• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ వద్ద భారీ పోలీసు బందోబస్తు

SDPT: సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో నర్మెట పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫ్యాక్టరీకి వెళ్లే దారుల్లో 3 చెక్ పోస్టులను ఏర్పాటు చేసి, వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. కేవలం పాస్‌లు ఉన్న వారిని మాత్రమే స్టాళ్ల వద్దకు అనుమతిస్తున్నారు. సభకు వచ్చే రైతులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి పంపిస్తున్నారు.

March 22, 2026 / 02:46 PM IST

బాన్సువాడలో ఉచిత వైద్య శిబిరం

KMR: బాన్సువాడ సంగమేశ్వర కాలనీలో ఆదివారం 7వ వార్డు బీజేపీ కౌన్సిలర్ మానస ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో వైద్యులు ప్రజలకు బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి ఉచితంగా సలహాలు అందించారు. ఈ కార్యక్రమానికి స్థానికుల నుంచి మంచి స్పందన లభించింది, పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీకాంత్, ఉన్నారు.

March 22, 2026 / 02:46 PM IST

సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన

MBNR: హన్వాడ మండలం యారోనిపల్లి గ్రామంలో ఎంపీ నిధులతో మంజూరైన సీసీ రోడ్డు పనులను సర్పంచ్ శవకుల స్వాతి తిరుపతయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధి బీజేపీ తోనే సాధ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈ సురేష్, ఉప సర్పంచ్ మైబమ్మ, కార్యదర్శి లక్ష్మణ్, గ్రామ ప్రజలు రామకృష్ణారెడ్డి, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

March 22, 2026 / 02:45 PM IST

రైతు ఉత్సవాలకు తరలిన అన్నదాతలు

KNR: సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్టలో నిర్వహించనున్న రైతు ఉత్సవాలకు సైదాపూర్ మండల రైతులు ఆదివారం భారీగా తరలివెళ్లారు. లస్మన్నపల్లి, వెన్నంపల్లి, ఆరెపల్లి, సోమారం, గెర్రెపల్లి గ్రామాలకు చెందిన రైతులు ఈ వేడుకల్లో పాల్గొంటారని ఏఈవో ప్రశాంత్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనే ఈ బహిరంగ సభకు రైతులు, కాంగ్రెస్ నాయకులు ఉత్సాహంగా తరలివెళ్లారు.

March 22, 2026 / 02:44 PM IST

MLA సమక్షంలో BRSలో చేరికలు

ADB: తలమడుగు మండలంలోని కజ్జర్ల గ్రామానికి చెందిన మహర్ కులస్తులు MLA అనిల్ జాదవ్ సమక్షంలో BRS పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఎమ్మెల్యే నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమానికి ఆకర్షితులై BRS పార్టీలో చేరుతున్నట్లు నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధికార ప్రతినిధి కిరణ్ తదితరులున్నారు.

March 22, 2026 / 02:36 PM IST

మాజీ ఎంపీపీని పరామర్శించిన మాజీ మంత్రి

MHBD: కురవి మండలం మొగిలిచర్ల గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ మింగు సమ్మయ్య ఇటీవల అనారోగ్యానికి గురై హాస్పిటల్‌లో చికిత్స పొంది ప్రస్తుతం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఆదివారం వారి నివాసానికి వెళ్లి సమ్మయ్యను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

March 22, 2026 / 02:36 PM IST

గుడి–బడి పక్కనే మద్యం దందా..!

BDK: బూర్గంపాడు మండలంలో అక్రమ మద్యం విక్రయాలు విస్తృతంగా జరుగుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంఆర్‌పీ కంటే ఎక్కువ ధరలకు మద్యం విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గుడులు, పాఠశాలల సమీపంలో కూడా బెల్ట్ షాపులు నడుస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

March 22, 2026 / 02:35 PM IST

‘ఇంటింటికి సీపీఐ విజయవంతం చేయాలి’

MNCL: ఏప్రిల్ 1 నుంచి 10 వరకు ఇంటింటికి సీపీఐ విజయవంతం చేయాలని రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేన శంకర్ పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కార్యవర్గ సభ్యులు మేకల దాసు అధ్యక్షతన జరిగిన జిల్లా సమితి సమావేశంలో మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో పోటీ చేయాలని కోరారు. జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ పాల్గొన్నారు.

March 22, 2026 / 02:34 PM IST

కట్టంగూరులో నాల్గొవ రోజు విశేష పూజలు!

NLG: కట్టంగూరు మండల కేంద్రంలోని శ్రీలక్ష్మీనారాయణ స్వామి దేవస్థానంలో శ్రీరామ నవమి వసంత నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా  నాల్గొవ రోజు ఆదివారం స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు ప్రారంభించారు. లోక కల్యాణార్థం ఆలయ ప్రాంగణంలో శ్రీరామ హోమం వైభవంగా జరిగింది.

March 22, 2026 / 02:30 PM IST

భక్తులు మాల దీక్షతో ఆంజనేయ ఉత్సవం

ADB: జైనూర్, సిర్పూర్ (యు) లింగాపూర్ మండలాల భక్తులు జైనూర్ ఆంజనేయ స్వామి ఆలయంలో 11 రోజుల మాల దీక్షలకు శ్రీకారం చుట్టారు. ఆలయ పురోహితుడు పండిత్ కులకర్ణి మహారాజ్ మాలాధారణ చేస్తూ దీక్ష ప్రారంభించారు. భక్తులు “జై హనుమాన్, జై శ్రీరామ్” అంటూ ఉత్సాహభరితంగా భక్తి భావాన్ని చాటుకున్నారు.

March 22, 2026 / 02:30 PM IST

వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న మంత్రి

JGL: గొల్లపల్లి మండలం వెనుగుమట్ల బొంకూర్‌లోని వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఇవాళ దర్శించుకున్నారు. పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి, బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు తెలుసుకుని భక్తులకు సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఈనెల 23 నుంచి 25 వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి.

March 22, 2026 / 02:29 PM IST

HYDలో నిరుద్యోగ ఉద్యమం తప్పదు..!

HYD: ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి, ఇప్పటి వరకు నెరవేర్చలేదని HYD ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులన్నారు. కనీసం ఇప్పటివరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడం, అసెంబ్లీలో ప్రస్తావించకపోవడంపై ఆగ్రహించారు. ఇది ఇలాగే కొనసాగితే, రాబోయే కొద్ది రోజుల్లోనే నిరుద్యోగ ఉద్యమం తప్పదని ప్రభుత్వానికి హెచ్చరించారు.

March 22, 2026 / 02:28 PM IST

కాంగ్రెస్ బడ్జెట్‌పై బీఆర్ఎస్ విమర్శలు

WGL: వర్ధన్నపేట పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో మండల అధ్యక్షుడు కుమారస్వామి, మాజీ జడ్పీటీసీ బిక్షపతి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ బడ్జెట్‌పై నాయకులు తీవ్రవిమర్శలు చేశారు. అమలు కాని హామీలతో అధికారంలోకి వచ్చి, 2026-27బడ్జెట్‌లో వాటి అమలుకు నిధులు కేటాయించలేదని ఆరోపించారు. అన్నివర్గాలను నిరాశపరిచేలా బడ్జెట్ ఉందని తెలిపారు.

March 22, 2026 / 02:28 PM IST

పోగొట్టుకున్న ఫోన్.. గంటలో రికవరీ

PDPL: ధర్మారం మండల కేంద్రానికి చెందిన డాక్టర్ స్పందన ధర్మారం ఎండపల్లి బైపాస్ రోడ్డు మార్గంలో బైక్‌పై వెళ్తుండగా సెల్ ఫోన్ పోగొట్టుకుంది. వెంటనే ఆమె పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్సై ప్రవీణ్ కుమార్, సిబ్బంది సతీష్ కలిసి ఎంక్వయిరీ చేపట్టి, కొత్తపల్లిలో ఓ వ్యక్తి వద్ద ఫోన్ ఉన్నట్లు గుర్తించి, గంట సమయం లోపు బాధితురాలికి అప్పగించారు.

March 22, 2026 / 02:24 PM IST

‘ది హ్యూమన్ ఆర్ట్’ పుస్తక ఆవిష్కరణ

SRCL: చందుర్తి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గొట్టె ప్రభాకర్ కుమారుడు గొట్టె అనిరుద్ రచించిన “ది హ్యూమన్ ఆర్ట్” పుస్తకాన్ని వేములవాడలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆవిష్కరించారు. మూడు భాషల్లో రచించిన ఈ పుస్తకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అనిరుద్ వృత్తి రీత్యా సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తూనే తన ఖాళీ సమయాల్లో రచనా కొనసాగించారన్నారు.

March 22, 2026 / 02:23 PM IST