డిమాండ్ చేస్తే సహించేది లేదన్నారు. ఎవరైనా అవినీతికి పాల్పడితే ఫిర్యాదు చేయాలన్నారు.
KMM: కామేపల్లి మండలంలోని 24 గ్రామ పంచాయతీల్లో నేడు ఉదయం 10 గంటలకు ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో జి.రవీందర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ సభల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రజలు, ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.
SRPT: అనంతగిరి మండలం పాత గోల్ తండా గ్రామ పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణం పిచ్చి మొక్కలతో నిండిపోయింది. గత ప్రభుత్వం గ్రామీణ క్రీడాకారుల కోసం ప్రాంగణాలను ఏర్పాటు చేసినప్పటికీ, ప్రస్తుతం వాటిని ఎవరూ పట్టించుకోవడం లేదు. అధికారులు తక్షణమే స్పందించి, క్రీడా ప్రాంగణాన్ని శుభ్రం చేయించాలని స్థానికులు కోరుతున్నారు.
BHNG: భువనగిరి పట్టణంలోని హన్మాపురంలో యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్‌ను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు నిన్న ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక ఏబిసి సెంటర్లోని ఉన్నటువంటి సౌకర్యాలను పరిశీలించి, జిల్లాలోని 5 పురపాలక సంఘాలకు సంబంధించిన వీధి కుక్కలకు ఇక్కడే స్టేరిలైజేషన్, వ్యాక్సినేషన్ చేయుటకు తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు.
NRML: జిల్లా అభివృద్ధిపై ఎమ్మెల్యేలు పవార్ రామారావు పటేల్, పాయల్ శంకర్, ఎంపీ నగేశ్ ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. బాసర నుంచి భైంసా వరకు జాతీయ రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించాలని, గోదావరి వంతెనపై రక్షణ కంచె ఏర్పాటు చేయాలని కోరారు. బాసర – మహూర్ రహదారి పనులు ప్రధాని పరిశీలనలో ఉన్నాయని, త్వరలోనే నిధులు మంజూరు చేస్తామని మంత్రి స్పందించారు.
MNCL: జన్నారం మండలంలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం లక్ష్యానికి చాలా దూరంలో ఉంది. మండలంలోని వివిధ గ్రామాలలో ఉన్న నిరుపేదలకు ప్రభుత్వం 757 ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేయగా, 20 మాత్రమే పూర్తయ్యాయి. మిగిలినవి వివిధ దశలలో ఉన్నాయని అధికారులు వెల్లడించారు. అభయారణ్యం కావడంతో ఇసుక సరఫరాను నిలిపివేయడం, తదితర కారణాలతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ముందుకు సాగడం లేదు.
WGL: ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా వర్ధన్నపేట మండలం కొత్తపల్లి గ్రామంలో గురువారం ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న గ్రామ సభలో మంత్రి కొండా సురేఖ, MLA KR నాగరాజు పాల్గొననున్నారు. మండల పరిధిలోని కాంగ్రెస్ నాయకులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో హాజరై గ్రామసభలు విజయవంతం చేయాలని MLA క్యాంప్ కార్యాలయం కోరింది
SRPT: కోదాడకు చెందిన సూక్ష్మ కళాకారుడు నరేష్ చారి తన ప్రతిభతో మరోసారి ఆకట్టుకున్నారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని అంగుళం సుద్ద ముక్క, పెన్సిల్ మొనపై హనుమంతుడి ప్రతిమను అద్భుతంగా చెక్కారు. ఇప్పటికే వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ చోటు దక్కించుకున్న నరేష్ చారి సృజనాత్మకతను చూసి స్థానికులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.